టీడీపీ సర్పంచ్‌పై కొలికిపూడి ఓవరాక్షన్‌.. కవిత ఆత్మహత్యాయత్నం | MLA Kolikapudi Srinivasa Rao Warning TO TDP Sarpanch | Sakshi
Sakshi News home page

టీడీపీ సర్పంచ్‌పై కొలికిపూడి ఓవరాక్షన్‌.. కవిత ఆత్మహత్యాయత్నం

Published Wed, Sep 25 2024 1:57 PM | Last Updated on Wed, Sep 25 2024 5:45 PM

MLA Kolikapudi Srinivasa Rao Warning TO TDP Sarpanch

సాక్షి, తిరువూరు: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలను కాకుండా సొంత పార్టీకి చెందిన వారిని కూడా టార్గెట్‌ చేస్తున్నారు. తాజాగా టీడీపీ సర్పంచ్‌ ఫ్యామిలీని కొలికపూడి శ్రీనివాస్‌ టార్గెట్‌ చేసి వేధింపులకు గురిచేయడంతో సర్పంచ్‌ భార్య ఆత్మహత్యాయత్నం చేసింది.

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌.. తాజాగా చిట్టేల టీడీపీ సర్పంచ్‌ శ్రీనివాస్‌ను టార్గెట్‌ చేసి బూతులు తిట్టాడు. చిట్టేల సర్పంచ్‌ పేకాట ఆడుతూ పోలీసులకు దొరికాడు. ఆయనకు సిగ్గుంటే సర్పంచ్‌గా ఉంటాడా?. సర్పంచ్‌ కనపడితే చెప్పుతో కొడతాను. నా కొడకా ఇంకోసారి కనపడితే గుడ్డలు ఉడదీసి కొడతాను అంటూ తనకు వచ్చిన తీరుగా మాట్లాడాడు. అసభ్యకర పదజాలంతో దూషించాడు. 

ఈ క్రమంలో సొంత పార్టీ నేతనే ఎమ్మెల్యే ఇలా టార్గెట్‌ చేయడంతో సర్పంచ్‌ ఫ్యామిలీ మనస్తాపానికి గురైంది. సర్పంచ్‌ శ్రీనివాస్‌ను ఇలా తిట్టడంతో ఆయన భార్య, వీఆర్వో కవిత ఆత్మహత్యకు పాల్పడింది. వీఆర్వో కవిత నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో, వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కవిత ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులతో మహిళా VRO ఆత్మహత్యాయత్నం

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి: వైఎస్సార్‌సీపీ నేతలు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement