Tiruvuru Assembly Constituency
-
టీడీపీ సర్పంచ్‌పై కొలికిపూడి ఓవరాక్షన్.. కవిత ఆత్మహత్యాయత్నం
సాక్షి, తిరువూరు: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలను కాకుండా సొంత పార్టీకి చెందిన వారిని కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా టీడీపీ సర్పంచ్ ఫ్యామిలీని కొలికపూడి శ్రీనివాస్ టార్గెట్ చేసి వేధింపులకు గురిచేయడంతో సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం చేసింది.టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. తాజాగా చిట్టేల టీడీపీ సర్పంచ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేసి బూతులు తిట్టాడు. చిట్టేల సర్పంచ్ పేకాట ఆడుతూ పోలీసులకు దొరికాడు. ఆయనకు సిగ్గుంటే సర్పంచ్‌గా ఉంటాడా?. సర్పంచ్ కనపడితే చెప్పుతో కొడతాను. నా కొడకా ఇంకోసారి కనపడితే గుడ్డలు ఉడదీసి కొడతాను అంటూ తనకు వచ్చిన తీరుగా మాట్లాడాడు. అసభ్యకర పదజాలంతో దూషించాడు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతనే ఎమ్మెల్యే ఇలా టార్గెట్ చేయడంతో సర్పంచ్ ఫ్యామిలీ మనస్తాపానికి గురైంది. సర్పంచ్ శ్రీనివాస్‌ను ఇలా తిట్టడంతో ఆయన భార్య, వీఆర్వో కవిత ఆత్మహత్యకు పాల్పడింది. వీఆర్వో కవిత నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో, వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కవిత ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి: వైఎస్సార్సీపీ నేతలు -
చంద్రబాబుకు కేశినేని నాని ఓపెన్ సవాల్
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుకు కేశినేని నాని ఓపెన్ సవాల్ విసిరారు. చంద్రబాబుకు తన మీద గెలిచే దమ్ముందా అని కామెంట్స్ చేశారు. అలాగే, నారా లోకేష్ ఓ పనికిమాలిన వ్యక్తి అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, కేశినేని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడలో అంబేద్కర్ ఉన్నారు, నేను ఉన్నాను. నాని మీద నేను గెలుస్తా అంటూ మీడియా ముందు మాట్లాడుతున్నారు. నేను మూడు లక్షల ఓట్లతో గెలుస్తున్నా. కాల్ మనీ గాళ్లు కాదు బస్తీమే సవాల్.. దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబే నాపై పోటీచేయాలి. నారా లోకేష్ ఒక పనికి మాలినోడు. జనవరి మూడో తేదీ చంద్రబాబు నాయుడికి తిరువూరు నియోజకవర్గం సమాధి కట్టింది. #Siddham విజయవాడ MP అభ్యర్థి Kesineni Nani గారు ఈరోజు maa vurilo జరిగిన సమావేశంలో pic.twitter.com/Ut5ubb6Scq — Nagarjuna Jupudi (@NagarjunaJupud1) January 28, 2024 చంద్రబాబుకు రాబోయే ఎన్నికలే చివరివి. దానికి మూల కారణం తిరువూరు సంఘటనే. ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మూసుకున్నా అవమానాలు పడ్డాను. సీఎం జగన్ మమ్మల్ని ఆలింగనం చేసుకుని మీలాంటి వ్యక్తులు మా పార్టీలో ఉండాలని ఆహ్వానించారు. కొడుకు లోకేష్‌ను సీఎం చేయాలనే అజెండాతో చంద్రబాబు పని చేస్తున్నాడు. 33వేల ఎకరాలు రైతుల వద్ద తీసుకుని మోసగించాడు. అందుకే సొంతిల్లు కూడా కట్టలేదు. చంద్రబాబు మూటాముల్లె సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోవడానికి సిద్దంగా ఉన్నాడు. సీఎం జగన్ నిజమైన అంబేద్కర్‌వాది. కొన్ని మీడియా సంస్థలు ఏపీ అభివృద్ధి జరగలేదంటూ గొంతు చించుకుంటున్నాయి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే అదే మానవ అభివృద్ధి. మళ్లీ సీఎం జగన్ గెలిస్తేనే పేదవాళ్లందరూ సంతోషంగా ఉంటారు. చంద్రబాబు గెలిస్తే ధనికులు హ్యాపీగా ఉంటారు. సీఎం జగన్‌ను మొదటగా స్వామిదాస్ అడిగింది ఒక్కటే వినగడప కట్టలేరు బ్రిడ్జి. రూ.26కోట్ల వ్యయంతో ఫిబ్రవరి మూడో తేదీన కట్టలేరు బ్రిడ్జికు శంఖుస్థాపన చేయబోతున్నాం. స్వామిదాస్ పక్కా లోకల్.. మనకు అన్ని చేసిపెట్టే వ్యక్తి సీఎం జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
టీడీపీలో ఫ్లెక్సీల లొల్లి
కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ తన పుట్టిన రోజును వేదికగా చేసుకుని నియోజకవర్గవ్యాప్తంగా గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫ్లెక్సీల్లో జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నట్లు వ్యక్తుల పేర్లు కాకుండా గ్రామ టీడీపీ అని పేర్కొనడం వివాదానికి కారణమైంది. నియోజకవర్గ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న పెండ్యాల అచి్చబాబు స్వగ్రామమైన దొమ్మేరులో ఆయన ఫొటో లేకుండా ఈ తరహా ఫ్లెక్సీల ఏర్పాటును ఆ పార్టీ స్థానిక నాయకులు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో అచ్చిబాబు వర్గీయులు శుక్రవారం గ్రామంలో సమావేశమై మరీ జవహర్‌పై బహిరంగ విమర్శలకు దిగారు. గ్రామ కమిటీ, స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా ‘దొమ్మేరు టీడీపీ’ అని పేర్కొంటూ తమ గ్రామంలో ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారని, ఇది జవహర్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. పార్టీని రెండు గ్రూపులుగా చేసేందుకు ఆయన ప్రయతి్నస్తున్నారని సీనియర్ నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు యలమర్తి శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు)మండిపడ్డారు. దొమ్మేరు గ్రామ కమిటీని సంప్రదించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అచి్చబాబు చెప్పినట్లే నడుస్తాం తప్ప, జవహర్ చెప్పినట్లు కాదని స్పష్టం చేశారు. సీనియర్ నాయకుడు కేవీకే రంగారావు, ఉప సర్పంచ్ కలగర సుబ్బారావు, టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొక్కిరిపాటి శ్రీహరి కూడా జవహర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పారీ్టకి, ఆ ఫ్లెక్సీలకు ఎటువంటి సంబంధమూ లేదని ప్రకటించారు. గతంలో అచ్చిబాబు చెబితేనే జవహర్‌కు 13 రోజుల ముందు టికెట్ ఇచ్చినా ఎమ్మెల్యేగా గెలిపించామని అన్నారు. దొమ్మేరులో జవహర్‌కు మద్దతుదారులు లేరని ప్రకటించారు. అందువల్లే సొంతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారన్నారని అన్నారు. కొవ్వూరులో శుక్రవారం జరిగిన జవహర్ పుట్టిన రోజు వేడుకలకు సైతం అచి్చబాబు వర్గీయులు దూరంగానే ఉన్నారు. ఇటీవల అభ్యర్థుల ఖరారులో భాగంగా అధిష్టానం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా జవహర్ పేరు ప్రస్తావించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజా వివాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎనిమిదేళ్లుగా..: జవహర్, అచ్చిబాబు వర్గాల మధ్య ఏడెనిమిదేళ్లుగా వివాదం నడుస్తోంది. దీంతో నియోజకవర్గంలో టీడీపీ రెండు గ్రూపులుగా పనిచేస్తోంది. గతంలో అచి్చబాబు వర్గం వ్యతిరేకించినందునే జవహర్‌ను అధిష్టానం కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి పంపింది. అక్కడ ఓటమి చవిచూసిన ఆయన మళ్లీ కొవ్వూరుపై దృష్టి సారించారు. పేరుకు జిల్లా అధ్యక్షుడి పదవి కట్టబెట్టినప్పటికీ కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అధిష్టానం షరతు విధించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
‘చంద్రబాబు కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు రాజకీయ సమాధికి తిరువూరులో జనవరి 3నే పునాది పడిందని విజయవాడ పార్లమెంట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఎంపీ కేశినేని నాని అన్నారు. తిరువూరు వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘‘తిరువూరులో నాపై, స్వామిదాస్‌పైకి లోకేష్ గూండాలను పంపాడు. చంద్రబాబు కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు. సీఎం జగన్ పేదవాడిని ధనికుడిని చేశారు. నా భావజాలం, సీఎం జగన్ భావజాలం ఒక్కటే.. ముక్కు సూటితనం. విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి నిజమైన అంబేద్కర్ వాదిగా సీఎం జగన్ నిలిచారు’’ అని కేశినేని ప్రశంసించారు. ‘‘చంద్రబాబుకు రోడ్లు కావాలి.. ఫైవ్ స్టార్ హోటల్స్ కావాలి. సీఎం జగన్‌కు పేదవాడి కడుపుమంట తీర్చి వారిని ధనికుల్ని చేయడం కావాలి. లోకేష్ కోసం చంద్రబాబు అమరావతి నిర్మించాడు. చంద్రబాబు 100 కోట్లు కూడా విజయవాడ అభివృద్దికి ఇవ్వలేదు. తిరువూరులో స్వామి దాస్‌ను 20వేల ఓట్ల మెజారిటీతో గెలుపించుకోవాలి. త్వరలోనే కట్టలేరు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం’’ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. -
దళిత ద్రోహి ఎవరు.. సామాజిక న్యాయం చేసిందెవరు?
హవ్వా.. దళిత ఎమ్మెల్యేలనే ట్రాన్స్ఫర్ చేస్తారా? ఏంటిది?.. అంటూ టీవీ5 సాంబ చౌదరి పెడుతున్న కితకితలు రాజకీయ వర్గాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. ఫ్లాష్‌బ్యాక్ తెలియక మనోడు వేస్తున్న వేషాలకు.. కాలమే సరైన సమాధానమే చెబుతుంది. ఏపీ(ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక..) రాజకీయాల్లో అసలు దళితులకు న్యాయం చేసిందెవరు? అన్యాయం చేసిందెవరు? పరిశీలిస్తే.. కాలిఫోర్నియా నుంచి ఓ ప్రవాసాంధ్రుడు పంపిన కథనం యధాతథంగా.. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారో సాంబడికి గుర్తు లేనట్లుంది!.విశాఖ జిల్లాలో 2019 ఎన్నికలప్పుడు దళిత వర్గానికి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బరిలోకి దించారు. కొవ్వూరు(ఎస్సీ) ఎమ్మెల్యే, అప్పటి మంత్రి కేఎస్ జవహర్‌ను కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసి పోటీ చేయించారు. ఇదే రీతిలో పలువురు ఎస్సీ, బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను జిల్లాల సరిహద్దులు దాటించి ఇతర నియోజకవర్గాల నుంచి చంద్రబాబు పోటీ చేయించారు చంద్రబాబు. వైఎస్సార్సీపీ ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలో నాలుగు జాబితాలకు కలిపి 58 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలకు మార్పులు చేసింది. అందులో.. అగ్రవర్ణాలు పోటీ చేసిన 7 అసెంబ్లీ స్థానాలను.. ఐదు బీసీలకు, రెండింటిని మైనారిటీలకు కేటాయించారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. సీట్ల కేటాయింపులో తన సొంత సామాజిక వర్గాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. మంగళగిరి ఆళ్ల రామకృష్ణ రెడ్డి ,కదిరి సిద్ధారెడ్డి ,ఎమ్మిగనూరు చెన్న కేశవరెడ్డిలకు అలాగే.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గతంలోనే సీటు ఇవ్వలేనని తేల్చి చెప్పారాయన. సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం.. వైఎస్సార్సీపీ జాబితా ఎస్సీలు- 21 ఎస్టీలు -3 బీసీలు- 17 మైనార్టీలు- 4 ఓసి - 13 10 లోక్‌సభ స్థానాల సమన్వయకర్తల్లో.. బీసీలు -6 ఎస్సీలు -2 ఎస్టీ -1 ఓసీ -1 ఏపీ కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ ఇచ్చిన మంత్రి పదవులు - 17 (కేబినెట్లో 70 శాతం) బీసీ మంత్రులు : బాబు పాలనలో-8 జగన్ పాలనలో-11 ఎస్సీ మంత్రులు : బాబు పాలనలో-2 జగన్ పాలనలో-5 జగన్ పాలనలో ఉప ముఖ్యమంత్రులు -4 (80 శాతం) తొలిసారిగా ఒక ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు స్పీకర్ బాబు పాలనలో-కోడెల (కమ్మ) జగన్ పాలనలో -తమ్మినేని సీతారాం (బీసీ) బీసీలకు రాజ్యసభ స్థానాలు బాబు పాలనలో-0 జగన్ పాలనలో -4 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు : ఎమ్మెల్సీలు లు బాబు పాలనలో-48 మంది ఎమ్మెల్సీలకుగానూ ఆయా సామాజిక వర్గాల నుంచి 18 మంది (37 శాతం ) జగన్ పాలనలో-43 మంది ఎమ్మెల్సీలకుగానూ ఆయా సామాజికవర్గాల నుంచి 29 మంది (68 శాతం) జగన్ హయాంలో మిగతావి.. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో - 9 (69 శాతం) 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో -12 (86 శాతం) గెలిచిన 84 మున్సిపల్ చైర్మన్ పోస్టుల్లో -58 (69 శాతం ) 137 వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులలో - 79 (58 శాతం) నామినేటెడ్ డైరెక్టర్ పదవులు-280 (58 శాతం) 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో -117 (60 శాతం) 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో- 3,503 (50 శాతం ) బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులు ఓసీల స్థానాలను.. బీసీ, మైనారిటీలకు ఇచ్చారు సీఎం జగన్. అయినా.. దళితుల స్థానాల్ని మళ్లీ దళితులకే కదా కేటాయించాల్సింది!. ఇందులో దళితులకు అన్యాయం ఎక్కడుంది సాంబా?.. జగనన్న ప్రభుత్వంలో ఎంత సామాజిక న్యాయం జరిగిందో.. అలాగే మీ బాస్ టైంలో ఎంత సామాజిక (అ)న్యాయం జరిగిందో క్రాస్ చెక్ చేస్కో. ::చిరు, కాలిఫోర్నియా -
వైఎస్సార్ సీపీ నాలుగో జాబితా.. సంపూర్ణ సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: సంపూర్ణ సామాజిక న్యాయం, ప్రజాదరణే గీటు రాయిగా 8 శాసనసభ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగో జాబితాను ఖరారు చేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పరిష్కరిస్తూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల మన్ననలు అందుకొన్న నేతలకు పెద్దపీట వేశారు. సామాజిక న్యాయంలో మరో రెండడుగులు ముందుకేశారు. గురువారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను ప్రకటించారు. గత నెల 11న 11 శాసనసభ స్థానాలకు, ఈ నెల 2వతేదీన 24 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ నెల 11న విడుదల చేసిన మూడో జాబితాలో 15 శాసనసభ, 6 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించారు. మొత్తం నాలుగు జాబితాలతో కలిపి 58 శాసనసభ, 10 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను ప్రకటించారు. 58 మంది సమన్వయకర్తల్లో ఎస్సీలు 21 మంది, ఎస్టీలు ముగ్గురు, బీసీలు 17 మంది, మైనార్టీలు నలుగురు, అగ్రవర్ణాలకు చెందిన వారు 13 మంది ఉన్నారు. పది లోక్‌సభ స్థానాల సమన్వయకర్తల్లో బీసీలు ఆరుగురు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ఓసీ ఒకరు చొప్పున ఉన్నారు. సామాజిక సమీకరణాలు, స్థానిక అంశాలు.. వైనాట్ 175 లక్ష్యంతో దూసుకెళుతున్న వైఎస్సార్సీపీ వ్యూహాత్మకంగా మరో ముందడుగు వేసింది. సామాజిక సమీకరణలు, స్థానిక రాజకీయ అంశాల మేలు కలయికగా తాజాగా నాలుగో జాబితాను ప్రకటించింది. ప్రజలకు మరింత మేలు చేయడం, పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సమన్వయకర్తలను నియమించింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ 2019 నుంచి ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రిగా ఉన్న సీనియర్ నేత కె.నారాయణ స్వామిని చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. 2019లో చిత్తూరు ఎంపీగా గెలిచిన ఎన్.రెడ్డెప్పను జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఖరారు చేసింది. ఇక అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎం.వీరాంజనేయులు, నంద్యాల జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ సుధీర్ దారా, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర సమన్వయకర్తగా ఈర లక్కప్పలకు తొలిసారి అవకాశం కల్పించింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నల్లగట్ల స్వామిదాస్‌ను నియమించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రి తానేటి వనితను గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ప్రస్తుతం గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా హనుమంతునిపాడు జెడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణ యాదవ్‌ను నియమించారు. చేసిన మంచే శ్రీరామరక్షగా.. ప్రజలకు నాలుగున్నరేళ్లుగా చేసిన మంచి పనులే మనకు తోడుంటాయనే ధైర్యంతో ముఖ్యమంత్రి జగన్ అడుగులు ముందుకు వేస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సన్నద్ధం చేస్తున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండేవారికే టికెట్ ఇస్తున్నారు. ఆ విషయం అనేకసార్లు ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. తన తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గత 56 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్నారు. డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా నేరుగా రూ.2.45 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.67 లక్షల కోట్లు వెరసి మొత్తం రూ.4.12 లక్షల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూర్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించినట్లుగా దళితులు, బలహీనవర్గాలు, పేద వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేలా తోడ్పాటు అందిస్తున్నారు. శాసనమండలి చైర్మన్‌గా మోషేన్ రాజును, బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌ను స్పీకర్‌గా నియమించి సామాజిక సమీకరణకు పెద్ద పీట వేశారు. 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మంత్రుల్ని చేశారు. సంక్షేమ పథకాలను ఎలాంటి లంచాలు, సిఫారసులకు తావులేకుండా ప్రజలకు అందిస్తున్నారు. మహిళా సాధికారతను సాకారం చేశారు. వైఎస్సార్ మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తే సీఎం జగన్ వారిని కోటీశ్వరులుగా చేస్తున్నారు. పేదల పిల్లలకు ఉన్నత వర్గాలతో సమానంగా ఇంగ్లిష్ మీడియం చదువులు అందిస్తున్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు ద్వారా బడుగు బలహీన వర్గాలు, దళితుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించారు. ఈ క్రమంలో 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. నాలుగో జాబితా ఇదీ చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం (ఎస్సీ రిజర్వుడ్): కె.నారాయణస్వామి (ఉప ముఖ్యమంత్రి) 8 శాసనసభ నియోజక వర్గాలకు సమన్వయకర్తలు వీరే.. 1. జీడీ నెల్లూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): ఎన్ . రెడ్డెప్ప 2.శింగనమల (ఎస్సీ రిజర్వ్డ్ ): ఎం. వీరాంజనేయులు 3. నందికొట్కూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): డాక్టర్ సుధీర్ దారా 4. తిరువూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): నల్లగట్ల స్వామిదాస్ 5. మడకశిర (ఎస్సీ రిజర్వ్డ్ ): ఈర లక్కప్ప 6. కొవ్వూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): తలారి వెంకట్రావు 7. గోపాలపురం (ఎస్సీ రిజర్వ్డ్ ): తానేటి వనిత 8. కనిగిరి: దద్దాల నారాయణ యాదవ్ -
‘చంద్రబాబు మమ్మల్ని ఇంట్లోకి కూడా రానివ్వలేదు’
గుంటూరు, సాక్షి: చంద్రబాబులో మానవత్వం మచ్చుకైనా లేదని.. ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరని తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. గురువారం సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ పార్టీలో చేరిన ఆయన సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘అవసరం లేకపోతే చంద్రబాబు ఎవర్నీ పట్టించుకోరు. ఆయన ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరు. దాదాపుగా 30 ఏళ్లుగా టీడీపీలో పని చేసినా కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. భార్యాభర్తలం పది రోజులపాటు చంద్రబాబు ఇంటి ముందు ఎదురుచూసినా ఫలితం లేదు. టీడీపీ నేతలే మాకు వెన్నుపోటు పొడిచారు.. .. మాతో మంచిగా ఉంటూనే తిరువూరులో వెన్నుపోటుతో ఓడించారు. మా దళితులకు సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలు అద్భుతం. అవి నచ్చి ఆయన సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాం. సీఎం జగన్ ఏం చెప్తే అది చేయటానికి మేము సిద్ధం’’ అని స్వామిదాస్ తెలిపారు. సంబంధిత వార్త: టీడీపీకి భారీ షాక్.. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి స్వామిదాస్ -
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన స్వామిదాస్
గుంటూరు, సాక్షి: ఎన్టీఆర్ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి పెద్ద దెబ్బ పడింది. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ టీడీపీని వీడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారాయన. గురువారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో స్వామిదాస్‌కు కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. స్వామిదాస్‌తో పాటు ఆయన సతీమణి సుధారాణి కూడా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వామిదాస్ 1994, 1999 లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ఖాళీ కావడం ఖాయమంటూ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. -
జూ.ఎన్టీఆర్ X టీడీపీ
సాక్షి, భీమవరం/పెనుగొండ/తిరువూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘రా... కదలి రా..’ పేరిట ఆదివారం నిర్వహించిన సభకు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. వారు తీసుకొచ్చిన ఫ్లెక్సీలు, జెండాలను లాక్కుని వారిపై వీరంగం సృష్టించి అక్కడినుంచి తరిమేశారు. ఆచంటలో వారిని అడ్డుకునేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలపైనా టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆచంటలో లక్ష మంది జనంతో ఈ సభ నిర్వహించాలని టీడీపీ నాయకత్వం విస్తృత ప్రచారం నిర్వహించినా కనీసం 12 వేల మంది కూడా హాజరుకాకపోవడంతో క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై ఎన్టీఆర్ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మతో రూపొందించిన ఫ్లెక్సీలు తీసుకుని సభాస్థలికి వచ్చారు. టీడీపీ క్యాడర్ వారిని అడ్డుకున్నారు. వారి చేతిలోని ఫ్లెక్సీని లాక్కుని వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జై ఎన్టీఆర్, జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో జనసేన అభిమానులు సైతం వారి పార్టీ జెండాలతో రావడంతో వారి చేతుల్లోని జెండాలను కూడా టీడీపీ క్యాడర్ లాక్కుని బయటకు విసిరేశారు. ఈ తరుణంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆచంటలో కానరాని జనసేన టీడీపీ, జనసేన నాయకత్వం మధ్య అంతర్గత పోరు జరుగుతున్నట్టు ఆచంటలో జరిగిన చంద్రబాబు సభ ద్వారా బయటపడింది. ఈ సభకు సంబంధించి జనసేనకు సరైన సమాచారం ఇవ్వలేదన్న భావనతో ఆ పార్టీ నాయకులు బహిరంగ సభకు దూరంగా ఉన్నారని తెలియవచ్చింది. నియోజకవర్గ జనసేన ఇన్చార్జి చేగొండి సూర్యప్రకాష్ సైతం రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వెలవెలబోయిన రెండు సభలు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన రెండు సభలకు జనం నుంచి ఆదరణ కరువైంది. రెండు చోట్లా ఆశించిన రీతిలో జనం రాకపోవడంతో నాయకులు హతాశులయ్యారు. ఆచంటలో చంద్రబాబు జనంకోసం ఎదురు చూస్తూ హెలీప్యాడ్ వద్దే నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో ఆలస్యంగా సభ ప్రారంభం కావడంతో వచ్చిన జనం కాస్తా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇక తిరువూరులో 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభ జనం లేక వెలవెలబోయింది. సగానికి పైగా స్థలంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సభకు వచ్చిన జనం కూడా చంద్రబాబు ప్రసంగం ప్రారంభించకముందే వెనుదిరగడం గమనార్హం. ఎంపీ కేశినేని నాని రావడం లేదన్న సమాచారంతో ద్వితీయ వర్గం నాయకులు, కార్యకర్తలు డుమ్మా కొట్టారు. విసుగెత్తించిన ‘బాబు’ ప్రసంగం రెండు సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించిన తీరు హాజరైన ప్రజలను విసుగెత్తించింది. ఆరు హామీల అమలుపై ‘బాబు’ ప్రసంగంపై మహిళలు పెదవి విరిచారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలుచేసే సంక్షేమ పథకాలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయంటూ బాహాటంగానే విమర్శించడం గమనార్హం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు విమర్శించిన తీరుని సైతం పలువురు తప్పుపట్టారు. ప్రసంగం ఆద్యంతం ఆత్మస్తుతి పరనిందగా సాగింది. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకొచ్చారు. అంబులెన్సుకూ దారివ్వని తమ్ముళ్లు తిరువూరు సభకు వచ్చిన వాహనాలు విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారిపై అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దూరప్రాంతాల నుంచి వచ్చిపోయే భారీవాహనాలతో పాటు అత్యవసర చికిత్స నిమిత్తం రోగులను తరలించే అంబులెన్సుకు కూడా దారి ఇవ్వకుండా తెలుగుతమ్ముళ్ళు అవరోధాలు కల్పించారు. తిరువూరు సీఐ అబ్దుల్ నబీ తన సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ చేసి అంబులెన్సును పంపారు. అధికారమిస్తే ఆరుపథకాలు తిరువూరు, ఆచంట సభల్లో చంద్రబాబు నాయుడు తిరువూరు/సాక్షి, భీమవరం/పెనుగొండ: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని గెలిపించి అధికారం కట్టబెడితే ఆరు పథకాలను అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో ఆదివారం నిర్వహించిన రా కదలిరా పేరిట టీడీపీ నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఉచిత సరఫరా, రైతులకు ఏడాదికి రూ.50 వేల ఆర్థికసాయం ప్రధానంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికీ అండగా నిలబడటమే టీడీపీ, జనసేన లక్ష్యమని చెప్పుకొచ్చారు. తెలుగు జాతిని తిరుగులేని శక్తిగా తయారు చేసే బాధ్యతను తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వారంగాన్ని వైఎస్సార్సీపీ అతలాకుతలం చేసిందనీ, తాము అధికారంలోకి వస్తే ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో సమర్థుడైన మంత్రి ఒకరూ లేరన్నారు. తాము అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు తెస్తామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన విజన్ కారణంగానే హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగానికి ప్రధాన కేంద్రమైందని, లక్షలాదిమంది ఉద్యోగాలు పొందడానికి తానే కారణమని గొప్పగా చెప్పారు. తిరువూరు సభలో వేదికపై ఎంపీ కేశినేని నానికి ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు పక్కనే సీటు కేటాయించారు. కానీ ఆయన డుమ్మాకొట్టారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు సైతం సభ వైపునకు రాకపోవడం చర్చనీయాంశమైంది. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశించిన ప్రస్తుత ఇన్చార్జి శావల దేవదత్ ఆ ఊసే లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆచంట సభలో పాలకొల్లు, ఉండి ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, పీతల సుజాత తదితరులు ప్రసంగించారు. -
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ..
తిరువూరు: టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన నాయకుల నడుమ ప్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్‌మీరాలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే ఎంపీ ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గం బైఠాయించింది. ఇందుకు నియోజకవర్గ ఇన్చార్జి దేవదత్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాడికి యత్నించారు. స్థానిక నేతలు దేవదత్‌ను ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చిన్నీ గో బ్యాక్ అంటూ నాని వర్గం గేటు వద్ద బైఠాయించగా, పోలీసులు చిన్నీని కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. ఏర్పాట్లపై సమీక్ష జరిపే అవకాశం లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ఆవరణలో కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. జిందాబాద్, గో బ్యాక్ నినాదాలతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆఫీసులో కుర్చీలు విసురుకుంటున్న కార్యకర్తలు ఎస్ఐపై కార్యకర్తల దాడి.. టీడీపీ వర్గవిబేధాల నేపథ్యంలో బుధవారం తిరువూరు పార్టీ కార్యాలయంలో ఘర్షణ పడిన కార్యకర్తలు పోలీసులపైనే దాడులకు పాల్పడ్డారు. రణరంగాన్ని తలపించే రీతిలో కార్యాలయంలో ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్నిల వర్గీయులు దాడికి తెగపడి కుర్చీలు విసురుకున్నారు. పరిస్థితి అదుపు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు సీఐ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదర గొట్టినప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో నాని, చిన్నీల అనుచరులు బీభత్సం సృష్టించారు. చేతికందిన వస్తువుల్ని విసురుకుంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఇరువర్గాలను పోలీసులు శాంతింపజేసే యత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. గాయపడిన ఎస్ఐ సతీష్ తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సంఘటనతో భయాందోళనలకు గురై పరుగులు తీశారు. దాడులకు పాల్పడవద్దని, శాంతియుతంగా వ్యవహరించాలని పదే పదే కోరినా ఫలితం లేకపోవడంతో లాఠీఛార్జీ చేసి అల్లరిమూకలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొందరు కుర్చీలు విసిరారు. ఈ దాడిలో తిరువూరు ఎస్ఐ సతీష్ తలకు బలమైన గాయమైంది. ఎట్టకేలకు ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎస్ఐ సతీష్‌ను ఆసుపత్రికి తరలించారు. కవ్వింపు చర్యలకు పాల్పడిన ఇరువర్గాలు.. పార్టీ కార్యాలయంలో పరిస్థితి చేయి దాటుతున్నప్పటికీ ఎంపీ నాని, చిన్ని ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మీడియాతో మాట్లాడేందుకు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు సైతం అదుపు చేయలేకపోయారు. తోపులాటలో ఒక మహిళా కార్యకర్తకు సైతం గాయాలయ్యాయి. చంద్రబాబు పర్యటన గురించి ఏమాత్రం సమీక్షించకుండానే గద్దె రామ్మోహన్, తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు తదితరులు వెళ్ళిపోయారు. దళితుడిని కాబట్టి షటప్, గెటవుట్ అంటారా.. ‘నేనొక దళిత నాయకుడిని. నన్ను షటప్, గెటవుట్ అంటారా. నాలుగు గోడల మధ్య మీరు అంటే సరిపోయిందా. బయటకు వచ్చి అందరి ముందు ఇవే మాటలు అనండ’ని తిరువూరు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి ఎస్.దేవదత్తు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేశినేని నాని, ఆయన వర్గీయులు తాను ఏర్పాటు చేసుకున్న టీడీపీ కార్యాలయానికి వచ్చి పరుష పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని తన వర్గీయులతో కలిసి పక్కనే ఉండగా దేవదత్తు మాట్లాడిన అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన మాటల్లోనే.. ‘దళితుడినైన నేను ఉన్నత విద్యను అభ్యసించి, 15 సంవత్సరాలు వివిధ దేశాల్లో పనిచేసి జ్ఞానం పొందా. నేనేదో సమావేశంలో మాట్లాడబోతుంటే నా ఆఫీసుకే వచ్చి నన్ను షటప్, గెటవుట్ అని కేశినేని నాని అంటారా.. నా ఆఫీసులో నాకు మాట్లాడే హక్కు లేదా? రెండు సార్లు గెలిచిన మీకే హక్కు ఉందా? మీరేనా నియోజకవర్గ నాయకులు. మేము కాదా. మాకు అవకాశం లేదా. మాకు చెప్పుకునే అర్హత లేదా. ఇంకా ఎంతకాలం మీరు దళితులపై ఇలా హీనంగా మాట్లాడతారు. ఏడు నియోజకవర్గాలను గెలిపిస్తామంటున్నారు. ఎక్కడ గెలిపించారు. మీరు మాత్రమే గెలిచారు. తక్కినవి ఓడిపోయారు’. దాడి సంఘటనపై కేసు నమోదు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరువూరు ఎస్ఐ సతీష్‌పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రమేష్ తెలిపారు. తిరువూరు పోలీసుస్టేషన్లో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఇరువర్గాలు దాడికి పాల్పడుతుండగా అదుపు చేయడానికి యత్నించిన ఎస్ఐ సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఎస్ఐపై దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు. నిందితులను అరెస్టు చేస్తాం.. తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎస్ఐ సతీష్‌పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేశాం. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. శాంతిభద్రతలు కాపాడటానికి యత్నించిన పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేయడం శోచనీయం. సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించి అరెస్టు చేస్తాం. – కాంతి రాణా టాటా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ -
రణరంగంగా నాని వర్సెస్ చిన్ని.. జనసైనిక్స్ ఆగ్రహం!
ఎన్టీఆర్, సాక్షి: అన్నదమ్ముల మధ్య వర్గపోరు మరోసారి బహిరంగంగానే తీవ్రస్థాయిలో బయటపడింది. బుధవారం తిరువూరులో టీడీపీ సమన్వయ భేటీ సాక్షిగా కేశినేని నాని-కేశినేని చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. చిన్నిని లోపలికి వెళ్లనీయకుండా నాని వర్గీయులు అడ్డుకోవడంతో పార్టీ ఆఫీస్ ప్రాంగణం రణరంగంగా మారింది. ఈ క్రమంలో.. అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపైనా దాడికి దిగారు. ఈ పరస్సర దాడిలో ఎస్సై సతీష్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉంది. ఈ ఏర్పాట్లను స్థానిక నేతలతో విడివిడిగా భేటీ అవుతూ ఆ అన్నదమ్ములిద్దరూ వేర్వేరుగానే పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సమన్వయ భేటీ జరగ్గా.. దానికి జనసేన కార్యకర్తలు సైతం హజరయ్యారు. అయితే అక్కడ కేశినేని నాని ఫ్లెక్సీ లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహానికి గురయ్యారు. అక్కడే ఉన్న చిన్ని ఫ్లెక్సీని చించేశారు. అయితే అందులో పవన్ కల్యాణ్ ఫొటో కూడా ఉండడంతో జనసైనికులు నొచ్చుకున్నారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సమావేశం బహిష్కరిస్తూ వెళ్లిపోయారు. అదే సమయంలో తిరువూరు ఇన్‌ఛార్జి దత్తుపై నాని వర్గీయుల దాడి చేశారు. చిన్నిని లోపలికి రానివ్వబోమంటూ అడ్డుగా బైఠాయించారు. ఇక.. ఈ పరిణామం గురించి తెలుసుకుని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు కేశినేని చిన్ని. ఆయన్ని అడ్డుకునేందుకు నాని వర్గం ప్రయత్నించగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో టీడీపీ నేతలు సర్దిచెప్పే యత్నం చేశారు. అయినా పరిస్థితి సర్దుమణగలేదు. చివరకు ఎస్సై తలకు గాయం కావడంతో.. విస్తృతస్థాయి సమావేశం నిర్వహించుకుండానే టీడీపీ ముఖ్యనేతలు అక్కడి నుంచి జారుకున్నారు.