
వేముల వాడలో దొంగ అరెస్ట్
భక్తుల ఆభరణాలు చోరీ చేస్తున్న ఆకుల సాంబ(24) అనే దొంగను వేములవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సాంబ నుంచి పదిన్నర తులాల బంగారం, 800 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను వేములవాడ డీఎస్పీ అభినందించారు.