హైదరాబాద్: పౌల్ట్రీ రైతులు లక్ష టన్నుల మొక్కజొన్నను త్వరలో దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నట్లు నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటి(ఎన్‌ఈసీసీ-నెక్) ఒక ప్రకటనలో తెలిపింది. మొక్కజొన్న దిగుమతి వల్ల సమంజసమైన ధరకు రైతులకు మొక్కజొన్న అందుబాటులో వుంటుందని, తద్వారా దేశీయ మార్కెట్లో ధర దిగివస్తుందని పేర్కొంది.
కోళ్ల దాణాలో కీలకమైన మొక్కజొన్న ధరలు గత కొన్నేళ్లుగా బాగా పెరుగుతున్నాయని ఇది పౌల్ట్రీ రైతులపై భారాన్ని మోపుతోందని వివరించింది. లక్ష టన్నుల మొక్కజొన్న దిగుమతి వల్ల సరఫరా, డిమాండ్‌ల మధ్య అంతరం తగ్గి ధరలు దిగిరాగలవని పేర్కొంది.
లక్ష టన్నుల మొక్కజన్న దిగుమతి: నెక్
Published Tue, Dec 15 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM
Advertisement
Advertisement