కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ తన పుట్టిన రోజును వేదికగా చేసుకుని నియోజకవర్గవ్యాప్తంగా గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫ్లెక్సీల్లో జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నట్లు వ్యక్తుల పేర్లు కాకుండా గ్రామ టీడీపీ అని పేర్కొనడం వివాదానికి కారణమైంది. నియోజకవర్గ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న పెండ్యాల అచి్చబాబు స్వగ్రామమైన దొమ్మేరులో ఆయన ఫొటో లేకుండా ఈ తరహా ఫ్లెక్సీల ఏర్పాటును ఆ పార్టీ స్థానిక నాయకులు తప్పుబట్టారు.
ఈ నేపథ్యంలో అచ్చిబాబు వర్గీయులు శుక్రవారం గ్రామంలో సమావేశమై మరీ జవహర్‌పై బహిరంగ విమర్శలకు దిగారు. గ్రామ కమిటీ, స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా ‘దొమ్మేరు టీడీపీ’ అని పేర్కొంటూ తమ గ్రామంలో ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారని, ఇది జవహర్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. పార్టీని రెండు గ్రూపులుగా చేసేందుకు ఆయన ప్రయతి్నస్తున్నారని సీనియర్ నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు యలమర్తి శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు)మండిపడ్డారు. దొమ్మేరు గ్రామ కమిటీని సంప్రదించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అచి్చబాబు చెప్పినట్లే నడుస్తాం తప్ప, జవహర్ చెప్పినట్లు కాదని స్పష్టం చేశారు.
సీనియర్ నాయకుడు కేవీకే రంగారావు, ఉప సర్పంచ్ కలగర సుబ్బారావు, టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొక్కిరిపాటి శ్రీహరి కూడా జవహర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పారీ్టకి, ఆ ఫ్లెక్సీలకు ఎటువంటి సంబంధమూ లేదని ప్రకటించారు. గతంలో అచ్చిబాబు చెబితేనే జవహర్‌కు 13 రోజుల ముందు టికెట్ ఇచ్చినా ఎమ్మెల్యేగా గెలిపించామని అన్నారు. దొమ్మేరులో జవహర్‌కు మద్దతుదారులు లేరని ప్రకటించారు. అందువల్లే సొంతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారన్నారని అన్నారు. కొవ్వూరులో శుక్రవారం జరిగిన జవహర్ పుట్టిన రోజు వేడుకలకు సైతం అచి్చబాబు వర్గీయులు దూరంగానే ఉన్నారు. ఇటీవల అభ్యర్థుల ఖరారులో భాగంగా అధిష్టానం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో కూడా జవహర్ పేరు ప్రస్తావించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజా వివాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఎనిమిదేళ్లుగా..: జవహర్, అచ్చిబాబు వర్గాల మధ్య ఏడెనిమిదేళ్లుగా వివాదం నడుస్తోంది. దీంతో నియోజకవర్గంలో టీడీపీ రెండు గ్రూపులుగా పనిచేస్తోంది. గతంలో అచి్చబాబు వర్గం వ్యతిరేకించినందునే జవహర్‌ను అధిష్టానం కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి పంపింది. అక్కడ ఓటమి చవిచూసిన ఆయన మళ్లీ కొవ్వూరుపై దృష్టి సారించారు. పేరుకు జిల్లా అధ్యక్షుడి పదవి కట్టబెట్టినప్పటికీ కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అధిష్టానం షరతు విధించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment