యాచారం: మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వడగళ్లతో మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి, నల్లవెల్లి, నానక్‌నగర్, చింతపట్ల, నక్కగుట్ట తండా, మల్కీజ్‌గూడ, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో దాదాపు 500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. నక్కగుట్ట తండాలో ఈదురుగాలులకు ఓ ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి. చింతపట్లలో రైతు అచ్చెన రమేష్‌కు చెందిన రూ. లక్ష విలువైన రెండు పాడి ఆవులు పిడుగుపాటుతో మృతి చెందాయి. సింగారం, నందివనపర్తి, తమ్మలోనిగూడ, మాల్ తదితర గ్రామాల్లో మామిడికాయలు నేలరాలాయి. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్, విస్తరణ అధికారి లక్ష్మణ్ తదితరులు దెబ్బతిన్న పంటల ను సోమవారం పరిశీలించారు. నివేదిక అం దజేయాలని ఆయా గ్రామాల ఆదర్శ రైతు లు, రెవెన్యూ కార్యదర్శులకు సూచించారు.
శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: మండలంలోని పెద్దతూప్ర, పాల్మాకులలో సోమవారం హోరుగాలి, వడగళ్లతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పెద్దతూప్రలో మల్లెల యాదయ్య ఇంటి సమీపంలోని ఓ తుమ్మ చెట్టు, కరెంటు స్తంభం నేలకొరిగి ఇంటి గోడ పాక్షికంగా ధ్వంసమయ్యింది. పాల్మాకులలో ఎం.చంద్రయ్య, రుక్కమ్మ ఇళ్ల పైకప్పు రేకులు, పిల్లోనిగూడ రోడ్డులో పశువుల డెయిరీఫాం రేకులు గాలివానకు ఎగిరిపోయాయి. పి.యాదయ్య ఇంటిపై చెట్టు కొమ్మలు విరిగిపడడంతో పైకప్పు రేకులు విరిగిపడ్డాయి. ఇంట్లో ఉన్న వారిపై రేకుల ముక్కలు పడడంతో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. పెద్దతూప్ర, పెద్దతూప్రతండా, ఇనాంషేరి, పిల్లోనిగూడ, అచ్చం పేట, పాల్మాకుల, ముచ్చింతల్ గ్రామాల్లోని పంటలకు వాటిల్లింది. వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి.
ఈదురుగాలుల బీభత్సం
Published Tue, Apr 15 2014 12:10 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement