కొత్తవాళ్లను ప్రోత్సహించాలి | Lavanya with Loveboys movie audio release | Sakshi
Sakshi News home page

కొత్తవాళ్లను ప్రోత్సహించాలి

Published Tue, Jul 11 2017 4:25 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM

కొత్తవాళ్లను ప్రోత్సహించాలి

కొత్తవాళ్లను ప్రోత్సహించాలి

 – రమణాచారి
పావని, కిరణ్, యోధ, సాంబ ముఖ్య తారలుగా వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లావణ్య విత్‌ లవ్‌బాయ్స్‌’. నర్సింలు పటేల్‌చెట్టి, సి. రాజ్యలక్ష్మీ నిర్మించారు. యశోకృష్ణ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఆడియో సీడీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. రమణాచారి ఆవిష్కరించి, రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అందజేశారు. ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు.

రమణాచారి మాట్లాడుతూ– ‘‘తేనె మనసులు’తో ఆదుర్తిగారు పరిచయం చేయకపోతే కృష్ణగారు, కొత్త నటీనటులు వద్దని దాసరిగారు అనుకుని ఉంటే మోహన్‌బాబుగారి లాంటి ప్రతిభావంతులు వచ్చి ఉండేవారు కాదు. తేజ, శేఖర్‌ కమ్ముల వంటి దర్శకులు కొత్తవాళ్లకు ఛాన్స్‌ ఇస్తున్నారు. వడ్డేపల్లి కృష్ణ చక్కని కథాంశంతో కొత్త నటీనటులతో చేసిన చిత్రమిది. కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చేవాళ్లు మరింతమంది రావాలి’’ అన్నారు. ‘‘ముగ్గురు యువకులు లావణ్య అనే అమ్మాయితో ప్రేమలో పడతారు. ఆ ముగ్గురిలో ఆమె ఎవర్ని పెళ్లి చేసుకుందనేదే కథ’’ అన్నారు  వడ్డేపల్లి కృష్ణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement