కొలికపూడి పద్ధతి మార్చుకో.. స్వామిదాస్‌ వార్నింగ్‌ | Ysrcp Leader Swamidas Warning To Mla Kolikapudi Srinivasa Rao | Sakshi
Sakshi News home page

కొలికపూడి పద్ధతి మార్చుకో.. స్వామిదాస్‌ వార్నింగ్‌

Published Thu, Sep 26 2024 7:18 PM | Last Updated on Thu, Sep 26 2024 7:51 PM

Ysrcp Leader Swamidas Warning To Mla Kolikapudi Srinivasa Rao

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు రాక్షసంగా వ్యవహరిస్తున్నారని తిరువూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ నల్లగట్ల స్వామిదాస్‌ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, యథేచ్ఛగా దాడులు, ఆస్తుల విధ్వంసం చేస్తూ వైస్సార్‌సీపీ నాయకులు లక్ష్యంగా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఏకంగా ప్రొక్లెయిన్లతోనే ఇళ్లపై దాడులు చేస్తున్న కొలకపూడి, చివరకు మీడియానూ వదలడం లేదని చెప్పారు. కూటమి 100 రోజుల పాలనపై, తమది మంచి ప్రభుత్వం అంటూ.. తిరువూరులో ఇంటింటా స్టిక్కర్లు వేస్తున్నారన్న స్వామిదాస్.. అసలు ఇన్ని రోజుల్లో ఏ మంచి చేశారో చెప్పాలని, సూపర్‌ సిక్స్‌ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని నిలదీసిన స్వామిదాస్‌..  ధైర్యం ఉంటే చెప్పాలన్నారు. తిరువూరు నియోజకవర్గ చరిత్రలో కొలికపూడి శ్రీనివాసరావు లాంటి ఎమ్మెల్యే ఎవరూ లేరని... దాడులు, దౌర్జన్యాలు మితిమీరాయని, మీడియానూ బెదిరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘బట్టలూడదీసి ఇంటికొచ్చి కొడతాను’ అంటూ మీడియా ప్రతినిధులను బెదిరిస్తున్నాడని మండిపడ్డారు. ఇకనైనా ఎమ్మెల్యే తన భాష మార్చుకోవాలని, ఇలాంటి సంస్కృతి మంచిది కాదని హితవు చెప్పారు. అలాగే అధికారులు కూడా ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తే, వారు భవిష్యత్తులో ఇబ్బందుల్లో పడతారన్న స్వామిదాస్.. చట్టవిరుద్దంగా వ్యవహరించే వారికి వత్తాసు పలకొద్దన్నారు. ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని కొలికపూడికి స్వామిదాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

ఇదీ చదవండి: 4 జిల్లాలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుల నియామకం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement