ప్రేమ గొప్పతనం | Lavanya with Love Boys movie started in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమ గొప్పతనం

Published Sun, Feb 19 2017 11:34 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

ప్రేమ గొప్పతనం

ప్రేమ గొప్పతనం

‘పిల్లజమీందార్‌’, ‘పెద్దరికం’, ‘భైరవద్వీపం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ తదితర చిత్రాలకు పాటలు రాసిన డా. వడ్డేపల్లి కృష్ణ దర్శకునిగా మారారు. పావని, పరమేశ్‌ యోధా, సాంబ, కిరణ్‌ ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో రాజ్యలక్ష్మి.సి, నర్సింలు పటేల్‌ చెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘లావణ్య విత్‌ లవ్‌ బాయ్స్‌’. ఈ సినిమా ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి  సన్నివేశానికి చంద్రశేఖర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్‌ ఇచ్చారు.

దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఉంటుంది. కథ, మాటలు, పాటలు అన్నీ బాగా కుదిరాయి. ప్రేమకు సరికొత్త భాష్యంగా నిలిచే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది’’ అని తెలిపారు.  కాశీ విశ్వనాథ్, డా. పరుచూరి గోపాలకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తోట.వి.రమణ, సంగీతం: యశోకృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్, సమర్పణ: శరత్‌చెట్టి (యూఎస్‌ఏ).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement