రైస్ పకోడా ఎలా చేయాలంటే..
కావల్సిన పదార్థాలు:
అన్నం – 1 కప్పు,ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి – పావు కప్పు చొప్పున
కారం – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్ , కొత్తిమీర తురుము – 2 టీ స్పూన్లు,
ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా
తయారీ విధానమిలా:
ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో అన్నం వేసుకుని.. మెత్తగా పప్పు రుబ్బు కర్రతో ఒత్తుకుకోవాలి. అనంతరం దానిలో శనగపిండి, కారం, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పు.. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. అనంతరం కాగే నూనెలో.. పకోడీల్లా దోరగా వేయించుకుని.. సర్వ్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment