వరంగల్ మార్కెట్‌లో రికార్డు క్వింటాకు రూ.1555
వరంగల్ సిటీ: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో మక్కలకు (మొక్కజొన్న) రికార్డు ధర పలికింది. మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్వింటా మక్కలకు రూ.1,555 ధర పలకడం విశేషం. మక్కలకు ప్రభుత్వం గత ఏడాది రూ.1,315, ఈసారి రూ.1,325 మద్దతు ధరగా ప్రకటించింది. ఈ ధరతో కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్‌ను సైతం రంగంలోకి దింపారు.
అరుుతే, వరంగల్ మార్కెట్‌లో మాత్రం మద్దతు ధరకు మించి మంగళవారం క్వింటా మక్కలను ప్రైవేట్ వ్యాపారులు రూ.1,555 ధరతో కొనుగోలు చేశారు. దీంతో రైతులు మార్క్‌ఫెడ్‌కు కాకుండా వ్యాపారులకు అమ్మేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి మార్కెట్‌కు మక్కలు వస్తుండగా, మంగళవారం వరకు 38,328 క్వింటాళ్ల మక్కలు అమ్మకానికి వచ్చాయి.
‘మద్దతు’ దాటిన మక్కల ధర
Published Wed, Dec 2 2015 3:22 AM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM
Advertisement
Advertisement