నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వర్షానికి తడిసిన ధాన్యం
నిజామాబాద్/కామారెడ్డి నెట్‌వర్క్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శని వారం ఉదయం 10 గంటల వరకు కురిసిన అకాల వర్షానికి కల్లాలు, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి పోయింది. పలుచోట్ల వర్షపు నీటి ప్రవాహంలో వడ్లు కొట్టుకుపోయాయి.
చేతికందిన పంటను అమ్ముకు నే సమయంలో వర్షం దెబ్బతీయడంతో రై తులు కంటతడి పెడుతున్నారు. ఆర్మూరు, ఆలూర్, ఎడపల్లి, వర్ని, చందూర్, మోస్రా, సాలూర, రుద్రూర్, కోట గిరి, పొతంగల్, రెంజల్, మాక్లూర్, డొంకేశ్వర్ మండలాల్లో రైతుల కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, లింగంపేట, పి ట్లం, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలా ల్లో రోడ్లపై ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది.
ధాన్యం రాశుల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో పోలీసుస్టేషన్ సమీపంలో రోడ్లపై ఉన్న ధాన్యం రాశుల మధ్య నీరు భారీగా చేరడంతో మోటార్ల సహాయంతో తొలగించారు. వర్షాలతో అంతటా వరి కోతలకు బ్రేక్ పడింది.
Comments
Please login to add a commentAdd a comment