సిద్దిపేట పట్టణంలో గురువారం రాత్రి కురిసిన వర్షం పట్టణాన్ని ముంచెత్తింది. జడివానకు వీధులన్నీ జలమయమయ్యాయి.
మెదక్: సిద్దిపేట పట్టణంలో గురువారం రాత్రి కురిసిన వర్షం పట్టణాన్ని ముంచెత్తింది. జడివానకు వీధులన్నీ జలమయమయ్యాయి. సాయంత్రం ఆరున్నర నుంచీ రాత్రి 8:30 వరకు కురిసిన వర్షం గాలి దుమారంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిది. దీంతో పట్టణమంతా అంధకారం నెలకొంది. పట్టణంలోని మార్కెట్ యార్డుకు అమ్మకానికి తెచ్చిన రైతుల ధాన్యం తడిసి ముద్దయ్యింది. రైతులు టార్పాలిన్‌లతో ధాన్యాన్ని తడవకుండా తంటాలు పడ్డారు.
అదే విధంగా రైతు బజార్‌లో అమ్మకానికి ఉంచిన కూరగాయలు అకాల వర్షపు నీటిలో కొట్టుకు పోయాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న డెక్కన్ చైర్ ఎగ్జిబిషన్ వెలివేషన్ తాత్కాలిక కట్టడాలు నేలకొరిగాయి. ఎగ్జిబిషన్‌లో ప్రధాన ఆకర్షనగా నిలిచిన బారీ జాయింట్ వీల్ గాలి దుమారానికి పక్కకు ఒరిగి పోయింది. వర్షం కారణంగా ఎగ్జిభిషన్‌కు సందర్శకులు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నియోజక వర్గంలోని చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట మండలాల్లోని ఆయా గ్రామాల్లో కొద్దిపాటి వర్షం కురిసిందని సమాచారం.