
సాంబా: జమ్మూకశ్మీర్‌లో త్వరలో జరగబోయే అమర్‌నాథ్ యాత్రలో అలజడి సృష్టించేం దుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశామని సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) గురువారం వెల్లడించింది. సాంబా జిల్లాలో సరిహద్దుల వెంట చాక్ ఫకీరా బోర్డర్ ఔట్‌పోస్టు వద్ద ఉగ్రవాదులు ఏర్పాటు చేసిన 2 అడుగుల వెడల్పున్న సొరంగాన్ని గుర్తించామని తెలిపింది. అందులో 265 అడుగుల పొడవైన ఆక్సిజన్ పైపులను వెలికితీశామని పేర్కొంది.