Lavanya with Love Boys
-
లావణ్య ప్రేమ
ప్రేమకు సరికొత్త నిర్వచనం ఇచ్చేలా ‘లావణ్య విత్ లవ్ బాయ్స్’ చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ. పరుచూరి గోపాలకృష్ణ, కాశీ విశ్వనాథ్, హేమసుందర్, పావని, స్వరూప, యోధా, సాంబ, కిరణ్ ముఖ్య తారలు. రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రాజ్యలక్ష్మి.సి, నర్సింలు పటేల్ చెట్టి నిర్మిస్తున్న ఈ సినిమా క్లైమ్యాక్స్ చిత్రీకరణ ఇటీవల పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘యువతరం మెచ్చే చక్కటి కథ, కథనాలతో పాటు మంచి మాటలు, పాటలు కుదిరాయి. నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం’’ అన్నారు. ‘‘లావణ్య అనే అమ్మాయి కథే ఈ సినిమా. లవ్ బాయ్స్‌లో ఆమె మనసు సొంతం చేసుకున్నది ఎవరనేది ఆసక్తికరం. అన్ని వర్గాలవారూ చూడ్డదగ్గ విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి కెమేరా: తోట.వి.రమణ, సంగీతం: యశోకృష్ణ. -
నల్లగొండలో లావణ్య విత్ లవ్ బాయ్స్
రాంనగర్ : రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై లావణ్య విత్ లవ్‌బాయ్స్ సినిమా షూటింగ్ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో గల బృందావన్ కాలనీలో ప్రారంభమైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి కెమెరా స్విచ్ఆన్ చేయగా, ట్రాఫిక్ సీఐ ఆదిరెడ్డి క్లాప్ కొట్టారు. దాంతో హీరోహీరోయిన్‌పై మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా సినీ డైరెక్టర్ డాక్టర్ వడ్డెపల్లి కృష్ణ మాట్లాడుతూ యూత్ ఎంటర్టైన్మెంట్తో ఫ్యామిలీ సెంటిమెంట్, మంచి పాటలు, ఆసక్తికర సన్నివేశాలతో చిత్ర నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఈ సినిమాకు నిర్మాతలుగా రాజ్యలక్ష్మి, నర్సింహులు, పటేల్శెట్టి, కెమెరా తోట వి.రమణ, మేకప్ ఈశ్వర్ మల్లెమూడి వ్యవహరిస్తున్నారు. డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, కాశీ విశ్వనాథ్, పావని, హేమసుందర్, యోధ, సాంబ, కిరణ్, యోగా, వైభవ్, సత్కళ సత్యనారాయణ నటిస్తున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్బగోని రమేష్‌గౌడ్ పాల్గొన్నారు. -
ప్రేమ గొప్పతనం
‘పిల్లజమీందార్’, ‘పెద్దరికం’, ‘భైరవద్వీపం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ తదితర చిత్రాలకు పాటలు రాసిన డా. వడ్డేపల్లి కృష్ణ దర్శకునిగా మారారు. పావని, పరమేశ్ యోధా, సాంబ, కిరణ్ ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో రాజ్యలక్ష్మి.సి, నర్సింలు పటేల్ చెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘లావణ్య విత్ లవ్ బాయ్స్’. ఈ సినిమా ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి చంద్రశేఖర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఉంటుంది. కథ, మాటలు, పాటలు అన్నీ బాగా కుదిరాయి. ప్రేమకు సరికొత్త భాష్యంగా నిలిచే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది’’ అని తెలిపారు. కాశీ విశ్వనాథ్, డా. పరుచూరి గోపాలకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తోట.వి.రమణ, సంగీతం: యశోకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, సమర్పణ: శరత్చెట్టి (యూఎస్ఏ). -
లావణ్య ప్రేమకథ
‘పిల్ల జమీందార్, పెద్దరికం, భైరవ ద్వీపం, సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రాల గీత రచయితగా సుపరిచితుడైన డా. వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో తెర కెక్కనున్న చిత్రం ‘లావణ్య విత్ లవ్‌బాయ్స్’. రాజ్యలక్ష్మి.సి, నర్సిమ్లూ పటేల్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి కెమెరా స్విచ్చాన్ చేయగా, ‘సిరిసిల్ల తల్లిగారు.. సిద్దిపేట అత్తగారు.. కట్టుకున్న పోరగాడు.. నప్పతట్ల నారిగాడు.. అందమంత ఏం జేత్తురో?..’ అనే పల్లవితో సాగే పాటను యశోకృష్ణ సంగీత దర్శకత్వంలో రికార్డ్ చేశారు. వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ– ‘‘కాలేజీ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుంది. ఒక అమ్మాయి, ముగ్గురబ్బాయిల మధ్య కొనసాగే హాస్యరస ప్రేమకథా చిత్రమిది. రియల్ లవ్ అంటే ఏంటో చెబుతాం. ఫిబ్రవరి 9న చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి మురళీమోహన్, కెమెరామన్ తోట రమణ, నిర్మాత సంగిశెట్టి దశరథ పాల్గొన్నారు.