tiruvur
-
కొలికిపూడితో విసిగిపోయాం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/తిరువూరు: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వైఖరితో విసిగిపోయామని, ఆయనతో కలిసి పనిచేయలేమని టీడీపీ సీనియర్లు తేలి్చచెప్పారు. తిరువూరు నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం తిరువూరులో జరిగింది. అధిక శాతం నాయకులు సమావేశాన్ని బహిష్కరించడంతో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కంగుతిన్నారు.ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్న నాయకులతో లక్ష్మీపురం మనో గార్డెన్స్‌లో సమావేశం ఏర్పాటు చేసి బుజ్జగించేందుకు ప్రయత్నించగా.. నాయకులెవరూ వెనక్కి తగ్గలేదు. పార్టీ శ్రేణులతో సమన్వయ లేమి, నాయకులను సైతం దూషించే ఎమ్మెల్యేతో పనిచేసేది లేదని తెగేసి చెప్పారు. టీడీపీ నేతలపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టించడం, వేధింపులకు గురిచేయడంతో తాము అభద్రతా భావానికి లోనవుతున్నామని, ఎన్నికల్లో కష్టపడి గెలిపించిన తమకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం కాగా.. తిరువూరు టీడీపీ నేతలను సమన్వయం చేసేందుకు ఐదుగురు సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. ఎంపీ చిన్ని, వర్ల రామయ్య హామీలతో సంతృప్తి చెందని నాయకులు నియోజకవర్గ పార్టీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు. కాగా.. తన భార్యను ఎమ్మెల్యే వేధింపులకు గురిచేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చిట్టేల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు తన అనుచరులతో చిట్టేలలో నిరసనకు దిగారు. ఎమ్మెల్యే వేధింపులతో తన భార్య ఆత్మహత్యాయత్నం చేసి చావుబతుకుల్లో ఉందని, ఈ విషయమై తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వాపోయారు. -
కొలికపూడి తీరు మార్చుకో.. వైఎస్సార్సీపీ నేత స్వామిదాస్ వార్నింగ్
సాక్షి, ఎన్డీఆర్ జిల్లా: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓవరాక్షన్‌పై తిరువూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి నల్లగట్ల స్వామిదాస్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో కొలికపూడి చర్యలు సిగ్గుపడేలా ఉన్నాయని.. తనను తాను ఓ హీరో అనుకుంటున్నాడంటూ ధ్వజమెత్తారు.కొలికపూడి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని జేసీబీతో భవన నిర్మాణాన్ని కూల్చారు. కొత్త సంస్కృతికి తెరతీశారు. గతంలో తిరువూరులో కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటి సంస్కృతి లేదు. ఎమ్మెల్యే చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కంభంపాడులోని ఎంపీపీకి చెందిన భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయి. నిబంధనలకు అనుగుణంగానే భవనం నిర్మాణం జరిగింది’’ అని స్వామిదాస్ చెప్పారు.‘‘న్యాయపరంగా మేం పోరాడతాం. గడచిన 30 ఏళ్లలో తిరువూరులో ఎన్నడూ ఇలాంటి ఘటన చూడలేదు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లుంది కొలికపూడి తీరు.. ఆయన పద్ధతి మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో నిలబెడతాం’’ అని స్వామిదాస్ హెచ్చరించారు. -
ఏపీలో బుల్డోజర్ల సర్కార్ నడుస్తోంది: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో బుల్డోజర్ల ప్రభుత్వం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. ఇచ్చిన హామీల అమలుపై లేని శ్రద్ధ.. ఏ ఇల్లు కూల్చాలి? ఏ కార్యాలయం కూల్చాలనే దానిపై మాత్రమే పెట్టారంటూ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే కొలికపూడి స్థాయికి దిగజారి వ్యవహరించారు. బుల్డోజర్తో ఎమ్మెల్యే వెళ్లి ప్రత్యర్థుల ఇంటిని కూల్చడం ఏంటి? అని ప్రశ్నించారు.‘‘తిరువూరులో కొలికపూడి చెలరేగిపోయారు. చంద్రబాబు తిరువూరు ఎమ్మెల్యే వ్యవహార శైలిపై సమాధానం చెప్పాలి. అధికార మదంతోనే కొలకపూడి వెళ్లి ఎంపీపీ ఇంటిని కూల్చారు. ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో లేకుండా చేస్తున్నారు. కొలికపూడి శ్రీనివాస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారు. మంచి పాలన అందిస్తారని కూటమికి ప్రజలు ఓటేశారు. పెన్షన్ల పంపిణీలో కూడా ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఇచ్చారు. సర్పంచ్‌లు, ఎంపీపీలను కూడా పిలవకుండా పెన్షన్లు ఇచ్చారు’’ అంటూ కైలే అనిల్ కుమార్ నిప్పులు చెరిగారు.టీడీపీ డైరెక్షన్లో అరాచకాలు: నందిగం సురేష్మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చాక దారుణాలు జరుగుతున్నాయని.. టీడీపీ డైరెక్షన్లో అరాచకాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనన్ని దారుణాలు ఏపీలో జరుగుతున్నాయి. ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవటానికే తాము అధికారంలోకి వచ్చినట్టుగా పరిస్థితి ఉంది.. వైఎస్సార్సీపీ కంటే మంచి పాలన ఇస్తామని అందరినీ నమ్మించారు. నిజమేనేమో అని ఓట్లేస్తే జరుగుతున్నది దారుణంగా ఉంది. కళ్లకు గంతలు కట్టుకున్నట్టుగా ప్రభుత్వం ఉంది’’ అంటూ మండిపడ్డారు.‘‘తిరువూరులో ఎమ్మెల్యే చేసిన అరాచకాన్ని ఏం అనాలి?. వైఎస్సార్సీపీ నేత అక్రమంగా బిల్డింగ్ కడితే అధికారులు చర్యలు తీసుకుంటారు.. కానీ ఎమ్మెల్యే కొలకపూడి బుల్డోజర్ తీసుకుని బిల్డింగ్‌లను పడేయటం ఏంటి?. పెన్షన్ల పంపిణీలో కూడా లంచాలు తీసుకున్నారు. ఇవన్నీ జనం చూస్తూనే ఉన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు ఎప్పుడూ జరగలేదు. వైఎస్సార్సీపీ వారి అంతు చూస్తామంటూ టీడీపీ నేతలు మాట్లాడుతున్న తీరు దారుణంగా ఉంది’’ అని సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఒక మంత్రి భార్య సైతం పోలీసులను బెదిరించారు. వైఎస్ జగన్ పాలనలో ఇలాంటివి ఎప్పుడైనా జరిగిందా?. తిరువూరులో పోలీసులు అడ్డుకుంటున్నా వారిని పక్కకు నెట్టేశారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా చేయొచ్చనుకుంటున్నారు. అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. ఈలోపే జనానికి కూటమి ప్రభుత్వం మీద చిరాకు వచ్చింది. రౌడీరాజ్యంలాగ కాకుండా ప్రజా పాలన చేయాలని కోరుకుంటున్నాం. లేకపోతే ప్రజలే తగిన బుద్ది చెప్తారు’’ అంటూ నందిగం సురేష్ హెచ్చరించారు. -
పరీక్ష హాలులో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
విజయవాడ : ఓ విద్యార్థి ఎగ్జామ్హాల్లో ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా తిరువూరులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన అనంతసాయి తిరువూరులో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వోకేషనల్ కోర్సు మొదటి ఏడాది చదువుతున్నాడు. అయితే గురువారం వార్షిక పరీక్షలుకు హాజరైన అనంతసాయి పరీక్షహాలులోనే పురుగుల మందు తాగాడు. అప్రమత్తమైన అధికారులు విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆత్మహత్యాయత్యానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. (తిరువూరు) -
మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి
కృష్ణా: కృష్ణా జిల్లా తిరువూరు మండలంలో ఓ మానసిక వికలాంగురాలిపై వావి వరుసలు మరిచిన కామాంధుడొకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని వావిలాల గ్రామంలో జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతి మానసిక వికలాంగురాలు. ఆమె మంగళవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వరుసకు బాబాయి అయిన హుస్సేన్ అనే వ్యక్తి లైంగికదాడికి ఒడిగట్టాడు. భాదితురాలు తల్లిదండ్రులకు చెప్పటంతో వారు బుధవారం ఉదయ తిరువూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. (తిరువూరు)