‘చంద్రబాబు మమ్మల్ని ఇంట్లోకి కూడా రానివ్వలేదు’ | Nallagatla Swamy Das Comments On Chandrababu After Join YSRCP | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు మమ్మల్ని ఇంట్లోకి కూడా రానివ్వలేదు’

Published Thu, Jan 11 2024 7:48 PM | Last Updated on Sun, Feb 4 2024 12:31 PM

Nallagatla Swamy Das Comments On Chandrababu After Join YSRCP - Sakshi

గుంటూరు, సాక్షి: చంద్రబాబులో మానవత్వం మచ్చుకైనా లేదని.. ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరని తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌ అన్నారు. గురువారం సాయంత్రం సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరిన ఆయన సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. 

‘‘అవసరం లేకపోతే చంద్రబాబు ఎవర్నీ పట్టించుకోరు. ఆయన ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరు. దాదాపుగా 30 ఏళ్లుగా టీడీపీలో పని చేసినా కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. భార్యాభర్తలం పది రోజులపాటు చంద్రబాబు ఇంటి ముందు ఎదురుచూసినా ఫలితం లేదు. టీడీపీ నేతలే మాకు వెన్నుపోటు పొడిచారు.. 

.. మాతో మంచిగా ఉంటూనే తిరువూరులో వెన్నుపోటుతో ఓడించారు. మా దళితులకు సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలు అద్భుతం. అవి నచ్చి ఆయన సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాం. సీఎం జగన్ ఏం చెప్తే అది చేయటానికి మేము సిద్ధం’’ అని స్వామిదాస్‌ తెలిపారు.

సంబంధిత వార్త: టీడీపీకి భారీ షాక్‌.. సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి స్వామిదాస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement