
సాక్షి, ఎన్డీఆర్ జిల్లా: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓవరాక్షన్‌పై తిరువూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి నల్లగట్ల స్వామిదాస్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో కొలికపూడి చర్యలు సిగ్గుపడేలా ఉన్నాయని.. తనను తాను ఓ హీరో అనుకుంటున్నాడంటూ ధ్వజమెత్తారు.
కొలికపూడి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని జేసీబీతో భవన నిర్మాణాన్ని కూల్చారు. కొత్త సంస్కృతికి తెరతీశారు. గతంలో తిరువూరులో కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటి సంస్కృతి లేదు. ఎమ్మెల్యే చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కంభంపాడులోని ఎంపీపీకి చెందిన భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయి. నిబంధనలకు అనుగుణంగానే భవనం నిర్మాణం జరిగింది’’ అని స్వామిదాస్ చెప్పారు.
‘‘న్యాయపరంగా మేం పోరాడతాం. గడచిన 30 ఏళ్లలో తిరువూరులో ఎన్నడూ ఇలాంటి ఘటన చూడలేదు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లుంది కొలికపూడి తీరు.. ఆయన పద్ధతి మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో నిలబెడతాం’’ అని స్వామిదాస్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment