వరి ధాన్యం గ్రేడ్ ఏ రకం క్వింటాలుకు రూ.1,400, సాధారణ రకం రూ.1,360, పత్తి (పొడవు పింజ రకం) రూ.4,050, పత్తి (మధ్యరకం) రూ.3,750, మొక్కజొన్న రూ.1,310, సోయాబీన్ (పసుపు పచ్చ) రూ.2,560, సోయాబీన్ (నలుపు) రూ.2,500, కందులు రూ.4,350, మినుములు రూ.4,350, పెసలు రూ.4,600, వేరుశనగ కాయ రూ.4,000, పొద్దుతిరుగుడు రూ.3,750, సజ్జలు రూ.1,250, జొన్నలు (హైబ్రిడ్) రూ.1,530, జొన్నలు (మలదండి) రూ.1,550, రాగులు రూ.1,550, నువ్వులు రూ.4,600 మద్దతు ధర ప్రకటించిందన్నారు.
వడ్లు ఆరబోసి తేవాలి
వరి పంట కోసిన తర్వాత మట్టి పెళ్లలు, రాళ్లు, చెత్త, తాలు రంగు మారిన, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యం, పూర్తిగా తయారు కాని, ముడుచుకుపోయిన ధాన్యం, తక్కువ రకాల మిశ్రమం, తేమ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మార్కెట్‌కు తరలించే ధాన్యాన్ని బాగా ఆరబోసి తేమ శాతం ఎక్కువగా లేకుండా చూసుకోవాలి.
ధాన్యం ఎండిన తర్వాత 17 శాతం కన్నా ఎక్కువ తేమ లేకుండా చూసుకుని విక్రయానికి తరలించాలి.
మక్కలను బాగా ఎండనివ్వాలి
మొక్కజొన్న ధాన్యంలో వ్యర్థ పదార్థాలు, ఇతర తిండి గింజలు, దెబ్బతిన్న, రంగు మారిన గింజలు, పరిపక్వం కానీ నాసిరకం, పుచ్చిపోయిన గింజలు లేకుండా ఉండాలి.
మొక్కజొన్న కంకులను ఒలిచేందుకు మిషన్లను వాడటం వల్ల జొన్నలు పాడవకుండా వస్తాయి.
బూజుపట్టిన, రంగుమారిన కంకులను మంచి కంకుల్లో కలవకుండా చూడాలి.
కంకులను ఒలిచిన తర్వాత రెండు రోజుల పాటు ఎండలో బాగా ఆరబెట్టాలి.
తెగుళ్లు సోకిన, రంగు మారిన ముడుచుకుపోయిన గింజలను సాధ్యమైనంత వరకు ఏరేయాలి.
రాళ్లు, మట్టిపెడ్డలు, చెత్తాచెదారం వంటి వ్యర్థాలు లేకుండా చూడాలి.
పత్తిలో చెత్త ఉండొద్దు
పత్తిమొక్క సహజమైన రంగు మారకూడదు.
పత్తిలో అపరిపక్వమైన కాయలను వేరు చేయాలి.
ఎండిన ఆకులు, కొమ్మలు, రెమ్మలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసుకోవాలి.
తేమ ఎక్కువగా ఉండటం వల్ల పత్తి రంగు మారి పోగుల నాణ్యత తగ్గుతుంది.
బాగా ఆరి, శుభ్రం చేసిన పత్తినే మార్కెట్‌కు తరలించాలి.
పత్తిలో 8 శాతం మాత్రమే తేమ ఉండాలి.
12 శాతంకంటే ఎక్కువ ఉంటే బాగా ఎండబెట్టిన తర్వాత మార్కెట్‌కు తీసుకెళ్లాలి.
నాణ్యత పాటిస్తే మద్దతు!
Published Wed, Nov 5 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement