లావణ్య ప్రేమ | new movie update Lavanya with Love Boys | Sakshi
Sakshi News home page

లావణ్య ప్రేమ

Published Fri, Mar 24 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM

లావణ్య ప్రేమ

లావణ్య ప్రేమ

ప్రేమకు సరికొత్త నిర్వచనం ఇచ్చేలా ‘లావణ్య విత్‌ లవ్‌ బాయ్స్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ. పరుచూరి గోపాలకృష్ణ, కాశీ విశ్వనాథ్, హేమసుందర్, పావని, స్వరూప, యోధా, సాంబ, కిరణ్‌  ముఖ్య తారలు. రాజ్యలక్ష్మి ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై రాజ్యలక్ష్మి.సి, నర్సింలు పటేల్‌ చెట్టి నిర్మిస్తున్న ఈ సినిమా క్లైమ్యాక్స్‌ చిత్రీకరణ ఇటీవల పూర్తయింది.

నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘యువతరం మెచ్చే చక్కటి కథ, కథనాలతో పాటు మంచి మాటలు, పాటలు కుదిరాయి. నల్గొండ, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం’’ అన్నారు. ‘‘లావణ్య అనే అమ్మాయి కథే ఈ సినిమా. లవ్‌ బాయ్స్‌లో ఆమె మనసు సొంతం చేసుకున్నది ఎవరనేది ఆసక్తికరం. అన్ని వర్గాలవారూ చూడ్డదగ్గ విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి కెమేరా: తోట.వి.రమణ, సంగీతం: యశోకృష్ణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement