
గుంటూరు, సాక్షి: ఎన్టీఆర్ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి పెద్ద దెబ్బ పడింది. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ టీడీపీని వీడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారాయన.
గురువారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో స్వామిదాస్‌కు కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. స్వామిదాస్‌తో పాటు ఆయన సతీమణి సుధారాణి కూడా వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
స్వామిదాస్ 1994, 1999 లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ఖాళీ కావడం ఖాయమంటూ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment