
సాక్షి, కృష్ణా: రాజకీయాల్లో టీడీపీ నేత కొల్లురవీంద్ర వంటి దిగజారుడు మనిషిని ఇంకొకరిని చూడలేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బురదజల్లి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలని కొల్లు రవీంద్ర చూస్తున్నారని, ఇది ఆయన దిగజారుడు తననానికి నిదర్శనమని నాని మండిపడ్డారు.
‘‘గుమ్మటాల చెరువులో డబ్బులు తీసుకుని ఇళ్లు అమ్మిందెవరు?. పేదల దగ్గర వేల రూపాయలు వసూలు చేసిందెవరు?. సంపత్ అనే మున్సిపల్ కమీషనర్‌ను బూతులు తిట్టి అవమానించి పంపిందెవరు? మీరు కాదా? అని కొల్లు రవీంద్రను పేర్ని నాని ప్రశ్నించారు.
పేర్ని నాని ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు.. చేయడు కూడా. రాజుపేట కరెంట్ సబ్ స్టేషన్ వెనుక పేదల పాకలు తొలగిస్తుంటే పోరాడిన వ్యక్తిని నేనే. పేదవాళ్లకు అండగా ఉండే వ్యక్తి పేర్నినాని అయితే.. తప్పుడు పనులు చేసే వ్యక్తి కొల్లు రవీంద్ర. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా కుమ్మరిగూడెం ప్రజలకు తాను అండగా నిలబడతా అని పేర్ని నాని ప్రకటించారు. చాలా మంది టీడీపీ నేతలు, ప్రత్యర్ధులతో తాను రాజకీయాల్లో పోటీ పడి నెగ్గిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment