ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్‌కు గ్రామ సమస్యలు విన్నవిస్తున్న మహిళలు
బజార్‌హత్నూర్: తెలంగాణలో రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. బుదవారం దేగామలో ముంపు బాధితులకు నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సన్మాన కార్యక్రమంలో పాల్గొని మా ట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని బతికించుకోవడానికి, రైతు అప్పుల్లో కూరుకుపోకుండా, రైతుకు అండగా నిలవడానికి ఖరీఫ్‌కు ఎకరాకు రూ.4 వేలు, రబీ సాగుకు రూ.4 వేలు అందిస్తోందని తెలిపారు. ఇప్పటికే పంట రుణమాఫీ చేశామని, భవిష్యత్‌లో రైతు మరణిస్తే కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థిక తోడ్పాటు అందించేందుకు రూ.5 లక్షల బీమా కల్పించేందుకు రైతు బీమా పథకం తీసుకువచ్చామని తెలిపారు.
మూడోవిడతలో 130 కుటుంబాలకు పునరావసంకోసం నిధులు మంజూరు చేశామని తెలిపారు. ముంపు గ్రామం దేగామలో మొదటి, రెండోవిడతల్లో పునరావాసం కింద 156 కుటుంబాల కాలనీలకు మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. దేగామ గ్రామంలో మిగతా 190 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని, ఎగువ ప్రాంతంలోకి తరలించాలని ఎమ్మెల్యేకు గ్రామస్తులు, మహిళలు విన్నవించారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమ రాంరెడ్డి, సర్పంచ్‌లు లక్ష్మన్, గుంజాల భాస్కర్‌రెడ్డి, విద్యాసాగర్, ప్రహ్లాద్, ఎంపీటీసీ గంగాప్రసాద్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు చిల్కూరి భూమన్న, నాయకులు కానిందే రాజారాం, మడ్గె రమణ, భగత్ వినోద్, కొడారి నరేశ్, సకేశ్, విజయ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment