దళిత ద్రోహి ఎవరు.. సామాజిక న్యాయం చేసిందెవరు? | YSRCP Counter TV5 Samba Criticism Over CM YS Jagan Dalit Stand, See Complete Details Inside - Sakshi
Sakshi News home page

దళిత ద్రోహి ఎవరు.. సామాజిక న్యాయం చేసిందెవరు?

Published Sat, Jan 20 2024 9:04 AM | Last Updated on Fri, Feb 2 2024 9:09 PM

YSRCP Counter TV5 Samaba Criticism Over CM YS Jagan Dalit Stand - Sakshi

హవ్వా.. దళిత ఎమ్మెల్యేలనే ట్రాన్స్‌ఫర్‌ చేస్తారా? ఏంటిది?.. అంటూ టీవీ5 సాంబ చౌదరి పెడుతున్న కితకితలు రాజకీయ వర్గాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. ఫ్లాష్‌బ్యాక్‌ తెలియక మనోడు వేస్తున్న వేషాలకు.. కాలమే సరైన సమాధానమే చెబుతుంది. ఏపీ(ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక..) రాజకీయాల్లో అసలు దళితులకు న్యాయం చేసిందెవరు? అన్యాయం చేసిందెవరు? పరిశీలిస్తే.. కాలిఫోర్నియా నుంచి ఓ ప్రవాసాంధ్రుడు పంపిన కథనం యధాతథంగా..   

గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారో సాంబడికి గుర్తు లేనట్లుంది!.విశాఖ జిల్లాలో 2019 ఎన్నికలప్పుడు దళిత వర్గానికి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేసి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బరిలోకి దించారు. కొవ్వూరు(ఎస్సీ) ఎమ్మెల్యే, అప్పటి మంత్రి కేఎస్‌ జవహర్‌ను కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి ట్రాన్స్‌ఫర్‌ చేసి పోటీ చేయించారు. ఇదే రీతిలో పలువురు ఎస్సీ, బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను జిల్లాల సరిహద్దులు దాటించి ఇతర నియోజకవర్గాల నుంచి చంద్రబాబు పోటీ చేయించారు చంద్రబాబు. 

వైఎస్సార్‌సీపీ ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలో నాలుగు జాబితాలకు కలిపి 58 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలకు మార్పులు చేసింది. అందులో.. అగ్రవర్ణాలు పోటీ చేసిన 7 అసెంబ్లీ స్థానాలను..  ఐదు బీసీలకు, రెండింటిని మైనారిటీలకు కేటాయించారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. సీట్ల కేటాయింపులో తన సొంత సామాజిక వర్గాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. మంగళగిరి ఆళ్ల  రామకృష్ణ రెడ్డి ,కదిరి సిద్ధారెడ్డి ,ఎమ్మిగనూరు  చెన్న  కేశవరెడ్డిలకు అలాగే.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గతంలోనే సీటు ఇవ్వలేనని తేల్చి చెప్పారాయన. 

సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం.. వైఎస్సార్‌సీపీ జాబితా

  • ఎస్సీలు- 21 
  • ఎస్టీలు -3
  • బీసీలు- 17 
  • మైనార్టీలు- 4 
  • ఓసి - 13 

10 లోక్‌సభ స్థానాల సమన్వయకర్తల్లో.. 

  • బీసీలు -6
  • ఎస్సీలు -2
  • ఎస్టీ -1 
  • ఓసీ -1 


ఏపీ కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ ఇచ్చిన మంత్రి పదవులు - 17  (కేబినెట్‌లో 70 శాతం) 

బీసీ  మంత్రులు :

  • బాబు  పాలనలో-8
  • జగన్ పాలనలో-11

ఎస్సీ మంత్రులు :

  • బాబు పాలనలో-2
  • జగన్ పాలనలో-5

జగన్‌ పాలనలో ఉప ముఖ్యమంత్రులు -4 (80 శాతం)

తొలిసారిగా ఒక ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు

స్పీకర్ 

  • బాబు పాలనలో-కోడెల (కమ్మ)
  • జగన్ పాలనలో -తమ్మినేని సీతారాం (బీసీ)

బీసీలకు రాజ్యసభ స్థానాలు 

  • బాబు పాలనలో-0
  • జగన్ పాలనలో -4 

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు :

ఎమ్మెల్సీలు లు 

  • బాబు పాలనలో-48 మంది ఎమ్మెల్సీలకుగానూ ఆయా సామాజిక వర్గాల నుంచి 18 మంది (37 శాతం )
  • జగన్ పాలనలో-43 మంది ఎమ్మెల్సీలకుగానూ ఆయా సామాజికవర్గాల నుంచి 29 మంది (68 శాతం)


    జగన్‌ హయాంలో మిగతావి.. 
     
  • 13 జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులలో - 9 (69 శాతం) 
  • 14  కార్పొరేషన్ మేయర్‌ పదవుల్లో  -12 (86 శాతం) 
  • గెలిచిన  84 మున్సిపల్ చైర్మన్  పోస్టుల్లో -58 (69 శాతం )
  • 137 వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్‌ పదవులలో - 79 (58 శాతం) 
  • నామినేటెడ్‌ డైరెక్టర్‌ పదవులు-280 (58 శాతం)
  • 196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లలో -117 (60 శాతం) 
  • 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో- 3,503 (50 శాతం )
  • బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు
  • ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు
  • ఎస్టీలకు 1 కార్పొరేషన్‌ ఏర్పాటు
  • ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గా­లకు 684 డైరెక్టర్‌ పదవులు

ఓసీల స్థానాలను.. బీసీ, మైనారిటీలకు ఇచ్చారు సీఎం జగన్‌. అయినా..  దళితుల స్థానాల్ని మళ్లీ దళితులకే కదా కేటాయించాల్సింది!. ఇందులో దళితులకు అన్యాయం  ఎక్కడుంది సాంబా?.. జగనన్న ప్రభుత్వంలో ఎంత సామాజిక న్యాయం జరిగిందో.. అలాగే మీ బాస్‌ టైంలో ఎంత సామాజిక (అ)న్యాయం జరిగిందో క్రాస్‌ చెక్‌ చేస్కో. 

::చిరు, కాలిఫోర్నియా    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement