Rice grain
-
తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తాం
ఖమ్మం వన్‌టౌన్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షంతో వరి ధాన్యం తడిసిపోయిన నేపథ్యంలో రైతులు అధైర్య పడొద్దని.. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కిసాన్ కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంటున్నామని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ పూర్తిచేసి.. ఎంత మంది రైతులకు, ఎన్ని కోట్ల రుణమాఫీ చేశామనేది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో చెబుతామని తెలిపారు. కాగా, రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం కలిగేలా పంటల బీమా పథ కాన్ని అమలు చేస్తూ, ప్రీమియం సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి చెప్పారు. ఇక విత్తన కంపెనీలతో ఇబ్బందులు లేకుండా రైతులకు విత్తనాలు అందేలా ప్రభుత్వం సహాయకారిగా నిలుస్తుందన్నారు. కాగా, ఆయిల్‌పామ్‌తో లాభాలు గడించే అవకాశమున్నందున రైతులు ఆ దిశగా దృష్టి సారించాలని సూచించారు. ఇక పంట నష్టపరిహారం సైతం త్వరలో అందిస్తామని, వచ్చే ఖరీఫ్ నుంచి పెంచిన ఎకరాకు రూ.15వేల చొప్పున రైతు భరోసా పంపిణీ ప్రారంభిస్తామని తుమ్మల తెలిపారు. కాగా, నల్లగొండలో ఎంపీ అభ్యర్థికి 5 లక్షల మెజార్టీ ఇస్తామని అక్కడి నేతలు చెబుతున్నందున, ఆ మెజార్టీ దాటేలా ఖమ్మం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
చిన్నారి కంటి నుంచి వస్తోన్న ప్లాస్టిక్, పేపర్ ముక్కలు, బియ్యం గింజలు
-
కంట్లో నుంచి ప్లాస్టిక్ కవర్లు..
-
కంటిలో నుంచి బియ్యపు గింజలు.. బాలిక నరకయాతన..
-
నంబర్ 1 ధర: మసూరి బువ్వ.. నేటికీ వారెవ్వ!
ఆ రోజుల్లో తెల్లబువ్వ అపురూపం. వరి అన్నాన్ని ‘ఆబువ్వ’గా.. బెల్లపు అన్నాన్ని ‘సాంబువ్వ’గా పరిగణిస్తున్న రోజులవి. బియ్యం వండుకునే అవకాశం కొందరికే పరిమితమైన ఆ రోజుల్లో వరి సాగును విస్తృతం చేయాల్సిన, అధిక దిగుబడి ఇచ్చే వంగడాల్ని రపొందించాల్సిన బాధ్యత వ్యవసాయ శాస్త్రవేత్తలపై పడింది. ఆ కృషి ఫలించి వచ్చిందే సాంబ మసూరి (బీపీటీ–5204). సాక్షి, అమరావతి: సంప్రదాయ విత్తనాలకు భిన్నంగా అధిక దిగుబడుల్చిన వంగడం సాంబ మసరి (బీపీటీ–5204). వరి చరిత్రలో ఇదో సంచలనమే. ఈ వంగడం పురుడు పోసుకున్నది గుంటరు జిల్లా బాపట్ల వ్యవసాయ పరిశోధన కేంద్రంలోనే అయినా.. దాని సృష్టికర్త మాత్రం అనంతపురం జిల్లా కదిరి తాలకా ఎద్దులవారి పాలెం గ్రావనికి చెందిన డాక్టర్ మొరవపల్లి వెంకట రమణారెడ్డి (డాక్టర్ ఎంవీ రెడ్డి). 1921లో విడుదల చేసిన కిలీ సాంబగా పిలిచే జీఈబీ–24, తైచుంగ్ (నేటివ్)–1, మసరి రకాలను సంకరం చేసి ప్రతిష్టాత్మక వరి వంగడం బీపీటీ–5204ను అభివృద్ధి చేశారు. 1986లో సాంబ మసరి పేరిట విడుదలైన ఈ రకం వరి రైతుల విశేష ఆదరణ పొందింది. ఎలా రూపొందించారంటే.. ► తొలుత జీఈబీ 24, తైచుంగ్ నేటివ్–1 వరి వంగడాలను సంకరపరిచారు. ► వీటినుంచి వచ్చిన రెండో సంతతి (ఎఫ్–2 జనరేషన్)లో మంచి మొక్కలను ఎంపిక చేసి.. వాటిని మసూరి వంగడంతో సంకరం చేశారు. ► వీటినుంచి వచ్చిన సంతతిని జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ పద్ధతిలో పరీక్షించి వాటిలో మేలైన వేలాది మొక్కల్ని మరో చేలో నాటి ప్రతి మొక్కకూ పరీక్ష జరిపారు. ► లక్ష్యానికి దగ్గర్లో ఉన్న మొక్కల్ని మరో చేలో నాటి తుది వంగడం తయారు చేశారు. మొత్తంగా ఈ వంగడం అభివృద్ధి చేయడానికి 8 సంవత్సరాలు పట్టింది. ► ఈ వంగడం తయారీలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మొరవపల్లి వెంకట రమణారెడ్డి (ఎంవీ రెడ్డి) కాగా.. ప్రొఫెసర్ నందేల శ్రీరామ్‌రెడ్డి, ఎల్వీ సత్యనారాయణ, డాక్టర్ డి.సుబ్రహ్మణ్యం, ఎస్ఎస్డీవీ ప్రసాద్ పాలుపంచుకున్నారు. ఆ బృందానికి వ్యవసాయాధికారి బుచ్చయ్య చౌదరి సహకారం అందించారు. ► ఈ విత్తనాలు 1986 ఖరీఫ్ సీజన్లో మార్కెట్లోకి విడుదలయ్యాయి. ► సాంబ మసరి రకానికి ఆయా ప్రాంతాలను బాపట్ల మసరి, ఆంధ్రా మసరి, కర్నలు సోనా, జీలకర్ర మసరి, సీరగ పొన్ని వంటి పేర్లు కూడా ఉన్నాయి. ఎకరానికి 35, 40 బస్తాల దిగుబడి.. దేశవ్యాప్తంగా బీపీటీ–5204 వంగడం పేరు మార్మోగింది. నాణ్యత, అధిక దిగుబడి, అద్భుతమైన రుకరమైన ఆహారంగా పేరొందింది. దేశవ్యాప్తంగా 40 లక్షల హెక్టార్లలో బీపీటీ–5204 రకం సాగు కావడం విశేషం. ఎకరానికి 15, 20 బస్తాల మిం పండని దశలో సాంబ మసరి ఎకరానికి 35, 40 బస్తాల దిగుబడిన్చింది. ఈ వంగడం నాణ్యత దృష్ట్యా రైతులకు లాభదాయకమైన ధర కూడా లభింంది. ఈ వంగడంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఐసీఏఆర్, ఐఆర్ఆర్ఐ (మనీలా) సంస్థలు సాంబ మసూరిని విటమిన్–ఏతో కలిపి పోర్టిఫైడ్ చేసి గోల్డెన్ రైస్ పేరిట విడుదల చేసేందుకు సహకరించాయి. బీపీటీ 5204 వంగడాన్ని ఉపయోగించుకునే ఆ తర్వాత చాలా యూనివర్శిటీలు, అంతర్జాతీయ సంస్థలు పరిశోధనలు చేయడం గమనార్హం. ప్రపంచ దేశాల్లోనూ ఖ్యాతి బియ్యాన్ని తినే ఏ ప్రాంతానికి.. ఏ దేశానికి వెళ్లినా ముందు వినిపించే పేరు సాంబ మసరి. ఈ బియ్యం ఎగుమతితో భారత దేశానికి విదేశీ మారక ద్రవ్యం పెరిగింది. దేశీయంగా రైతుల ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఇప్పటికీ మార్కెట్లో నంబర్ వన్ ధర దేనికైనా లభిస్తుందంటే అది సాంబ మసరి వత్రమే. మార్కెట్లోకి వచ్చి మూడున్నర దశాబ్దాలు గడిచినా బీపీటీ–5204 రకం పేరు ప్రతిష్టలు పెరిగాయే తప్ప తరిగిపోలేదు. -
ఆగమాగం!
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి వరంగల్, మంచిర్యాల జిల్లాల్లో శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షం రైతులను ఆగం చేసింది. మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో భారీ వర్షం కురవగా.. జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లితో పాటు వరంగల్ అర్బన్ జిల్లాలోనూ వర్షం కురిసింది. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. అంతా నిద్రలో ఉన్న సమయంలో వర్షం కురవగా రైతులు తేరుకుని కొనుగోలు కేంద్రాలకు వచ్చే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాంటాలు కాని ధాన్యంతో పాటు కాంటాలు పూర్తయిన ధాన్యం కూడా తడిసిపోయింది. లారీల కొరత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు పూర్తయిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించడం లేదు. దీంతో తీరని నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంచిర్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో జనం బెంబేలెత్తిపోయారు. పలు చోట్ల ఇళ్లపైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు పడిపోయాయి. జిల్లావ్యాప్తంగా సగటున 41.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భీమారంలో 110 మిల్లీమీటర్ల వర్షం పడింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. అర్ధరాత్రికావడం.. భారీ వర్షం రావడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు ఆగమాగం అయ్యారు. జిల్లావ్యాప్తంగా 155 విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ శాఖకు సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో కారుపై పడిన చెట్టు -
నాణ్యత పాటిస్తే మద్దతు!
వరి ధాన్యం గ్రేడ్ ఏ రకం క్వింటాలుకు రూ.1,400, సాధారణ రకం రూ.1,360, పత్తి (పొడవు పింజ రకం) రూ.4,050, పత్తి (మధ్యరకం) రూ.3,750, మొక్కజొన్న రూ.1,310, సోయాబీన్ (పసుపు పచ్చ) రూ.2,560, సోయాబీన్ (నలుపు) రూ.2,500, కందులు రూ.4,350, మినుములు రూ.4,350, పెసలు రూ.4,600, వేరుశనగ కాయ రూ.4,000, పొద్దుతిరుగుడు రూ.3,750, సజ్జలు రూ.1,250, జొన్నలు (హైబ్రిడ్) రూ.1,530, జొన్నలు (మలదండి) రూ.1,550, రాగులు రూ.1,550, నువ్వులు రూ.4,600 మద్దతు ధర ప్రకటించిందన్నారు. వడ్లు ఆరబోసి తేవాలి వరి పంట కోసిన తర్వాత మట్టి పెళ్లలు, రాళ్లు, చెత్త, తాలు రంగు మారిన, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యం, పూర్తిగా తయారు కాని, ముడుచుకుపోయిన ధాన్యం, తక్కువ రకాల మిశ్రమం, తేమ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్‌కు తరలించే ధాన్యాన్ని బాగా ఆరబోసి తేమ శాతం ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ధాన్యం ఎండిన తర్వాత 17 శాతం కన్నా ఎక్కువ తేమ లేకుండా చూసుకుని విక్రయానికి తరలించాలి. మక్కలను బాగా ఎండనివ్వాలి మొక్కజొన్న ధాన్యంలో వ్యర్థ పదార్థాలు, ఇతర తిండి గింజలు, దెబ్బతిన్న, రంగు మారిన గింజలు, పరిపక్వం కానీ నాసిరకం, పుచ్చిపోయిన గింజలు లేకుండా ఉండాలి. మొక్కజొన్న కంకులను ఒలిచేందుకు మిషన్లను వాడటం వల్ల జొన్నలు పాడవకుండా వస్తాయి. బూజుపట్టిన, రంగుమారిన కంకులను మంచి కంకుల్లో కలవకుండా చూడాలి. కంకులను ఒలిచిన తర్వాత రెండు రోజుల పాటు ఎండలో బాగా ఆరబెట్టాలి. తెగుళ్లు సోకిన, రంగు మారిన ముడుచుకుపోయిన గింజలను సాధ్యమైనంత వరకు ఏరేయాలి. రాళ్లు, మట్టిపెడ్డలు, చెత్తాచెదారం వంటి వ్యర్థాలు లేకుండా చూడాలి. పత్తిలో చెత్త ఉండొద్దు పత్తిమొక్క సహజమైన రంగు మారకూడదు. పత్తిలో అపరిపక్వమైన కాయలను వేరు చేయాలి. ఎండిన ఆకులు, కొమ్మలు, రెమ్మలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసుకోవాలి. తేమ ఎక్కువగా ఉండటం వల్ల పత్తి రంగు మారి పోగుల నాణ్యత తగ్గుతుంది. బాగా ఆరి, శుభ్రం చేసిన పత్తినే మార్కెట్‌కు తరలించాలి. పత్తిలో 8 శాతం మాత్రమే తేమ ఉండాలి. 12 శాతంకంటే ఎక్కువ ఉంటే బాగా ఎండబెట్టిన తర్వాత మార్కెట్‌కు తీసుకెళ్లాలి. -
గుండె కోత
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : అకాలవర్షంతో చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. వరిపైరు నేలకొరిగి గింజలు రాలాయి. చేతికొచ్చిన ధాన్యం మార్కెట్ యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచగా తడిసింది. దీంతో తడిసిన ధాన్యానికి మద్దతు ధర దక్కదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల రైతులు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనలు చేపట్టారు. మామిడి రైతులదీ ఇదే పరిస్థితి ఉంది. నేలరాలడంతో మామిడి దెబ్బతిని నాణ్యత కోల్పోయింది. దీంతో మార్కెట్లో సగం ధర కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదుకోవాలని ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.5 కోట్ల పంట నష్టం సంభవించినట్లు అంచనా. ధర దక్కేనా? జిల్లాలో 3 వేల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. మంచిర్యాల, దండేపల్లి, నిర్మల్, లక్సెట్టిపేట, జన్నారం, సారంగాపూర్, కుంటాల, ముథోల్, దిలావర్పూర్, మామడలో వరిపైరు నేలకొరిగింది. 5 వేల క్వింటాళ్ల వరి ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం త డిసింది. అధికంగా దండేపల్లి, జన్నారం మండలాల్లో తడిసిన ధాన్యం రంగు మారి నాణ్యత కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో మద్దతు ధర వస్తుందో లేదోనని రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ గ్రేడ్-ఏ రకానికి రూ.1345, ఇతర రకాలకు రూ.1310 చొప్పున మద్దతు ధర చెల్లిస్తున్నారు. తడిసిన ధాన్యానికి నాణ్యత లేదంటూ కొనుగోలు కేంద్రాల్లో నిరాకరిస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. సన్నరకాలను కొనుగోలు చేస్తూ మిగతా రకాల కొనుగోలుకు నిరాకరిస్తుండడంతోనే ఆయా కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దండేపల్లి, జన్నారం, జైపూర్, నెన్నెల, వేమనపల్లి, కోటపల్లి, ఖానాపూర్‌లో సుమారు 550 ఎకరాల్లో మామిడి నేల రాలినట్లు ఉద్యానవన శాఖాధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మామిడి టన్నుకు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు ధర లభిస్తోంది. దెబ్బతిన్న మామిడికి రూ.10వేల లోపే ఇస్తుండడంతో ఆయా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగజ్‌నగర్, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, తరోడాలో కూరగాయల పంటలకు కూడా నష్టం చేకూరింది. నిర్మల్, దిలావర్పూర్, సారంగాపూర్, మామడ, లోయెశ్ర, ముథోల్‌లలో మిరప సుమారు 150 ఎకరాల్లో నష్టం చేకూరింది. కళ్లాలలోని ఎండు మిరప తడిసిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. జిల్లాలో గుంటూ రు సన్నాలను అధికంగా పండిస్తారు. క్వింటాలుకు రూ.5,500 నుంచి రూ.6వేల ధర ఉండ గా తడిసిన మిరపకు మద్దతు ధర వచ్చే పరిస్థి తి లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కళ్లాలలో ఆరబెట్టిన పసుపు కొమ్ములు తడిసిపోవడంతో వాటికి కూడా మద్దతు ధరలు లభించలేని పరిస్థితి ఉంది. రంగు మారి నాణ్యత కోల్పోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది.