సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు రాజకీయ సమాధికి తిరువూరులో జనవరి 3నే పునాది పడిందని విజయవాడ పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, ఎంపీ కేశినేని నాని అన్నారు. తిరువూరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
‘‘తిరువూరులో నాపై, స్వామిదాస్‌పైకి లోకేష్ గూండాలను పంపాడు. చంద్రబాబు కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు. సీఎం జగన్ పేదవాడిని ధనికుడిని చేశారు. నా భావజాలం, సీఎం జగన్ భావజాలం ఒక్కటే.. ముక్కు సూటితనం. విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి నిజమైన అంబేద్కర్ వాదిగా సీఎం జగన్ నిలిచారు’’ అని కేశినేని ప్రశంసించారు.
‘‘చంద్రబాబుకు రోడ్లు కావాలి.. ఫైవ్ స్టార్ హోటల్స్ కావాలి. సీఎం జగన్‌కు పేదవాడి కడుపుమంట తీర్చి వారిని ధనికుల్ని చేయడం కావాలి. లోకేష్ కోసం చంద్రబాబు అమరావతి నిర్మించాడు. చంద్రబాబు 100 కోట్లు కూడా విజయవాడ అభివృద్దికి ఇవ్వలేదు. తిరువూరులో స్వామి దాస్‌ను 20వేల ఓట్ల మెజారిటీతో గెలుపించుకోవాలి. త్వరలోనే కట్టలేరు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం’’ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment