పత్తి తగ్గించండి.. సోయాబీన్ పెంచండి
♦ జేడీఏలకు వ్యవసాయ శాఖ
♦ కార్యదర్శి పార్థసారథి పిలుపు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్‌లో పత్తిని తగ్గించి సోయాబీన్, కంది వంటి పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి పిలుపునిచ్చారు. వర్షాభావ పరిస్థితులెదురైతే చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ ప్రణాళికపై మంగళవారం జిల్లా వ్యవసా, రాష్ట్రస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. గుజరాత్, మహా రాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో గతేడాది పత్తిని గులాబీ రంగు పురుగు నాశనం చేయడంతో రైతులు పెద్దఎత్తున నష్టపోయారన్నారు. బీటీ-2 పత్తి విత్తనం పురుగును నశింపజేసే శక్తిని కోల్పోయిందన్నారు. కేంద్రం కొత్త బీమా అందుబాటులోకి తెచ్చిందని.. రైతులందరికీ వచ్చే జూలై 31 తుది గడువని వెల్లడించారు.
విత్తన నమూనాలను పరీక్ష చేసి రైతులకు ఇవ్వాలని.. లేకుంటే నకిలీ విత్తనాలు మార్కెట్లో విజృంభించే ప్రమాదముందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కంటే నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ పంట లు తీవ్రంగా నష్టపోయాయన్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే మూడు స్థాయిల్లో ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేయాలన్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనూ సోయాబీన్, అంతర పంటగా కందిని ప్రోత్సహించాలన్నారు. రాబోయే రోజుల్లో వెయ్యి మంది ఏఈవోలు అందుబాటులోకి రానున్నారన్నారు.
శాఖ డెరైక్టర్ ప్రియదర్శిని మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి ైవె పరీత్యాలు సంభవిస్తున్నాయన్నారు. తెలంగాణ వ్యవసాయ వర్సిటీ ప్రొఫెసర్ రాజిరెడ్డి మాట్లాడుతూ 60-70 మిల్లీమీటర్ల వరకు వర్షాలు పడ్డాక... రుతుపవనాలను ప్రకటించాక రైతులు విత్తనాలు వేయాలని సూచించారు.