కోకోనట్ – కార్న్ ఇడ్లీలు తయారీకి కావల్సినవి:
మొక్కజొన్న నూక – 2 కప్పులు,కొబ్బరి పాలు – 1 కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు – 1 టేబుల్ స్పూన్, శనగపప్పు – 1 టీ స్పూన్
చాయ పప్పు – 1 టీ స్పూన్,వేరుశనగలు – పావు కప్పు
అల్లం తురుము – 2 టీ స్పూన్లు,పచ్చిమిర్చి –2 (చిన్నగా తరగాలి)
ఉప్పు – తగినంత,బేకింగ్ సోడా – 1 టీ స్పూన్, నెయ్యి – కొద్దిగా
తయారీ విధానమిలా:
ముందుగా నూనె వేడి చేసుకుని అందులో వేరుశనగలు, శనగపప్పు, చాయ పప్పు, ఆవాలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని చిన్న మంట మీద వేయించుకోవాలి. అందులో మొక్కజొన్న నూక వేసుకుని నిమిషం పాటు గరిటెతో అటూ ఇటూ తిప్పుతూ వేయించుకోవాలి.
ఆ తర్వాత కొబ్బరిపాలు, బేకింగ్ సోడా కలుపుకుని ఇడ్లీ పిండిలా చేసుకోవాలి. అనంతరం ఇడ్లీ రేకుకు నెయ్యి రాసుకుని.. కొద్దికొద్దిగా మిశ్రమం వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇవి బలానికి బలాన్నీ, రుచికి రుచినీ అందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment