భార్యను చంపేసిన భర్త | Husband kills wife in Hyderabad | Sakshi
Sakshi News home page

భార్యను చంపేసిన భర్త

Nov 12 2015 4:15 PM | Updated on Sep 4 2018 5:07 PM

సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రాంతంలోని తుకారాంగేట్ వద్ద ఉండే శ్రీనివాస్ తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడు.

క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోపంలో విచక్షణ కోల్పోయిన ఓ భర్త.. కట్టుకున్న భార్యనే చంపేశాడు. వివరాలు.. సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రాంతంలోని తుకారాంగేట్ వద్ద ఉండే శ్రీనివాస్, సాంబ దంపతులు గురువారం సాయంత్రం గొడవపడ్డారు. తీవ్ర కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ భార్యను కత్తితో నరికి చంపాడు. అనంతరం ఘటనస్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా.. భార్యా, భర్తల మధ్య గొడవకు కారణాలు తెలియ రాలేదు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement