
సాక్షి, అమరావతి:వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమించారని, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని పేర్కొంది.
పీఏసీ సభ్యులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు), మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, విడదల రజిని, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్‌బాబు, మాజీ మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్‌కే రోజా, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రులు షేక్ బెపారి అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్‌ఖాన్, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌లను నియమించారు. పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.
మరికొన్ని నియామకాలు
వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన మరో ప్రకటనలో పేర్కొంది. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షునిగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ పినిపే శ్రీకాంత్, రాష్ట్ర ప్రదాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి(వై.విశ్వేశ్వరరెడ్డి స్థానంలో)లను నియమించారు.