ఉల్లిపాయ పకోడి బోర్ కొడితే ఈ వర్షాకాలంలో కార్న్ పాలక్ పకోడి రెసిపీ ట్రై చేయండి.
కావలసినవి:
►పాలకూర – కప్పు
►స్వీట్ కార్న్ గింజలు – కప్పు
►శనగపిండి – రెండు కప్పులు
►కారం – మూడు టీస్పూన్లు
►అల్లం తరుగు – రెండు టీస్పూన్లు
►జీలకర్ర పొడి – నాలుగు టీస్పూన్లు
►ఉప్పు – రుచికి సరిపడా
►నూనె – డీప్‌ఫ్రైకి తగినంత.
తయారీ:
►ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి గిన్నెలో వేయాలి.
►పాలకూర వేసిన గిన్నెలో నూనె తప్పించి మిగతా పదార్థాలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లుపోసి పకోడి పిండిలా కలుపుకోవాలి.
►నూనె వేడెక్కిన తరువాత కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు వేయించి తీసేయాలి.
►వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈ పకోడీలు చాలా రుచిగా ఉంటాయి.
ఇవి కూడా ట్రై చేయండి: Idiyappam Pulihora Recipe: బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి.. ఇడియప్పం పులిహోర
Capsicum Rings Recipe: రుచికరమైన క్యాప్సికమ్ రింగ్స్ తయారీ ఇలా!
Comments
Please login to add a commentAdd a comment