ఆ రోజుల్లో తెల్లబువ్వ అపురూపం.
వరి అన్నాన్ని ‘ఆబువ్వ’గా.. బెల్లపు అన్నాన్ని ‘సాంబువ్వ’గా పరిగణిస్తున్న రోజులవి. బియ్యం వండుకునే అవకాశం కొందరికే పరిమితమైన ఆ రోజుల్లో వరి సాగును విస్తృతం చేయాల్సిన, అధిక దిగుబడి ఇచ్చే వంగడాల్ని రపొందించాల్సిన బాధ్యత వ్యవసాయ శాస్త్రవేత్తలపై పడింది. ఆ కృషి ఫలించి వచ్చిందే
సాంబ మసూరి (బీపీటీ–5204).
సాక్షి, అమరావతి: సంప్రదాయ విత్తనాలకు భిన్నంగా అధిక దిగుబడుల్చిన వంగడం సాంబ మసరి (బీపీటీ–5204). వరి చరిత్రలో ఇదో సంచలనమే. ఈ వంగడం పురుడు పోసుకున్నది గుంటరు జిల్లా బాపట్ల వ్యవసాయ పరిశోధన కేంద్రంలోనే అయినా.. దాని సృష్టికర్త మాత్రం అనంతపురం జిల్లా కదిరి తాలకా ఎద్దులవారి పాలెం గ్రావనికి చెందిన డాక్టర్ మొరవపల్లి వెంకట రమణారెడ్డి (డాక్టర్ ఎంవీ రెడ్డి). 1921లో విడుదల చేసిన కిలీ సాంబగా పిలిచే జీఈబీ–24, తైచుంగ్ (నేటివ్)–1, మసరి రకాలను సంకరం చేసి ప్రతిష్టాత్మక వరి వంగడం బీపీటీ–5204ను అభివృద్ధి చేశారు. 1986లో సాంబ మసరి పేరిట విడుదలైన ఈ రకం వరి రైతుల విశేష ఆదరణ పొందింది.
ఎలా రూపొందించారంటే..
► తొలుత జీఈబీ 24, తైచుంగ్ నేటివ్–1 వరి వంగడాలను సంకరపరిచారు.
► వీటినుంచి వచ్చిన రెండో సంతతి (ఎఫ్–2 జనరేషన్)లో మంచి మొక్కలను ఎంపిక చేసి.. వాటిని మసూరి వంగడంతో సంకరం చేశారు.
► వీటినుంచి వచ్చిన సంతతిని జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ పద్ధతిలో పరీక్షించి వాటిలో మేలైన వేలాది మొక్కల్ని మరో చేలో నాటి ప్రతి మొక్కకూ పరీక్ష జరిపారు.
► లక్ష్యానికి దగ్గర్లో ఉన్న మొక్కల్ని మరో చేలో నాటి తుది వంగడం తయారు చేశారు. మొత్తంగా ఈ వంగడం అభివృద్ధి చేయడానికి 8 సంవత్సరాలు పట్టింది.
► ఈ వంగడం తయారీలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మొరవపల్లి వెంకట రమణారెడ్డి (ఎంవీ రెడ్డి) కాగా.. ప్రొఫెసర్ నందేల శ్రీరామ్‌రెడ్డి, ఎల్వీ సత్యనారాయణ, డాక్టర్ డి.సుబ్రహ్మణ్యం, ఎస్‌ఎస్‌డీవీ ప్రసాద్ పాలుపంచుకున్నారు. ఆ బృందానికి వ్యవసాయాధికారి బుచ్చయ్య చౌదరి సహకారం అందించారు.
► ఈ విత్తనాలు 1986 ఖరీఫ్ సీజన్‌లో మార్కెట్‌లోకి విడుదలయ్యాయి.
► సాంబ మసరి రకానికి ఆయా ప్రాంతాలను బాపట్ల మసరి, ఆంధ్రా మసరి, కర్నలు సోనా, జీలకర్ర మసరి, సీరగ పొన్ని వంటి పేర్లు కూడా ఉన్నాయి.
ఎకరానికి 35, 40 బస్తాల దిగుబడి..
దేశవ్యాప్తంగా బీపీటీ–5204 వంగడం పేరు మార్మోగింది. నాణ్యత, అధిక దిగుబడి, అద్భుతమైన రుకరమైన ఆహారంగా పేరొందింది. దేశవ్యాప్తంగా 40 లక్షల హెక్టార్లలో బీపీటీ–5204 రకం సాగు కావడం విశేషం. ఎకరానికి 15, 20 బస్తాల మిం పండని దశలో సాంబ మసరి ఎకరానికి 35, 40 బస్తాల దిగుబడిన్చింది. ఈ వంగడం నాణ్యత దృష్ట్యా రైతులకు లాభదాయకమైన ధర కూడా లభింంది. ఈ వంగడంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఐసీఏఆర్, ఐఆర్‌ఆర్‌ఐ (మనీలా) సంస్థలు సాంబ మసూరిని విటమిన్–ఏతో కలిపి పోర్టిఫైడ్ చేసి గోల్డెన్ రైస్ పేరిట విడుదల చేసేందుకు సహకరించాయి. బీపీటీ 5204 వంగడాన్ని ఉపయోగించుకునే ఆ తర్వాత చాలా యూనివర్శిటీలు, అంతర్జాతీయ సంస్థలు పరిశోధనలు చేయడం గమనార్హం.
ప్రపంచ దేశాల్లోనూ ఖ్యాతి
బియ్యాన్ని తినే ఏ ప్రాంతానికి.. ఏ దేశానికి వెళ్లినా ముందు వినిపించే పేరు సాంబ మసరి. ఈ బియ్యం ఎగుమతితో భారత దేశానికి విదేశీ మారక ద్రవ్యం పెరిగింది. దేశీయంగా రైతుల ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఇప్పటికీ మార్కెట్‌లో నంబర్ వన్ ధర దేనికైనా లభిస్తుందంటే అది సాంబ మసరి వత్రమే. మార్కెట్‌లోకి వచ్చి మూడున్నర దశాబ్దాలు గడిచినా బీపీటీ–5204 రకం పేరు ప్రతిష్టలు పెరిగాయే తప్ప తరిగిపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment