
సాంబ, యోధ, కిరణ్, పావని ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘లావణ్య విత్ లవ్‌బాయ్స్’. వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రాజ్యలక్ష్మి, సి. నర్సింలు పటేల్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. సినిమా ట్రైలర్, ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు.
బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎస్. రాములు ట్రైలర్ విడుదల చేశారు. వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ– ‘‘అమ్మాయి బాహ్య సౌందర్యాన్ని చూసి కాదు అంతరంగాన్ని తెలుసుకొని ప్రేమించాలి. స్వచ్ఛమైన ప్రేమకు ఎప్పుడూ ఓటమిలేదనేది చిత్రకథ. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: శరత్ చెట్టి.
Comments
Please login to add a commentAdd a comment