MLA Rathod bapu rao
-
గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం
సాక్షి,తాంసి: నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ గ్రామాలకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. ఆదివారం తాంసి మండలంలోని బండల్‌నాగాపూర్ గ్రామంలో బుడగ జంగం సంఘం ఆధ్వర్యంలో భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి గ్రామంలో నిర్వహించిన గ్రామస్తుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండల్‌నాగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమెల్యే రాథోడ్ బాపూరావును బుడగ జంఘం సంఘం నాయకులు పూలమాల శాలువాతో సన్మానించారు. పిప్పల్‌కోటి గ్రామంలో ఎమ్మెల్యేను నూతనంగా ఎన్నికైన సర్పంచ్, పాలకవర్గసభ్యులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ పిప్పల్‌కోటి గ్రామంలో 368 కోట్ల రూపాయల రిజర్వాయర్ నిర్మాణంతో గ్రామంలో చుట్టుపక్కల భూములు సస్యశ్యామలంగా మారుతాయన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి రైతులు భూములను అందించటం అభినందనీయమన్నారు. భూములను అందించిన రైతులకు నష్టపరిహారంతో పాటు అన్నివిధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములందించి సహకరించిన పిప్పల్‌కోటి గ్రామాన్ని దత్తత తీసుకొని అబివృద్ధి చేస్తానని గ్రామస్తులకు తెలిపారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
బజార్హత్నూర్: తెలంగాణలో రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. బుదవారం దేగామలో ముంపు బాధితులకు నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సన్మాన కార్యక్రమంలో పాల్గొని మా ట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని బతికించుకోవడానికి, రైతు అప్పుల్లో కూరుకుపోకుండా, రైతుకు అండగా నిలవడానికి ఖరీఫ్‌కు ఎకరాకు రూ.4 వేలు, రబీ సాగుకు రూ.4 వేలు అందిస్తోందని తెలిపారు. ఇప్పటికే పంట రుణమాఫీ చేశామని, భవిష్యత్‌లో రైతు మరణిస్తే కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థిక తోడ్పాటు అందించేందుకు రూ.5 లక్షల బీమా కల్పించేందుకు రైతు బీమా పథకం తీసుకువచ్చామని తెలిపారు. మూడోవిడతలో 130 కుటుంబాలకు పునరావసంకోసం నిధులు మంజూరు చేశామని తెలిపారు. ముంపు గ్రామం దేగామలో మొదటి, రెండోవిడతల్లో పునరావాసం కింద 156 కుటుంబాల కాలనీలకు మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. దేగామ గ్రామంలో మిగతా 190 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని, ఎగువ ప్రాంతంలోకి తరలించాలని ఎమ్మెల్యేకు గ్రామస్తులు, మహిళలు విన్నవించారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమ రాంరెడ్డి, సర్పంచ్‌లు లక్ష్మన్, గుంజాల భాస్కర్‌రెడ్డి, విద్యాసాగర్, ప్రహ్లాద్, ఎంపీటీసీ గంగాప్రసాద్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు చిల్కూరి భూమన్న, నాయకులు కానిందే రాజారాం, మడ్గె రమణ, భగత్ వినోద్, కొడారి నరేశ్, సకేశ్, విజయ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
దేశానికి ఆదర్శం టీఆర్ఎస్ ప్రభుత్వం
గుడిహత్నూర్ : దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వం మనదని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని సీతాగోంది జాతీయ రహదారి నుంచి మల్కాపూర్ మీదుగా మాలే బోరిగాం వరకు రూ.186 లక్షలు, మండల కేంద్రంలోని పెట్రోల్ పంపు నుంచి దాజీతండా వరకు రూ.140 లక్షలతో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మించి చేపట్టనున్న బీటీ రోడ్లకు వీరు భూమి పూజ చేసి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం మునుపు ఎన్నడూ లేని విధంగా తీసుకొస్తున్న విప్లవాత్మక నిర్ణయాలు పథకాలు దేశంలో ప్రథమస్థానంలో నిలిచాయన్నారు. అన్ని సమాజిక వర్గాలకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ అందిస్తున్న పథకాలు ప్రజాదరణ పొందడమే కాకుండా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అంతకు ముందు వీరు శిలాఫలకాలను ఆవిçష్కరించి పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు ఉయిక కమల, రాథోడ్ ప్రతాప్, ఏఎంసీ చైర్మన్ ఆడే శీల, ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, జెడ్పీటీసీ కేశవ్ గిత్తే, ఎంపీటీసీ లక్ష్మీ, రైతు సమితి మండల కన్వీనర్ కరాఢ్ బ్రహ్మానంద్, జిల్లా టీఆర్ఎస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, సర్పె సోంబాయి, జాదవ్ రమేశ్, ఎండీ గఫార్, అబ్దుల్ గపార్, వామన్ గిత్తే, పాటిల్ రాందాస్, విలాస్ తదితరులు ఉన్నారు. -
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ
బోథ్ : బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో 25 బిర్లాగొంది గ్రామంలో 20 ఇళ్లకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ భూమిపూజ నిర్వహించారు. గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా రానున్న రోజుల్లో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. అధికారంకోసం కాంగ్రెస్ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు. అనంతరం బోథ్ మండలకేంద్రానికి చెందిన ఉప సర్పంచ్ పాషా సోదరుడు రహమాన్, కుచులాపూర్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సంటెన్నల కుటుంబాలను పరామర్శించారు. వారి వెంట ఐసీడీఎస్ జిల్లా సమన్వయకర్త కస్తాల ప్రేమల, ఎంపీపీ గంగుల లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల శారద, టీఆర్ఎస్ కన్వీనర్ రుక్మణ్ సింగ్, ఎంపీటీసీలు రాయల్, వెంకటరమణ, గ్రంథాలయ డైరెక్టర్ రమణగౌడ్, జగన్మోహన్రెడ్డి, గంగుల మల్లేశ్, దేవన్న, గంగారెడ్డి, సత్యనారాయణ, సాయిరెడ్డి, సదానందం పాల్గొన్నారు. -
అభిప్రాయాలకే పెద్దపీట..!
► కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యం ► నాయకుల్లో చిగురించిన ఆశలు ► నామినేటెడ్ పోస్టుల భర్తీపై జోరుగా ఊహాగానాలు ► మార్కెట్ కమిటీ పదవికి పోటీ తీవ్రం నేరడిగొండ : నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. పదవులు భర్తీ చేస్తారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. బోథ్, ఇచ్చోడ వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. అయితే పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతుండడంతో బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలంలోని టీఆర్ఎస్ నాయకుల్లో ఆశలు చిగురించాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల్, డెరైక్టర్ల ఎంపికపై స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఇప్పటి వరకు తన స్పష్టత ఇవ్వకపోవడంతో ఆశవహులు ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. బోథ్, ఇచ్చోడ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవికి తీవ్ర పోటీ ఉన్న పరిస్థితుల్లో నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకే ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు టీఆర్ఎస్ నాయకులు తాము పార్టీకి చేసిన సేవలు వివరిస్తూ తమ బలాన్ని చూపుతున్నారు. కుల సంఘాలు, రైతు నాయకులు, పార్టీ శ్రేణులు తమకు అనుకూలంగా ఉన్నారని వారు ఎమ్మెల్యేకు వివరిస్తున్నారు. తమ పని తీరును గుర్తించి పదవిని ఇవ్వాలని కోరుతున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవాలని ఎమ్మెల్యే భావిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉండడంతో ఎవరినీ నిరుత్సాహపరచకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందరినీ సమన్వయ పరిచి అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు.