Platinum disc celebration
-
స్వచ్ఛమైన ప్రేమ
సాంబ, యోధ, కిరణ్, పావని ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘లావణ్య విత్ లవ్‌బాయ్స్’. వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రాజ్యలక్ష్మి, సి. నర్సింలు పటేల్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. సినిమా ట్రైలర్, ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎస్. రాములు ట్రైలర్ విడుదల చేశారు. వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ– ‘‘అమ్మాయి బాహ్య సౌందర్యాన్ని చూసి కాదు అంతరంగాన్ని తెలుసుకొని ప్రేమించాలి. స్వచ్ఛమైన ప్రేమకు ఎప్పుడూ ఓటమిలేదనేది చిత్రకథ. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: శరత్ చెట్టి. -
బెంగాల్ టైగర్ ప్లాటినమ్ డిస్క్ వేడుక
-
ఈ సినిమానే ఓ పండగ!
- సంపత్ నంది ‘‘డిసెంబరు 25న క్రిస్మస్.. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి రాబోతోంది. అంతకన్నా ముందే డిసెంబరు 10న ‘బెంగాల్ టైగర్’ పండగ రాబోతోంది. బాక్సాఫీస్‌ను కచ్చితంగా షేక్ చేస్తుంది. ఎవరినీ డిజప్పాయింట్ చేయదు’’ అని దర్శకుడు సంపత్ నంది అన్నారు. రవితేజ, తమన్నా, రాశీఖన్నా నాయకానాయికలుగా సంపత్ నంది దర్శకత్వంలో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘బెంగాల్ టైగర్’. భీమ్స్ స్వరాలందించిన ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ- ‘‘పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అతనికి కంగ్రాట్స్. మేం మాట్లాడటం కన్నా డిసెంబరు 10న మా సినిమా మాట్లాడుతుంది’’ అన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ- ‘‘ఈ పాటలను హిట్ చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. ఆడియో చార్ట్స్‌లో టాప్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాయి. త్వరలో ఫస్ట్ ప్లేస్‌కు వస్తాయి. ‘చూపులతో దీపాల పాట...’ అందరికీ బాగా నచ్చేసింది’’ అని అన్నారు. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ -‘‘అప్పట్లో చిన్న రచయితనైనా ‘దుబాయ్ శీను’లో రవితేజ నాకు ఐదు పాటలు రాసే అవకాశమిచ్చారు. నే నీ సినిమాలో టైటిల్ సాంగ్ రాశాను. రవితేజ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తారు. భీమ్స్కు మంచి భవిష్యత్తు ఉంది’’ అని చెప్పారు. భాస్కరభట్ల మాట్లాడుతూ- ‘‘నా కెరీర్లో అత్యధికంగా రవితేజ సినిమాలకే రాశాను. ఆయన నటించినవాటిలో దాదాపు 28 సినిమాలకు రాశాను. రవితేజకు టీజింగ్ సాంగ్స్ రాయడమంటే నాకు చాలా ఇష్టం’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా ఓ లాంగ్ జర్నీ. సంపత్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. దర్శకుడిగా అతని తొలి సినిమా నేనే చేశాను. సంపత్ మంచి సినిమా ఇచ్చారు. కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుంది’’ అని నిర్మాత రాధామోహన్ అన్నారు. ‘‘నాకు మంచి అవకామిచ్చిన సంపత్ నందిగారికి చాలా థ్యాంక్స్. నా పుట్టినరోజున ఈ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరగడం చాలా ఆనందంగా ఉంది’’ అని రాశీ ఖన్నా అన్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తమన్నా చెప్పారు. ఈ సినిమా పాటల కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేతలకు రవితేజ, తమన్నా, రాశీఖన్నా, నిర్మాత రాధామోహన్ బహుమతులు అందజేశారు. -
'అఖిల్' ప్లాటినం డిస్క్ వేడుక
-
ఆ క్రమశిక్షణ సతీశ్‌లో కనిపించింది : మోహన్‌బాబు
‘‘ఏ సినిమాకైనా దర్శకుడే కెప్టెన్. కథ ఎలా ఉన్నా... దాన్ని తెరపై అందంగా ఆవిష్కరించేది దర్శకుడే. అలాంటి దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. ఆయన దర్శకునిగా మారి దాదాపు పాతికేళ్లు అయ్యింది. 40 ఏళ్లుగా నేను ఈ రంగంలో ఉన్నా... ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం నాకు ఇప్పుడు కలిగింది’’ అని మోహన్‌బాబు అన్నారు. కె.సతీశ్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె.ఆశా సతీశ్ నిర్మించిన చిత్రం ‘యమలీల-2’. మోహన్‌బాబు ఇందులో యమునిగా నటించిన విషయం తెలిసిందే. ఎస్వీ కృష్ణారెడ్డి స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడారు. ‘‘ఇంత క్రమశిక్షణగా మేం నడుచుకుంటున్నామంటే కారణం ఎన్టీఆర్, ఏఎన్నార్, దాసరిగార్లు నేర్పిన క్రమశిక్షణే. ఈ చిత్ర కథానాయకుడు సతీశ్‌లో కూడా అదే క్రమశిక్షణ కనిపింది. ఇందులో నేను పోషించిన యముడి పాత్ర నాకు ప్రత్యేకం’’ అని మోహన్‌బాబు తెలిపారు. ఆడియోలాగే సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించాలని హీరో కె.సతీశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ- ‘‘సతీశ్ కోసమే ఈ స్క్రిప్ట్ తయారు చేశాను. అభినయంతో పాటు డాన్సులు, ఫైట్లు అద్భుతంగా చేశాడు. యముడిగా మోహన్‌బాబు, చిత్రగుప్తునిగా బ్రహ్మానందం పాత్రలు ఈ చిత్రానికి హైలైట్’’ అని నమ్మకం వెలిబుచ్చారు. నటునిగా మోహన్‌బాబు 40వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభతరుణంలో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉందని కె.అచ్చిరెడ్డి అన్నారు. ‘యమలీల’ టైమ్‌కి తాను ఓ ప్రేక్షకుణ్ణి మాత్రమేననీ, ‘యమలీల-2’కి వచ్చే సరికి పంపిణీదారుని స్థాయిలో జ్ఞాపిక అందుకోవడం ఆనందంగా ఉందనీ ‘దిల్’ రాజు సంతోషం వెలిబుచ్చారు. ఈ వేడుకలో భాగంగా అప్పటి ‘యమలీల’ కథానాయకుడు అలీని ఈ ‘యమలీల-2’ యూనిట్ ఘనంగా సత్కరించింది. -
అందుకే మా జిల్లాలో నేనే పంపిణీ చేస్తున్నా
‘‘భవ్య క్రియేషన్స్ సంస్థలో నేను చేసిన ‘వాంటెడ్’ ఆశించిన ఫలితం సాధించలేదు. అందుకే, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి మళ్లీ ఆ సంస్థలో సినిమా చేద్దామనగానే.. ఈసారి నిర్మాతగా ఆనందప్రసాద్‌గారు సంతృప్తిపడే సినిమా ఇవ్వాలనుకున్నాను. చాలా కథలు విన్న తర్వాత శ్రీధర్ సీపాన చెప్పిన కథ బాగా నచ్చి, అంగీకరించాను. ఈ కథకు దర్శకుడిగా శ్రీవాస్ అయితే బాగుంటుందనుకున్నాం. ఆ తర్వాత కోన వెంకట్, గోపీ మోహన్‌లను పిలిపించి స్క్రీప్‌ప్లే తయారు చేయించాం. ఇందులో నాది చాలా మంచి పాత్ర’’ అని గోపీచంద్ చెప్పారు. శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై గోపీచంద్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా వి. ఆనందప్రసాద్ నిర్మించిన ‘లౌక్యం’ నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ చిత్రం పాటలు విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. ఈ వేడుకలో శ్రీవాస్ మాట్లాడుతూ -‘‘ ‘లౌక్యం’ కథ వినగానే హిట్ అనే నమ్మకం కలిగి చేశాం. గోపీచంద్‌తో మంచి కుటుంబ కథా చిత్రం తీయాలనే ఆశయంతో చేసిన సినిమా ఇది. ఆయన మార్క్ యాక్షన్ కూడా ఉంటుంది. నేనీ చిత్రాన్ని తూర్పు గోదావరి జిల్లాలో పంపిణీ చేయబోతున్నాను’’ అన్నారు. గోపీచంద్‌తో తనకిది తొలి చిత్రమని, ఆయన కెరీర్లో ‘ది బెస్ట్’ సినిమా ఇదని, ఈ చిత్రం మీద నమ్మకంతో గుంటూరులో విడుదల చేస్తున్నానని రచయిన కోన వెంకట్ చెప్పారు. గోపీచంద్‌తో చేసిన ఈ చిత్రం బ్రహ్మాండమైన విజయం సాధించడం ఖాయమని ఆనందప్రసాద్ అన్నారు. బ్రహ్మానందం, అన్నే రవి, అనూప్ రూబెన్స్, శ్రీధర్ సీపాన, రఘు, వెట్రి, పృథ్వీ, అనంత శ్రీరామ్ పాల్గొన్నారు.