Samba
-
నిజంగా ఆశ్చర్యపోయా..
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ, ఆర్బీకే వ్యవస్థలు.. అవి అందిస్తున్న సేవల కోసం పత్రికల్లో చదవడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. కానీ, ఇవి అందిస్తున్న సేవలు నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఈ శతాబ్దంలోనే ఓ గొప్ప విప్లవాత్మక మార్పు అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు..’ అని నాబార్డు రిటైర్డ్ జనరల్ మేనేజర్ పి.సాంబశివారెడ్డి ప్రశంసించారు. ఎలాంటి సిఫార్సులు లేకుండా, పైసా భారం పడకుండా ఏపీ సచివాలయ వ్యవస్థ ద్వారా తాను పొందిన లబ్ధిని ఆయన స్వయంగా ‘సాక్షి’కి వివరించారు. ఆయన ఏమన్నారంటే..ఈ మార్పు చూసి ఆశ్చర్యపోయా..మాది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా సింగనమల మండలం తూర్పు నరసాపురం. స్వగ్రామంలో మాకు వ్యవసాయ భూమి ఉంది. గ్రామంలోనే ఉంటున్న మా సోదరులు నా భూమిని సాగుచేస్తున్నారు. నేను బ్యాంకింగ్ రంగంలో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించాను. నాబార్డులో వివిధ హోదాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో పనిచేసి జనరల్ మేనేజర్‌గా 2013లో రాష్ట్ర విభజనకు ముందు రిటైరయ్యాను. కుటుంబంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డాను.మా స్వగ్రామానికి వెళ్లి దాదాపు దశాబ్దం దాటిపోయింది. గ్రామంలో విశేషాలే కాదు.. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కూడా మా సోదరులు, బంధువుల ద్వారా తెలుసుకుంటుంటాను. గ్రామ సచివాలయాల ఏర్పాటు తర్వాత నేను మా గ్రామానికి వెళ్లలేదు. అయితే, గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి వార్తా పత్రికలతోపాటు మా సోదరుల ద్వారా తెలుసుకున్నాను. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎలాంటి సిఫార్సులు లేకుండా అన్ని పనులు గ్రామంలోనే అయిపోతున్నాయని చెబుతుంటే ఆశ్చర్యమేసింది. ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు ఇస్తున్నారు. పంట ఉత్పత్తులను కూడా గ్రామంలోనే కొంటున్నారని మా బంధువులు చెప్పగా విన్నాను. పత్రికల్లో కూడా అప్పుడప్పుడూ చూస్తున్నాను. ఇది నిజమేనా.. ఇంత మార్పు వచ్చిందా.. అని అనుకున్నాను. కానీ, స్వతహాగా నాకు ఎదురైన అనుభవంతో ఆశ్చర్యపోయాను.సిఫార్సుల్లేకుండా పరిహారం..గత శనివారం నా ఖాతాలో రూ.34వేలు జమైంది. ఆశ్చర్యపోయాను.. ఎక్కడో ఉన్న నా వివరాలు తెలుసుకుని నాకు ఫోన్ చేశారు. ఎంతో గౌరవంగా మాట్లాడారు. ఎలాంటి సిఫార్సులు లేవు.. ఎవరికీ రూపాయి ఇవ్వలేదు. నేరుగా నా ఖాతాలో కరువు సాయం జమైంది. ఏపీలో తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్న సేవలు చూస్తుంటే నిజంగా గొప్ప విప్లవాత్మక మార్పుగా అభివర్ణించొచ్చు. గతంలో విపత్తులు సంభవించిన సందర్భాల్లో పరిహారం కోసం రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వచ్చేది. అడిగినంత దక్షిణ సమర్పిస్తే కానీ పరిహారం చేతికి వచ్చే పరిస్థితులు ఉండేవి కావు.కానీ, నేడు అవినీతికి తావులేకుండా సచివాలయ సిబ్బంది ఎంతో పారదర్శకంగా అందిస్తున్న సేవలు నిజంగా ప్రశంసనీయం. రైతులకు సంబంధించిన సేవలే కాదు.. పౌరసేవలు కూడా ఎలాంటి సిఫార్సులు లేకుండా ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామ పొలిమేర దాటకుండానే సామాన్య పౌరులు పొందగలుగుతున్నారని తెలిసి నిజంగా సంతోషమేసింది. ఇలాంటి వ్యవస్థ కదా ప్రజలకు కావాల్సింది. ఈ వ్యవస్థను తీసుకొచ్చిన ప్రభుత్వానికి నా అభినందనలు.నమ్మశక్యం కాని రీతిలో..పోలింగ్ ముగిసిన తర్వాత ఒకరోజు తూర్పు నరసాపురం గ్రామ సచివాలయం నుంచి ఆర్బీకే సిబ్బంది (రాజారెడ్డి) ఫోన్‌చేశారు. మన సింగనమల మండలాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. భూ యజమానికి కరువు సాయం జమవుతుంది. మీ ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు చెప్పండని అడిగారు. ముందు నమ్మలేదు.. మీకు నా ఫోన్ నంబరు, వివరాలు ఎవరిచ్చారు అని ఆరాతీస్తే.. గ్రామంలో మీ సోదరులిచ్చారని బదులిచ్చారు. ఆ తర్వాత వారితో క్రాస్ చెక్‌చేసుకున్న తర్వాత నమ్మకం ఏర్పడింది. అయినా ఆదాయపు పన్ను చెల్లించే నాకెందుకు కరువు సాయం వస్తుందని అడిగాను. లేదు సర్.. కరువు సాయం పంపిణీకి పన్ను చెల్లింపునకు సంబంధంలేదని బదులిచ్చారు. అయినా నమ్మకం కలగలేదు. లేదు సర్ మీ పేరిట ఉన్న 7.5 ఎకరాల వ్యవసాయ భూమిలో వేరుశనగ వేశారు. కరువు ప్రభావంతో పంట దెబ్బతిన్నది. ఇదే విషయాన్ని మేం రిపోర్టు చేశాం.. అందుకే కరువు సాయం మంజూరైందని వివరించారు. ఆ తర్వాత సిబ్బంది అడిగిన ఇతర వివరాలు చెప్పాను. -
దళిత ద్రోహి ఎవరు.. సామాజిక న్యాయం చేసిందెవరు?
హవ్వా.. దళిత ఎమ్మెల్యేలనే ట్రాన్స్ఫర్ చేస్తారా? ఏంటిది?.. అంటూ టీవీ5 సాంబ చౌదరి పెడుతున్న కితకితలు రాజకీయ వర్గాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. ఫ్లాష్‌బ్యాక్ తెలియక మనోడు వేస్తున్న వేషాలకు.. కాలమే సరైన సమాధానమే చెబుతుంది. ఏపీ(ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక..) రాజకీయాల్లో అసలు దళితులకు న్యాయం చేసిందెవరు? అన్యాయం చేసిందెవరు? పరిశీలిస్తే.. కాలిఫోర్నియా నుంచి ఓ ప్రవాసాంధ్రుడు పంపిన కథనం యధాతథంగా.. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారో సాంబడికి గుర్తు లేనట్లుంది!.విశాఖ జిల్లాలో 2019 ఎన్నికలప్పుడు దళిత వర్గానికి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బరిలోకి దించారు. కొవ్వూరు(ఎస్సీ) ఎమ్మెల్యే, అప్పటి మంత్రి కేఎస్ జవహర్‌ను కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసి పోటీ చేయించారు. ఇదే రీతిలో పలువురు ఎస్సీ, బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను జిల్లాల సరిహద్దులు దాటించి ఇతర నియోజకవర్గాల నుంచి చంద్రబాబు పోటీ చేయించారు చంద్రబాబు. వైఎస్సార్సీపీ ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలో నాలుగు జాబితాలకు కలిపి 58 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలకు మార్పులు చేసింది. అందులో.. అగ్రవర్ణాలు పోటీ చేసిన 7 అసెంబ్లీ స్థానాలను.. ఐదు బీసీలకు, రెండింటిని మైనారిటీలకు కేటాయించారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. సీట్ల కేటాయింపులో తన సొంత సామాజిక వర్గాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. మంగళగిరి ఆళ్ల రామకృష్ణ రెడ్డి ,కదిరి సిద్ధారెడ్డి ,ఎమ్మిగనూరు చెన్న కేశవరెడ్డిలకు అలాగే.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గతంలోనే సీటు ఇవ్వలేనని తేల్చి చెప్పారాయన. సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం.. వైఎస్సార్సీపీ జాబితా ఎస్సీలు- 21 ఎస్టీలు -3 బీసీలు- 17 మైనార్టీలు- 4 ఓసి - 13 10 లోక్‌సభ స్థానాల సమన్వయకర్తల్లో.. బీసీలు -6 ఎస్సీలు -2 ఎస్టీ -1 ఓసీ -1 ఏపీ కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ ఇచ్చిన మంత్రి పదవులు - 17 (కేబినెట్లో 70 శాతం) బీసీ మంత్రులు : బాబు పాలనలో-8 జగన్ పాలనలో-11 ఎస్సీ మంత్రులు : బాబు పాలనలో-2 జగన్ పాలనలో-5 జగన్ పాలనలో ఉప ముఖ్యమంత్రులు -4 (80 శాతం) తొలిసారిగా ఒక ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు స్పీకర్ బాబు పాలనలో-కోడెల (కమ్మ) జగన్ పాలనలో -తమ్మినేని సీతారాం (బీసీ) బీసీలకు రాజ్యసభ స్థానాలు బాబు పాలనలో-0 జగన్ పాలనలో -4 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు : ఎమ్మెల్సీలు లు బాబు పాలనలో-48 మంది ఎమ్మెల్సీలకుగానూ ఆయా సామాజిక వర్గాల నుంచి 18 మంది (37 శాతం ) జగన్ పాలనలో-43 మంది ఎమ్మెల్సీలకుగానూ ఆయా సామాజికవర్గాల నుంచి 29 మంది (68 శాతం) జగన్ హయాంలో మిగతావి.. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో - 9 (69 శాతం) 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో -12 (86 శాతం) గెలిచిన 84 మున్సిపల్ చైర్మన్ పోస్టుల్లో -58 (69 శాతం ) 137 వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులలో - 79 (58 శాతం) నామినేటెడ్ డైరెక్టర్ పదవులు-280 (58 శాతం) 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో -117 (60 శాతం) 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో- 3,503 (50 శాతం ) బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులు ఓసీల స్థానాలను.. బీసీ, మైనారిటీలకు ఇచ్చారు సీఎం జగన్. అయినా.. దళితుల స్థానాల్ని మళ్లీ దళితులకే కదా కేటాయించాల్సింది!. ఇందులో దళితులకు అన్యాయం ఎక్కడుంది సాంబా?.. జగనన్న ప్రభుత్వంలో ఎంత సామాజిక న్యాయం జరిగిందో.. అలాగే మీ బాస్ టైంలో ఎంత సామాజిక (అ)న్యాయం జరిగిందో క్రాస్ చెక్ చేస్కో. ::చిరు, కాలిఫోర్నియా -
సరిహద్దుల్లో బయటపడ్డ సొరంగం
సాంబా: జమ్మూకశ్మీర్‌లో త్వరలో జరగబోయే అమర్నాథ్ యాత్రలో అలజడి సృష్టించేం దుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశామని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) గురువారం వెల్లడించింది. సాంబా జిల్లాలో సరిహద్దుల వెంట చాక్ ఫకీరా బోర్డర్ ఔట్‌పోస్టు వద్ద ఉగ్రవాదులు ఏర్పాటు చేసిన 2 అడుగుల వెడల్పున్న సొరంగాన్ని గుర్తించామని తెలిపింది. అందులో 265 అడుగుల పొడవైన ఆక్సిజన్ పైపులను వెలికితీశామని పేర్కొంది. -
ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి
జమ్మూ/శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు పేట్రేగిపోయాయి. ఆదివారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడికి దిగాయి. దాన్ని భద్రతా బలగాలు విజయవంతంగా అడ్డుకుని, ఇద్దరు సూసైడ్ బాంబర్లను హతమార్చాయి. ఎదురుకాల్పుల్లో సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్పీ పటేల్ నేలకొరిగారు. 9 మందికి గాయాలయ్యాయి. సంజ్వాన్ సమీపంలోని చద్దా ఆర్మీ బేస్ వద్ద ఎన్‌కౌంటర్‌కు దారితీసిన క్రమాన్ని డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు సూసైడ్ బాంబర్లు గురువారం ఆర్ఎస్ పురా సెక్టార్లో సరిహద్దులు దాటారు. శుక్రవారం ఉదయం 4.25 గంటలప్పుడు ఆర్మీ బేస్ వద్దకు చేరుకున్నారు. జవాన్లు వారిని గమనించి అప్రమత్తమయ్యారు. అదే సమయంలో తర్వాతి షిఫ్టు కోసం 15 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లతో వస్తున్న బస్సుపైకి ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. గ్రెనేడ్లు ప్రయోగిస్తూ దగ్గర్లోని జనావాసాల్లోకి పారిపోయారు. జవాన్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి కాల్పులకు దిగడంతో జవాన్లు అందులోని వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 5 గంటలపాటు సాగిన ఎన్కౌంటర్లో ఇద్దరు బాంబర్లు హతమయ్యారు. సకాలంలో స్పందించడంతో... ఉగ్రవాదులు భారీగా పేలుడు పదార్థాలున్న జాకెట్‌ను ధరించారని డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. వారి వద్ద పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించిందన్నారు. భారీగా నష్టం కలిగించి, ప్రధాని పర్యటనకు అవాంతరం కలిగించేందుకు జైషే కుట్ర పన్నినట్లు తెలుస్తోందన్నారు. సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పిందని చెప్పారు. సంఘటన ప్రాంతంలో రెండు ఏకే–47 రైఫిళ్లు, గ్రెనేడ్ లాంఛర్, శాటిలైట్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఘటన నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇదే ఆర్మీ క్యాంప్‌పై 2018లో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు జవాన్లు మృతి చెందారు. బారామూల్లాలో మరో ఉగ్రవాది హతం బారాముల్లా జిల్లాలో మాల్వాలో గురువారం నుంచి కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో నాలుగో ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. సుదీర్ఘకాలంగా కశ్మీర్లో పలు ఉగ్రదాడులకు కారకుడైన లష్కరే టాప్ కమాండర్ యూసుఫ్ కట్రూతోపాటు ముగ్గురు ఉగ్రవాదులు గురువారం హతమైన విషయం తెలిసిందే. మోదీ పర్యటనకు భారీ భద్రత జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న కశ్మీర్‌లోని సాంబ జిల్లా పాలి గ్రామాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. 2019లో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాంబ, పరిసరాల్లో మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. హై అలర్ట్ ప్రకటించారు. మోదీ పాల్గొనే సభా ప్రాంతానికి చేరుకునే మార్గాల్లో చెక్పాయింట్లు పెట్టారు. అత్యాధునిక నిఘా వ్యవస్థను నెలకొల్పినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
నంబర్ 1 ధర: మసూరి బువ్వ.. నేటికీ వారెవ్వ!
ఆ రోజుల్లో తెల్లబువ్వ అపురూపం. వరి అన్నాన్ని ‘ఆబువ్వ’గా.. బెల్లపు అన్నాన్ని ‘సాంబువ్వ’గా పరిగణిస్తున్న రోజులవి. బియ్యం వండుకునే అవకాశం కొందరికే పరిమితమైన ఆ రోజుల్లో వరి సాగును విస్తృతం చేయాల్సిన, అధిక దిగుబడి ఇచ్చే వంగడాల్ని రపొందించాల్సిన బాధ్యత వ్యవసాయ శాస్త్రవేత్తలపై పడింది. ఆ కృషి ఫలించి వచ్చిందే సాంబ మసూరి (బీపీటీ–5204). సాక్షి, అమరావతి: సంప్రదాయ విత్తనాలకు భిన్నంగా అధిక దిగుబడుల్చిన వంగడం సాంబ మసరి (బీపీటీ–5204). వరి చరిత్రలో ఇదో సంచలనమే. ఈ వంగడం పురుడు పోసుకున్నది గుంటరు జిల్లా బాపట్ల వ్యవసాయ పరిశోధన కేంద్రంలోనే అయినా.. దాని సృష్టికర్త మాత్రం అనంతపురం జిల్లా కదిరి తాలకా ఎద్దులవారి పాలెం గ్రావనికి చెందిన డాక్టర్ మొరవపల్లి వెంకట రమణారెడ్డి (డాక్టర్ ఎంవీ రెడ్డి). 1921లో విడుదల చేసిన కిలీ సాంబగా పిలిచే జీఈబీ–24, తైచుంగ్ (నేటివ్)–1, మసరి రకాలను సంకరం చేసి ప్రతిష్టాత్మక వరి వంగడం బీపీటీ–5204ను అభివృద్ధి చేశారు. 1986లో సాంబ మసరి పేరిట విడుదలైన ఈ రకం వరి రైతుల విశేష ఆదరణ పొందింది. ఎలా రూపొందించారంటే.. ► తొలుత జీఈబీ 24, తైచుంగ్ నేటివ్–1 వరి వంగడాలను సంకరపరిచారు. ► వీటినుంచి వచ్చిన రెండో సంతతి (ఎఫ్–2 జనరేషన్)లో మంచి మొక్కలను ఎంపిక చేసి.. వాటిని మసూరి వంగడంతో సంకరం చేశారు. ► వీటినుంచి వచ్చిన సంతతిని జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ పద్ధతిలో పరీక్షించి వాటిలో మేలైన వేలాది మొక్కల్ని మరో చేలో నాటి ప్రతి మొక్కకూ పరీక్ష జరిపారు. ► లక్ష్యానికి దగ్గర్లో ఉన్న మొక్కల్ని మరో చేలో నాటి తుది వంగడం తయారు చేశారు. మొత్తంగా ఈ వంగడం అభివృద్ధి చేయడానికి 8 సంవత్సరాలు పట్టింది. ► ఈ వంగడం తయారీలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మొరవపల్లి వెంకట రమణారెడ్డి (ఎంవీ రెడ్డి) కాగా.. ప్రొఫెసర్ నందేల శ్రీరామ్‌రెడ్డి, ఎల్వీ సత్యనారాయణ, డాక్టర్ డి.సుబ్రహ్మణ్యం, ఎస్ఎస్డీవీ ప్రసాద్ పాలుపంచుకున్నారు. ఆ బృందానికి వ్యవసాయాధికారి బుచ్చయ్య చౌదరి సహకారం అందించారు. ► ఈ విత్తనాలు 1986 ఖరీఫ్ సీజన్లో మార్కెట్లోకి విడుదలయ్యాయి. ► సాంబ మసరి రకానికి ఆయా ప్రాంతాలను బాపట్ల మసరి, ఆంధ్రా మసరి, కర్నలు సోనా, జీలకర్ర మసరి, సీరగ పొన్ని వంటి పేర్లు కూడా ఉన్నాయి. ఎకరానికి 35, 40 బస్తాల దిగుబడి.. దేశవ్యాప్తంగా బీపీటీ–5204 వంగడం పేరు మార్మోగింది. నాణ్యత, అధిక దిగుబడి, అద్భుతమైన రుకరమైన ఆహారంగా పేరొందింది. దేశవ్యాప్తంగా 40 లక్షల హెక్టార్లలో బీపీటీ–5204 రకం సాగు కావడం విశేషం. ఎకరానికి 15, 20 బస్తాల మిం పండని దశలో సాంబ మసరి ఎకరానికి 35, 40 బస్తాల దిగుబడిన్చింది. ఈ వంగడం నాణ్యత దృష్ట్యా రైతులకు లాభదాయకమైన ధర కూడా లభింంది. ఈ వంగడంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఐసీఏఆర్, ఐఆర్ఆర్ఐ (మనీలా) సంస్థలు సాంబ మసూరిని విటమిన్–ఏతో కలిపి పోర్టిఫైడ్ చేసి గోల్డెన్ రైస్ పేరిట విడుదల చేసేందుకు సహకరించాయి. బీపీటీ 5204 వంగడాన్ని ఉపయోగించుకునే ఆ తర్వాత చాలా యూనివర్శిటీలు, అంతర్జాతీయ సంస్థలు పరిశోధనలు చేయడం గమనార్హం. ప్రపంచ దేశాల్లోనూ ఖ్యాతి బియ్యాన్ని తినే ఏ ప్రాంతానికి.. ఏ దేశానికి వెళ్లినా ముందు వినిపించే పేరు సాంబ మసరి. ఈ బియ్యం ఎగుమతితో భారత దేశానికి విదేశీ మారక ద్రవ్యం పెరిగింది. దేశీయంగా రైతుల ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఇప్పటికీ మార్కెట్లో నంబర్ వన్ ధర దేనికైనా లభిస్తుందంటే అది సాంబ మసరి వత్రమే. మార్కెట్లోకి వచ్చి మూడున్నర దశాబ్దాలు గడిచినా బీపీటీ–5204 రకం పేరు ప్రతిష్టలు పెరిగాయే తప్ప తరిగిపోలేదు. -
జూనియర్ ఎన్టీఆర్ భారీ హిట్స్.. అయితే, ఇక్కడో సెంటిమెట్
చిన్న దెబ్బ తగిలితేనే అమ్మా అంటూ అల్లాడిపోతాం. కానీ హీరోలు ఏకంగా కత్తిపోటుకు గురైనా అదరరు, బెదరరు. యాక్షన్ సీన్లలో దెబ్బలు తాకినా, రక్తాలు కారుతున్నా ముందుగా సీన్ కంప్లీట్ చేయడానికే శ్రద్ధ చూపుతుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సెట్స్‌లో ఇలా గాయాల బారిన పడటం పరిపాటి. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొన్ని సినిమాల షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యాడు. అయితే ఆయన తాతగారు నందమూరి తారక రామారావు ఆశీస్సుల వల్లో, లేక అభిమానుల ప్రేమాభిమానాల వల్లో కానీ ఎటువంటి ప్రాణహాని లేకుండా స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు. మరి తారక్ ఏయే సినిమాల షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యాడో చూసేద్దాం... స్టూడెంట్ నెంబర్ 1: రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే ఎన్టీఆర్ వెండితెరపై హీరోగా పరిచయమవ్వాల్సి ఉంది. కానీ ఓ షెడ్యూల్లో తారక్ గాయపడటంతో చిత్రీకరణ కొంత ఆలస్యం అయింది. అయినప్పటికీ ఎన్టీఆర్‌కు ఫస్ట్ బాక్సాఫీస్ హిట్‌ను అందించింది ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రమే. ‘ఆది’ సినిమా టైంలోనూ తారక్ దెబ్బలు తగిలించుకున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యాక్షన్ సీన్లు ఏ రేంజ్లో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అందులోని ఓ ముఖ్యమైన ఫైట్ సీన్లో ఎన్టీఆర్ గాయపడ్డాడు. అయితే చేతికి కట్టు ఉండగానే ‘నీ నవ్వుల తెల్లదనాన్ని’ అనే సాంగ్ షూటింగ్‌లోనూ పాల్గొన్నాడు. ఈ పాటతో పాటు సినిమా కూడా ఓ రేంజ్లో హిట్టైన విషయం తెలిసిందే. సింహాద్రి.. సినిమాతో మరింత పాపులర్ అయిన ఎన్టీఆర్‌కు ఈ మూవీ షూటింగ్‌లోనూ ఇంజూర్ అయింది. అయినప్పటికీ తన గాయాలను లెక్క చేయకుండా చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఆయన కష్టానికి ఫలితంగా సింహాద్రి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తర్వాత ‘యమదొంగ’, ‘బృందావనం’ చిత్రీకరణ సమయంలోనూ తారక్‌కు దెబ్బలు తాకాయి, కానీ ఈ రెండూ మంచి విజయం సాధించాయి. ‘శక్తి’ సినిమాలో కొన్ని అనవసరపు యాక్షన్ సీన్లు చిత్రీకరించిన సమయంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు. ఇక్కడ విడ్డూరమేంటంటే అంత కష్టపడి చేసిన సీన్లను ఎడిటింగ్‌లో లేపేయడమేకాక, ఇది అతడి కెరీర్లోనే డిజాస్టర్‌గా నిలిచింది. ‘సాంబ, ఊసరవెల్లి’.. సినిమాల షూటింగ్ సమయంలోనూ తారక్ గాయపడగా, ఈ రెండు సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ‘అదుర్స్’ సినిమా షూటింగ్ ముగించుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలోనూ ఎన్టీఆర్ కారుకు యాక్సిడెంట్ అయింది. గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు తారక్. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ టైంలోనూ తారక్ గాయపడ్డ విషయం తెలిసిందే! -
రోడ్డెక్కిన గబ్బర్ సింగ్, సాంబ
గురుగ్రాం : ‘అరెవో సాంబ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల లాభమా? నష్టమా?’అని గబ్బర్ ప్రశ్నించగా.. ‘ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవడం వలన తలకు తీవ్ర గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదం ఇంకా పెద్దదయినపుడు ఆ వ్యక్తి కోమాలోకి వెళ్లవచ్చు కొన్ని సార్లు ప్రాణాలూ విడవచ్చు. ఎలా చూసినా హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ప్రయాణికుడికి తీవ్ర నష్టమే’అంటూ గబ్బర్ ప్రశ్నకు సాంబ సమాధానమిస్తాడు. ఏంటీ గబ్బర్, సాంబల పేర్లు చెప్పి షోలే సినిమా డైలాగులు కాకుండా వేరే డైలాగులు చెబుతున్నారనుకుంటున్నారా?. అయితే వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను వివరించడానికి హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం జిల్లా ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న వినూత్న ప్రయత్నం ఇది. ట్రాఫిక్ నియమాలు పాటించమని ఎన్ని సార్లు చెప్పినా, ప్రచారాలు చేసినా, భారీ జరిమానాలు విధించినా వాహనదారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో పోలీసులు విసుగెత్తిపోయారు. దీంతో ఏదైన వెరైటీగా చేసయినా సరే ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని ఆలోచన మెదలెట్టారు గురుగ్రాం ట్రాఫిక్ పోలీసులు. దీంతో స్థానిక విద్యార్థులతో కలిసి ప్రజలకు ట్రాఫిక్ పాఠాలు చెప్పాలని నిశ్చయించుకున్నారు. దీనిలో భాగంగా దీపక్, అరుణ్‌లు గబ్బర్ సింగ్, సాంబ వేషధారణలో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపేవారికి క్లాస్ తీసుకుంటున్నారు. షోలే సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్‌లను ట్రాఫిక్ భాషలో చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ట్రాఫిక్ పోలీసులు, విద్యార్ధులు ప్రయత్నానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
రోడ్డెక్కిన గబ్బర్ సింగ్, సాంబ
-
స్వచ్ఛమైన ప్రేమ
సాంబ, యోధ, కిరణ్, పావని ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘లావణ్య విత్ లవ్‌బాయ్స్’. వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రాజ్యలక్ష్మి, సి. నర్సింలు పటేల్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. సినిమా ట్రైలర్, ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎస్. రాములు ట్రైలర్ విడుదల చేశారు. వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ– ‘‘అమ్మాయి బాహ్య సౌందర్యాన్ని చూసి కాదు అంతరంగాన్ని తెలుసుకొని ప్రేమించాలి. స్వచ్ఛమైన ప్రేమకు ఎప్పుడూ ఓటమిలేదనేది చిత్రకథ. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: శరత్ చెట్టి. -
కొత్తవాళ్లను ప్రోత్సహించాలి
– రమణాచారి పావని, కిరణ్, యోధ, సాంబ ముఖ్య తారలుగా వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లావణ్య విత్ లవ్‌బాయ్స్’. నర్సింలు పటేల్‌చెట్టి, సి. రాజ్యలక్ష్మీ నిర్మించారు. యశోకృష్ణ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఆడియో సీడీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. రమణాచారి ఆవిష్కరించి, రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అందజేశారు. ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. రమణాచారి మాట్లాడుతూ– ‘‘తేనె మనసులు’తో ఆదుర్తిగారు పరిచయం చేయకపోతే కృష్ణగారు, కొత్త నటీనటులు వద్దని దాసరిగారు అనుకుని ఉంటే మోహన్‌బాబుగారి లాంటి ప్రతిభావంతులు వచ్చి ఉండేవారు కాదు. తేజ, శేఖర్ కమ్ముల వంటి దర్శకులు కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తున్నారు. వడ్డేపల్లి కృష్ణ చక్కని కథాంశంతో కొత్త నటీనటులతో చేసిన చిత్రమిది. కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చేవాళ్లు మరింతమంది రావాలి’’ అన్నారు. ‘‘ముగ్గురు యువకులు లావణ్య అనే అమ్మాయితో ప్రేమలో పడతారు. ఆ ముగ్గురిలో ఆమె ఎవర్ని పెళ్లి చేసుకుందనేదే కథ’’ అన్నారు వడ్డేపల్లి కృష్ణ. -
కుర్రాళ్ల ప్రణయగాథ
ప్రముఖ గీత రచయిత డా.వడ్డేపల్లి కృష్ణ ‘ఎక్కడికెళ్తుందో మనసు’ చిత్రం తర్వాత దర్శకత్వం వహించిన చిత్రం ‘లావణ్య విత్ లవ్‌బాయ్స్’. సాంబ, యోధ, కిరణ్, పావని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రాజ్యలక్ష్మి, సి. నర్సింలు పటేల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను ఆర్టిఐ చైర్మన్ విజయబాబు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమా అయినా కథ బాగుంటే పెద్ద విజయం సాధిస్తుంది. చిన్న చిత్రాలను బ్రతికించడానికే ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు మినీ థియేటర్లు నిర్మిస్తున్నాయి. వీటిని కూడా కొంత మంది కబ్జా చేయాలనే ఆలోచనలో ఉన్నారు’’ అని చెప్పారు. వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఎక్కడికెళ్తుందో మనసు’ చిత్రానికి సరైన ప్రచారం లేక ప్రేక్షకులకు చేరువ కాలేదు. దాదాపు దశాబ్దం తర్వాత ‘లావణ్య విత్ లవ్ బాయ్స్’ చిత్రాన్ని తెరకెక్కించా. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా నవరసాల్ని మిళితం చేసి ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందించాం. పడుచు కుర్రాళ్ల ప్రణయగాథగా తెరకెక్కిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా తర్వాత వడ్డేపల్లి కృష్ణతో మరో చిత్రం నిర్మిస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు. సాంబ, కిరణ్, పావని, నటుడు కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ గొప్పతనం
‘పిల్లజమీందార్’, ‘పెద్దరికం’, ‘భైరవద్వీపం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ తదితర చిత్రాలకు పాటలు రాసిన డా. వడ్డేపల్లి కృష్ణ దర్శకునిగా మారారు. పావని, పరమేశ్ యోధా, సాంబ, కిరణ్ ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో రాజ్యలక్ష్మి.సి, నర్సింలు పటేల్ చెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘లావణ్య విత్ లవ్ బాయ్స్’. ఈ సినిమా ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి చంద్రశేఖర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఉంటుంది. కథ, మాటలు, పాటలు అన్నీ బాగా కుదిరాయి. ప్రేమకు సరికొత్త భాష్యంగా నిలిచే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది’’ అని తెలిపారు. కాశీ విశ్వనాథ్, డా. పరుచూరి గోపాలకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తోట.వి.రమణ, సంగీతం: యశోకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, సమర్పణ: శరత్చెట్టి (యూఎస్ఏ). -
వేముల వాడలో దొంగ అరెస్ట్
భక్తుల ఆభరణాలు చోరీ చేస్తున్న ఆకుల సాంబ(24) అనే దొంగను వేములవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సాంబ నుంచి పదిన్నర తులాల బంగారం, 800 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను వేములవాడ డీఎస్పీ అభినందించారు. -
భార్యను చంపేసిన భర్త
క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోపంలో విచక్షణ కోల్పోయిన ఓ భర్త.. కట్టుకున్న భార్యనే చంపేశాడు. వివరాలు.. సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రాంతంలోని తుకారాంగేట్ వద్ద ఉండే శ్రీనివాస్, సాంబ దంపతులు గురువారం సాయంత్రం గొడవపడ్డారు. తీవ్ర కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ భార్యను కత్తితో నరికి చంపాడు. అనంతరం ఘటనస్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా.. భార్యా, భర్తల మధ్య గొడవకు కారణాలు తెలియ రాలేదు. -
భారత్‌పై మరోసారి కాల్పులకు తెగబడిన పాక్
జమ్మూ కాశ్మీర్: పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సాంబా, జమ్మూ జిల్లాలోని రామ్‌గర్, అర్నియా సెక్టార్లలో సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడింది. దీంతో భారత్ సైన్యం వెంటనే అప్రమత్తమైంది. భారత్ సైన్యం ఎదురు కాల్పులు జరిపి... పాక్ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించలేదని సైనిక అధికారులు వెల్లడించారు. గత అర్థరాత్రి ఒంటి గంటకు ఓ సారి.... గురువారం తెల్లవారుజామున 4.00 గంటలకు మరోసారి కాల్పులు జరిగాయిని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి పండగను జమ్మూ కాశ్మీర్లో జరుపుకుంటున్నారు. అయితే ఈ రోజు ఉదయం ఆయన సియాచిన్ వెళ్లారు. -
నిన్న జమ్ములో దాడి తమ పనే: షోహద బ్రిగేడ్
జమ్మూలోని కథువా, సాంబ జిల్లాలోని నిన్న జరిపిన దాడి తమ పనే అని తీవ్రవాద సంస్థ షోహద బ్రిగేడ్ ప్రకటించింది. ఆ తీవ్రవాద సంస్థ ప్రతినిధి సామి- ఉల్- హక్ ఈ మేరకు మీడియాకు శుక్రవారం ఫోన్ ద్వారా వెల్లడించారు. ఆ రెండు ప్రాంతాల్లో తీవ్రవాదులు జరిపిన దాడిలో ఆర్మీ అధికారి సహా 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే తీవ్రవాదుల దాడి అనంతరం అయా ప్రాంతాల్లో ఉన్నతాధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రత క్యాంపులు, పోలీసు స్టేషన్లు సహా అన్ని ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా భద్రత సిబ్బందిని మొహరించారు. -
జమ్మూలో తీవ్రవాదుల దాడి ఖండించిన బీజేపీ
జమ్మూ కాశ్మీర్లో ఈ రోజు ఉదయం పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల జంట దాడులను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జావదేకర్ గురువారం న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... భారత్‌లో తీవ్రవాద దాడుల ద్వారా పాక్ ప్రచ్ఛన్న యుద్దానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. పాక్ తన భూభాగంలో ఉండి భారత్‌పై తీవ్రవాదుల దాడికి ఉసిగొల్పుతోందని ఆయన పేర్కొన్నారు. దేశంలో తీవ్రవాదుల దాడుల జరగకుండ భారత ప్రధాని పార్లమెంట్ ఉభయ సభల ద్వారా ఇచ్చిన భరోసా గాలిలో దీపమైందని ఆయన అభివర్ణించారు. ఆ దాడులు అరికట్టేందుకు ప్రధాని కనీసం ఎటువంటి చర్యలు చేపట్టారనేది నేటిని అంతుపట్టని విషయంగా ఆయన వ్యాఖ్యానించారు. జమ్ము కాశ్మీర్‌లోని కథువా జిల్లాలోని హీరా నగర్ పోలీసు స్టేషన్‌పై అలాగే సాంబ సెక్టార్ సైనిక శిబిరంపై తీవ్రవాదులు దాడి చేశారు. ఆ ఘటనలలో మొత్తం 9 మంది మరణించారు. వారిలో సైనిక అధికారి కూడా ఉన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న రెండు తీవ్రవాదుల దాడులను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు.