Nallagatla swamidas
-
కొలికపూడి పద్ధతి మార్చుకో.. స్వామిదాస్ వార్నింగ్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు రాక్షసంగా వ్యవహరిస్తున్నారని తిరువూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, యథేచ్ఛగా దాడులు, ఆస్తుల విధ్వంసం చేస్తూ వైస్సార్సీపీ నాయకులు లక్ష్యంగా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.ఏకంగా ప్రొక్లెయిన్లతోనే ఇళ్లపై దాడులు చేస్తున్న కొలకపూడి, చివరకు మీడియానూ వదలడం లేదని చెప్పారు. కూటమి 100 రోజుల పాలనపై, తమది మంచి ప్రభుత్వం అంటూ.. తిరువూరులో ఇంటింటా స్టిక్కర్లు వేస్తున్నారన్న స్వామిదాస్.. అసలు ఇన్ని రోజుల్లో ఏ మంచి చేశారో చెప్పాలని, సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని నిలదీసిన స్వామిదాస్.. ధైర్యం ఉంటే చెప్పాలన్నారు. తిరువూరు నియోజకవర్గ చరిత్రలో కొలికపూడి శ్రీనివాసరావు లాంటి ఎమ్మెల్యే ఎవరూ లేరని... దాడులు, దౌర్జన్యాలు మితిమీరాయని, మీడియానూ బెదిరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘బట్టలూడదీసి ఇంటికొచ్చి కొడతాను’ అంటూ మీడియా ప్రతినిధులను బెదిరిస్తున్నాడని మండిపడ్డారు. ఇకనైనా ఎమ్మెల్యే తన భాష మార్చుకోవాలని, ఇలాంటి సంస్కృతి మంచిది కాదని హితవు చెప్పారు. అలాగే అధికారులు కూడా ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తే, వారు భవిష్యత్తులో ఇబ్బందుల్లో పడతారన్న స్వామిదాస్.. చట్టవిరుద్దంగా వ్యవహరించే వారికి వత్తాసు పలకొద్దన్నారు. ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని కొలికపూడికి స్వామిదాస్ వార్నింగ్ ఇచ్చారు.ఇదీ చదవండి: 4 జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం -
టీడీపీపై స్వామి దాస్ ఫైర్
-
బెదిరిస్తే ఎవరు భయపడరు
-
కొలికపూడికి నల్లగట్ల స్వామి దాస్ వార్నింగ్
-
కొలికపూడి తీరు మార్చుకో.. వైఎస్సార్సీపీ నేత స్వామిదాస్ వార్నింగ్
సాక్షి, ఎన్డీఆర్ జిల్లా: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓవరాక్షన్‌పై తిరువూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి నల్లగట్ల స్వామిదాస్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో కొలికపూడి చర్యలు సిగ్గుపడేలా ఉన్నాయని.. తనను తాను ఓ హీరో అనుకుంటున్నాడంటూ ధ్వజమెత్తారు.కొలికపూడి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని జేసీబీతో భవన నిర్మాణాన్ని కూల్చారు. కొత్త సంస్కృతికి తెరతీశారు. గతంలో తిరువూరులో కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటి సంస్కృతి లేదు. ఎమ్మెల్యే చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కంభంపాడులోని ఎంపీపీకి చెందిన భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయి. నిబంధనలకు అనుగుణంగానే భవనం నిర్మాణం జరిగింది’’ అని స్వామిదాస్ చెప్పారు.‘‘న్యాయపరంగా మేం పోరాడతాం. గడచిన 30 ఏళ్లలో తిరువూరులో ఎన్నడూ ఇలాంటి ఘటన చూడలేదు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లుంది కొలికపూడి తీరు.. ఆయన పద్ధతి మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో నిలబెడతాం’’ అని స్వామిదాస్ హెచ్చరించారు. -
మంచి చేసిన జగన్ నే గెలిపించండి ఇంటింటి ప్రచారం
-
కొలికపూడి శ్రీనివాస్ కి స్వామి దాస్ స్ట్రాంగ్ కౌంటర్
-
‘చంద్రబాబు మమ్మల్ని ఇంట్లోకి కూడా రానివ్వలేదు’
గుంటూరు, సాక్షి: చంద్రబాబులో మానవత్వం మచ్చుకైనా లేదని.. ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరని తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. గురువారం సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ పార్టీలో చేరిన ఆయన సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘అవసరం లేకపోతే చంద్రబాబు ఎవర్నీ పట్టించుకోరు. ఆయన ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరు. దాదాపుగా 30 ఏళ్లుగా టీడీపీలో పని చేసినా కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. భార్యాభర్తలం పది రోజులపాటు చంద్రబాబు ఇంటి ముందు ఎదురుచూసినా ఫలితం లేదు. టీడీపీ నేతలే మాకు వెన్నుపోటు పొడిచారు.. .. మాతో మంచిగా ఉంటూనే తిరువూరులో వెన్నుపోటుతో ఓడించారు. మా దళితులకు సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలు అద్భుతం. అవి నచ్చి ఆయన సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాం. సీఎం జగన్ ఏం చెప్తే అది చేయటానికి మేము సిద్ధం’’ అని స్వామిదాస్ తెలిపారు. సంబంధిత వార్త: టీడీపీకి భారీ షాక్.. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి స్వామిదాస్ -
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన స్వామిదాస్
గుంటూరు, సాక్షి: ఎన్టీఆర్ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి పెద్ద దెబ్బ పడింది. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ టీడీపీని వీడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారాయన. గురువారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో స్వామిదాస్‌కు కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. స్వామిదాస్‌తో పాటు ఆయన సతీమణి సుధారాణి కూడా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వామిదాస్ 1994, 1999 లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ఖాళీ కావడం ఖాయమంటూ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. -
మంత్రి గారూ.. మా దప్పిక తీర్చండి
తుమ్మలకు ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరువాసుల వినతి దమ్మపేట: నాగార్జునసాగర్ ఎడమకాల్వ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా తిరువూరు ప్రాంతానికి నీటిని విడుదల చేసేలా చూడాలని ఆ ప్రాంతవాసులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో మంత్రి తుమ్మలను గురువారం తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో పలువురు నేతలు కలిశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువులు, కుంటలు అడుగంటి పోయాయని, పశువులకు సైతం తాగటానికి నీరులేదని వారు తుమ్మల ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. సాగర్ జలాలను విడుదల చేసి తమ దప్పిక తీర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. ఎన్ఎస్పీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో తిరుపూరు ఎన్ఎస్పీ ప్రాజెక్ట్ చైర్మన్ వై.పుల్లయ్యచౌదరి, డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు సుంకర కృష్ణమోహనరావు, సీతారాంప్రసాద్, ఆళ్ల గోపాలకృష్ణ ఉన్నారు.