మంత్రి గారూ.. మా దప్పిక తీర్చండి | Manthry garu ma dhappika teerchandi | Sakshi
Sakshi News home page

మంత్రి గారూ.. మా దప్పిక తీర్చండి

Published Fri, Dec 11 2015 4:45 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

మంత్రి గారూ.. మా దప్పిక తీర్చండి

మంత్రి గారూ.. మా దప్పిక తీర్చండి

తుమ్మలకు ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరువాసుల వినతి

 దమ్మపేట: నాగార్జునసాగర్ ఎడమకాల్వ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా తిరువూరు ప్రాంతానికి నీటిని విడుదల చేసేలా చూడాలని ఆ ప్రాంతవాసులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా  దమ్మపేట మండలం గండుగులపల్లిలో మంత్రి తుమ్మలను గురువారం తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో పలువురు నేతలు కలిశారు.  వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువులు, కుంటలు అడుగంటి పోయాయని, పశువులకు సైతం తాగటానికి నీరులేదని వారు తుమ్మల ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు.

సాగర్ జలాలను విడుదల చేసి తమ దప్పిక తీర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. ఎన్‌ఎస్‌పీ అధికారులతో మాట్లాడి  సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో తిరుపూరు ఎన్‌ఎస్‌పీ ప్రాజెక్ట్ చైర్మన్ వై.పుల్లయ్యచౌదరి, డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు సుంకర కృష్ణమోహనరావు, సీతారాంప్రసాద్, ఆళ్ల గోపాలకృష్ణ ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement