Poultry farmers
-
'కోళ్ల ఫారాల కాలుష్యానికి' ఇకపై చెక్! ఎలాగో తెలుసా?
కోళ్ల ఫారంలో కోళ్ల విసర్జితాల వల్ల కోళ్ల రైతులు, కార్మికులకే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలకు ఈగలు, దుర్వాసన పెద్ద సమస్యగా ఉంటుంది. కోళ్ల విసర్జితాలను ఆశించే ఈగలు మనుషులకు, కోళ్లకు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. కోళ్ల విసర్జితాల నుంచి విడుదలయ్యే అమ్మోనియా వాయువు వల్ల కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు, రైతులకు కళ్లు మండటం, తలనొప్పి వంటి సమస్యలు రావటంతో పాటు కోళ్లకు సైతం తలనొప్పి, కంటి చూపు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. లేయర్, బ్రీడర్ కోళ్ల ఫారాల కింద పోగుపడే కోళ్ల విసర్జితాల దుర్వాసన, ఈగల నివారణకు రసాయనాలు చల్లినప్పటికీ ఇది తీరని సమస్యగానే మిగిలిపోతోంది. జనావాసాలకు దగ్గరగా ఉండే కోళ్ల ఫారాల దుర్గంధాన్ని, ఈగలను భరించలేని ప్రజలు వాటిని మూయించే పరిస్థితులు కూడా నెలకొంటూ ఉంటాయి. అయితే, ఈ సమస్యలను పర్యావరణహితంగా పరిష్కరించే ఓ మార్గాన్ని సూచిస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడు యడ్లపాటి రమేష్. బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) అనే హానికరం కాని ఈగకు చెందిన పిల్ల పురుగులను కోళ్ల ఫారంలోని విసర్జితాలపై వదిలితే కోళ్ల ఫారాల నుంచి దుర్వాసన సమస్య, విసర్జితాల యాజమాన్య సమస్యలు తీరిపోతాయని రమేష్ తెలిపారు. కోళ్ల వ్యర్థాలను – వర్మి కంపోస్ట్ ప్రక్రియ లాగా మారుస్తూ బిఎస్ఎఫ్ లార్వా (పిల్ల పురుగులు) పెరుగుతాయి. నెలకొకసారి వీటిని కోళ్ల ఫారంలో విసర్జితాలపై వేసుకుంటే చాలు. కోళ్ల ఫారాల నుంచి వ్యర్థాల దుర్వాసన నుంచి 95% పైగా విముక్తి కలిగించడానికి సహజ ప్రక్రియ అయిన బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా ఒక మంచి పరిష్కారమని ఆయన చెబుతున్నారు. గత ఐదారేళ్లుగా బిఎస్ఎఫ్ లార్వా ఉత్పత్తిపై పనిచేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కోళ్ల రైతులకు ఈ లార్వాను అందిస్తూ కాలుష్య నియంత్రణకు, ఆరోగ్య రక్షణకు కషి చేస్తున్నామని ఆయన అన్నారు. లార్వాను కోళ్ల విసర్జితాల (లిట్టర్)పై నెలకోసారి చల్లటం వల్ల ఉపయోగాలు: ► సాధారణ ఈగలు పూర్తిగా తగ్గిపోతాయి. కోళ్ల విసర్జితాలపై ఈగలు అరికట్టేందుకు ఉపయోగించే మందులు, అలాగే ఈగల లార్వాను నిర్మూలించడానికి, ఫీడ్‌లో ఇచ్చే మందులు అసలు అవసరం లేదు. ► దుర్వాసన తగ్గుతుంది, కోళ్ల విసర్జితాల నుంచి వెలువడే అమ్మోనియా తగ్గిపోతుంది. ► కోళ్ల ఫారంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. కళ్ళు మంటలు, సిఆర్డి సమస్య తగ్గుతుంది. ► విసర్జితాలను బిఎస్ఎఫ్ పిల్ల పురుగులు ఎరువుగా మార్చే క్రమంలో, విసర్జితాల్లో తేమ తగ్గిపోయి, దుర్వాసన కూడా తగ్గుతుంది. ► సున్నం, బ్లీచింగ్ అవసరం ఉండదు. వీటి ఖర్చు తగ్గుతుంది. ► విసర్జితాల నిర్వహణకు కూలీలు, స్పేయ్రర్లు, మందుల ఖర్చు ఆదా అవుతుంది. కోళ్ల విసర్జితాలపై ఉండే సాల్మొనెల్లా, ఈ–కొలి వంటి హానికారక సూక్ష్మక్రిములను అరికడతాయి ► ఆర్గానిక్ కంపోస్ట్‌గా మారిన కోళ్ల విసర్జితాలను రైతులు మంచి ధరకు విక్రయించుకోవచ్చు. బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను విసర్జితాలపై చల్లటం అనే సహజ సిద్ధమైన ప్రక్రియ వల్ల.. కోళ్లకు, పనివారికి, చుట్టపక్కల నివసించే ప్రజలకు ఇబ్బందులు తప్పటమే కాకుండా, పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ► చనిపోయిన కోళ్లను, పగిలిపోయిన గుడ్లను త్వరగా కుళ్ళబెట్టడానికి, దుర్వాసన, బాక్టీరియా తగ్గడానికి కూడా బిఎస్ఎఫ్ లార్వా ఉపయోగపడుతుంది. ► కోళ్ల ఫారం పరిసర ప్రాంతాలు ఆరోగ్యకరంగా, కాలుష్యరహితంగా తయారై కోళ్ల ఆరోగ్యం బాగుంటుంది. ► ఉత్పాదకత 1–2 శాతం పెరుగుతుంది. బిఎస్ఎఫ్ గుడ్డు నుంచి ఈగ వరకు జీవితకాలం మొత్తం 45 రోజులు. గుడ్డు నుంచి పిల్లలను ఉత్పత్తి చేయటం అనేది తక్కువ ఉష్ణోగ్రత, అధిక తేమ గల వాతావరణంలో జరగాల్సి ఉంటుంది. మరోన్నో ఉపయోగాలు.. ► 20 రోజుల వయసులో గోధుమ రంగులో ఉండే బిఎస్ఎఫ్ పురుగులు బతికి ఉండగానే లేయర్ కోళ్లకు, బ్రాయిలర్ కోళ్లకు, నాటు కోళ్లకు 10–20% మేరకు సాధారణ మేత తగ్గించి మేపవచ్చు. ► వంటింటి వ్యర్థాలు, ఆహార వ్యర్థాలపై ఈ బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను వేసి పెంచవచ్చు. ► 15 రోజుల తర్వాత ఆ లార్వాను పెంపుడు కుక్కలకు /పిల్లులకు /పక్షులకు మేతగా వేయొచ్చు. బతికి ఉన్న పురుగులు మేపవచ్చు. లేదా ఎండబెట్టి లేదా పొడిగా మార్చి కూడా వాడుకోవచ్చు. 'ఆక్వా చెరువుల్లో రోజుకు మూడు సార్లు మేత వేస్తూ ఉంటారు. ఒక మేతను బిఎస్ఎఫ్ లార్వాను మేపవచ్చని రమేష్ చెబుతున్నారు.' వివరాలకు: 9154160959 - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: మల్బరీ తోటలో.. సరికొత్త పరికరం గురించి మీకు తెలుసా!? -
తక్కువ కాలంలో లాభాలు తెచ్చిపెట్టే పౌల్ట్రీ ఫామ్
-
తక్కువ పెట్టుబడి అధిక లాభాలు
-
మన గుడ్డు వైపు.. విదేశాల చూపు
సాక్షి, అమరావతి: భారత దేశ కోడి గుడ్లకు.. మరీ ముఖ్యంగా ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల గుడ్లకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. పలు దేశాలు కోడి గుడ్ల కోసం దక్షిణాది రాష్ట్రాల వైపు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా కోడి గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో మలేసియా, తైవాన్, హాంకాంగ్, జపాన్ వంటి దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. మన రాష్ట్రంలో రోజుకు 5.5 కోట్ల కోడి గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. మొత్తం దేశీయ గుడ్ల ఎగుమతుల్లో రాష్ట్రం వాటా సుమారు 20 శాతం ఉంది. ప్రస్తుత డిమాండ్‌తో ఇది మరింత పెరగనుంది. స్థానిక డిమాండ్‌కు తోడు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో గుడ్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఫాం గేటు వద్ద గుడ్డు ధర రూ.4.20 నుంచి రూ.5.60కి పెరిగింది. రిటైల్ మార్కెట్లో చాలా చోట్ల ధర రూ.7కు చేరింది. మలేసియా వంటి దేశాల్లో గుడ్డు ధర రూ.8.50 దాటడంతో ఎగుమతులపై రాష్ట్ర పౌల్ట్రీ రైతులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటివరకు సౌదీ అరేబియా వంటి దేశాలకు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న రాష్ట్రం.. ఇప్పుడు మలేషియా, తైవాన్, హాంకాంగ్, జపాన్ వంటి దేశాల మార్కెట్లలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ధరలు పెరగడానికి కారణమిదే బర్డ్‌ఫ్లూ, ఏవియన్ ఫ్లూ వంటి వైరస్లు వ్యాప్తి చెందడంతో అమెరికా, జపాన్ వంటి దేశాల్లో కోళ్ల ఉత్పత్తిని నిలిపివేశారు. ఒక్క అమెరికాలోనే వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా 8 కోట్ల కోళ్లను చంపేశారు. జపాన్‌లో మరో కోటికిపైగా కోళ్లను చంపేశారు. దీంతో అంతర్జాతీయంగా కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిపోయి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని శ్రీనివాస హేచరీస్ ఎండీ సురేష్ చిట్టూరి ‘సాక్షి’కి తెలిపారు. ఇదే సమయంలో కోళ్ల దాణా వ్యయం భారీగా పెరగడంతో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కోళ్ల పెంపకనానికి విరామం ఇచ్చారు. మిగతా రాష్ట్రాల్లో ఉత్పత్తిని కొంత మేర తగ్గించారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 45 లక్షల వరకు కోళ్ల ఉత్పత్తి తగ్గగా, ఆంధ్రా, తెలంగాణల్లో కలిసి 20 లక్షలకు పైగా ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో డిమాండ్‌కు తగినంతగా సరఫరా లేకుండాపోయింది. ఒక్క మహారాష్ట్రలోనే రోజుకు కోటికి పైగా గుడ్లకు కొరత ఉందని అధికారులు ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఇవన్నీ రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులకు కలిసొచ్చే అంశాలని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలోనూ భారీగా పెరుగుతున్న గుడ్డు వినియోగం దేశంలో తలసరి కోడి గుడ్డు వినియోగం పెరుగుతుండటం కూడా గుడ్ల ధరలు పెరగడానికి మరో కారణమని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. దేశంలో గడిచిన 15 ఏళ్లలో కోడి గుడ్ల తలసరి వినియోగం మూడురెట్లు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2005లో దేశీయ తలసరి కోడిగుడ్డు వినియోగం 34 ఉండగా అది 2021కి 90 గుడ్లకు పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత కోడి గుడ్ల వినియోగం భారీగా పెరిగిందని సురేష్ తెలిపారు. కోవిడ్‌కు ముందు తలసరి గుడ్డు వినియోగం 70గా ఉంటే అది 90కి చేరినట్లు తెలిపారు. కానీ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశీయ తలసరి కోడిగుడ్ల వినియోగం 180కి చేరినప్పుడే పిల్లలు బలవర్థకంగా ఉంటారని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో గుడ్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచి, దేశీయంగా, విదేశాలకు ఎగుమతుల్లోనూ రాష్ట్ర రైతులు దూసుకుపోయే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
ధర వెరీ గుడ్డు.. పౌల్ట్రీ రైతుకు ఊరట
సాక్షి, అమరావతి: కోడిగుడ్డు ధర ఊహించని రీతిలో పెరుగుతోంది. ఫారమ్ గేటు వద్ద రికార్డు స్థాయిలో ఒక్కో గుడ్డు ధర రూ.5.25 పలుకుతుండగా.. రిటైల్‌గా రూ.6.50 వరకు విక్రయిస్తున్నారు. ఇదే ధర మరికొంత కాలం కొనసాగితే.. నష్టాల నుంచి గట్టెక్కుతామని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో 1,200 కోళ్ల ఫారాలు ఉండగా.. వాటిలో ప్రస్తుతం 5.60 కోట్లకు పైగా కోళ్లున్నాయి. రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ మేత, ఇతర ధరలు పెరగడంతో కోళ్ల ఉత్పత్తి సంఖ్య తగ్గిపోగా.. రోజుకు 4.75 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్ర పరిధిలో నిత్యం 2.50 కోట్ల నుంచి 3 కోట్ల గుడ్లు వినియోగమవుతున్నాయి. కాగా, దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు గల్ఫ్ దేశాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఫారమ్ గేటు వద్ద ధర రూ.6 దాటే అవకాశం కన్పిస్తోందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రిటైల్ మార్కెట్లో గుడ్డు ధర రూ.7 మార్క్‌ను చేరుకునే అవకాశాలు లేకపోలేదంటున్నాయి. ఎగుమతులకు ఊపు సాధారణంగా మన రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, అస్సాం, మణిపూర్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. కొంతమేర గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. విదేశాల విషయానికి వస్తే ప్రతినెలా 2 కోట్ల గుడ్లు గల్ఫ్ దేశాలకు, 50 లక్షల నుంచి 75 లక్షల వరకు ఇతర దేశాలకు మన దేశం నుంచి ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం టర్కీ, నెదర్లాండ్స్‌లో కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత నెలలో ఏకంగా 20 కోట్ల గుడ్లు ఎగుమతి అయ్యాయి. 50 లక్షలకు మించి ఎగుమతి కాని కతార్‌కు ప్రస్తుతం 2 కోట్లకు పైగా ఎగుమతి అవుతున్నాయి. ఇతర దేశాలకు కూడా కోటిన్నరకు పైగా గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సైతం రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరిగాయి. ఫలితంగా గుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. రైతులకు ఊరట మొక్కజొన్న టన్ను గత ఏడాది రూ.20 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.24 వేలకు చేరింది. సోయాబీన్ టన్ను గతేడాది రూ.38 వేల వరకు పలకగా.. ప్రస్తుతం రూ.48 వేల నుంచి రూ.51వేల మధ్య వరకు ఉంది. ఆయిల్ తీసిన తవుడు (డీవోపీ) గతేడాది కిలో రూ.9 నుంచి రూ.10 ఉండగా.. ప్రస్తుతం రూ.17–18 మధ్య ఉంది. ఇలా ఊహించని రీతిలో పెరిగిన మేత ధరల వల్ల పిల్ల దశ నుంచి గుడ్డు పెట్టే దశ వరకు ఒక్కో కోడికి రూ.300 నుంచి రూ.315 వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ఫారమ్ గేట్ వద్ద ఒక్కో కోడిగుడ్డు ఉత్పత్తికి రూ.4.65 నుంచి రూ.4.75 వరకు ఖర్చవుతోంది. ఫిబ్రవరి నుంచి ఇదే రీతిలో ఖర్చవుతున్నా నెల రోజుల క్రితం వరకు ఫారమ్ గేట్ వద్ద గుడ్డు ధర రూ.3.90కి మించి పలకలేదు. ఫలితంగా పౌల్ట్రీ రైతులు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కాగా, ప్రస్తుతం ఊహించని రీతిలో విదేశాలకు పెరిగిన ఎగుమతులు దేశీయంగా పౌల్ట్రీ రైతుకు కాస్త ఊరటనిచ్చాయి. ఎగుమతులు పెరగటం వల్లే.. చాలా రోజుల తర్వాత పౌల్ట్రీ రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోంది. ఇది పౌల్ట్రీ పరిశ్రమకు శుభపరిణామం. ఊహించని రీతిలో గల్ఫ్ దేశాలకు ఎగుమతులు పెరగడం వల్లే ఫారమ్ గేటు వద్ద రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోంది. గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసే టర్కీ, నెదర్లాండ్స్ దేశాల్లో ఉత్పత్తి తగ్గడం మన గుడ్డుకు కలిసొచ్చింది. – తుమ్మల కుటుంబరావు, చైర్మన్, ఎన్ఈసీఎస్, విజయవాడ జోన్ తొలిసారి గిట్టుబాటు ధర కృష్ణా జిల్లాలో 70 కోళ్ల ఫారాలు ఉన్నాయి. సుమారు కోటి కోళ్లను పెంచుతుండగా.. 75 లక్షల నుంచి 80 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. పెరిగిన ముడిసరుకు ధరల వల్ల ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక్కో కోడిపై నెలకు రూ.30 చొప్పున నష్టపోయాం. ఆ తర్వాత నెలకు రూ.10నుంచి రూ.15 మేర నష్టాలను చవిచూశాం. ప్రస్తుతం ఫారమ్ గేట్ వద్ద గుడ్డు తయారీకి రూ.4.75 వరకు ఖర్చవుతుండగా.. తొలిసారి రూ.5.25 ధర లభిస్తోంది. చాలా ఆనందంగా ఉంది. ఇదే రీతిలో కనీసం ఏడాది పాటు కొనసాగితే నష్టాల నుంచి గట్టెక్కగలం. – ఆర్.సత్యనారాయణరెడ్డి, అధ్యక్షుడు, కృష్ణాజిల్లా లేయర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (చదవండి: సీఎం జగన్ దూరదృష్టికి నిదర్శనమే ఆర్బీకేలు: బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ప్రశంస) -
చికెన్ ధర రూ.300 దాటినా అదే తీరు.. ఇలా అయితే కష్టమే! బ్రాయిలర్ లాక్డౌన్?
ద్వారకాతిరుమల (పశ్చిమ గోదావరి): రాష్ట్రవ్యాప్తంగా బ్రాయిలర్ కార్పొరేట్ కంపెనీలపై కోళ్ల పెంపకం రైతులు కన్నెర్ర చేస్తున్నారు. గ్రోయింగ్ చార్జీలు పెంచాలంటూ ఆందోళన బాటపడుతున్నారు. కంపెనీలతో అమీతుమీ తేల్చుకునేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బ్రాయిలర్ కోళ్ల పెంపకాన్ని నిలుపుదల చేసి, లాక్డౌన్ చేపట్టాలని ఈనెల 18న కామవరపుకోటలో జరిగిన సమావేశంలో రైతులు నిర్ణయించారు. ఏలూ రు జిల్లా ద్వారకాతిరుమల మండల రైతులు మా త్రం ఆ రోజు నుంచే లాక్డౌన్ చేపట్టి, కంపెనీలపై యుద్ధం ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళికను రూపొందించేందుకు బ్రాయిలర్ రైతుల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ జిల్లా అన్నవరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. చదవండి👉🏼 రైతు బజార్లో టమాట పంపిణీ ప్రారంభం మార్కెట్‌పై పట్టు సాధించి.. గతంలో రైతులు సొంత ఖర్చుతో స్వయంగా కోళ్లను పెంచి, మార్కెట్లో హోల్‌సేల్‌గా అమ్ముకునేవారు. క్రమంగా ఈ వ్యాపారంలోకి కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించాయి. కోడి పిల్లలను, దాణాను, మందులను రైతులకు అందించి, వాటిని పెంచినందుకు కిలోకు రూ.4.50 గ్రోయింగ్ చార్జీగా చెల్లిస్తున్నాయి. మొదట్లో రైతు చెప్పిన ధరకు కోళ్లను కొని మార్కెటింగ్ చేసిన వ్యాపారులు, క్రమంగా మార్కెట్‌పై పట్టు సాధించి హేచరీలు, దాణా కంపెనీలతో కలిసిపోయాయి. కొన్ని హేచరీలు ఏకంగా కంపెనీలుగా మారాయి. వారి వద్ద కోడి పిల్లలు, దాణాను తీసుకుని, తిరిగి కోళ్లను వారికే అమ్మే పరిస్థితిని తెచ్చాయి. చికెన్ ధర రూ.300 దాటినా.. మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.300 దాటినా.. కోళ్లను పెంచే రైతులకు దక్కేది మాత్రం కిలోకు రూ.4.50 మాత్రమే. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ శక్తులు కోళ్ల పరిశ్రమలను గుప్పెట్లో పెట్టుకుని హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లను శాసిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా గ్రోయింగ్ చార్జీలు పెంచకపోవడంతో, ఏటా వందలాది మంది రైతులు కోళ్ల పెంపకానికి స్వస్తి చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో లాక్డౌన్ విధించడంతో ఆ ప్రభావం మార్కెట్‌పై పడి, బ్రాయిలర్ కోళ్లు బాగా తగ్గాయి. ఇప్పుడు ఏపీలో లాక్డౌన్ చేపడితే కోళ్ల కొరతతో పాటు, చికెన్ ధర ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. చదవండి👉🏾 సేంద్రీయ సేద్యం.. రసాయన ఎరువులకు స్వస్తి కోట్లలో వ్యాపారం.. లక్షల మందికి జీవనాధారం రాష్ట్రంలో సుమారు 4 వేలకు పైగా బ్రాయిలర్ కోళ్ల ఫారాలున్నాయి. ఒక్కో బ్యాచ్ నుంచి దాదాపు 3.05 కోట్లకు పైగా కోళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వందల కోట్లలో జరుగుతున్న వ్యాపారంపై లక్షలాది మంది రైతులు, వ్యాపారులు, కూలీలు జీవనాధారాన్ని పొందుతున్నారు. కోడిపిల్ల వచ్చిన మొదటి రోజు నుంచి కూలీలు, వ్యాక్సిన్ల ఖర్చు, విద్యుత్ బిల్లులు, ఊక, కోళ్ల లిఫ్టింగ్ తదితర ఖర్చులన్నీ రైతే భరించాల్సి వస్తోంది. కోడి పిల్లలు, దాణా, మందులు, అడ్మినిస్ట్రేషన్ చార్జీల పేరుతో సంస్థ పెట్టిన ఖర్చులన్నీ లిఫ్టింగ్ సమయంలో లెక్కగడుతున్నారు. కోడి కేజీ బరువు పెరగడానికి రూ.95 మించి ఖర్చయితే ఆ భారాన్ని రైతుపైనే మోపుతున్నారు. ఖాళీగా ఫారాలు ద్వారకాతిరుమల మండలంలో మొత్తం 80 కోళ్ల ఫారాలకు గాను లాక్డౌన్ కారణంగా 70 ఫారాలు ఇప్పటికే మూతపడ్డాయి. మిగిలిన 10 ఫారాల్లోని కోళ్లను లిఫ్టింగ్ చేసిన తరువాత మూసివేస్తామని రైతులు చెబుతున్నారు. మూతపడ్డ కోళ్ల ఫారాల వద్ద అన్ని పరికరాలూ మూలనపడ్డాయి. పెట్టుబడులు కూడా రావడం లేదు బ్రాయిలర్ కోళ్ల పెంపకంతో అప్పులపాలయ్యాను. కార్పొరేట్ కంపెనీలు గత పదేళ్ల క్రితం నుంచి గ్రోయింగ్ చార్జీని పెంచలేదు. కూలీల ఖర్చులు, ఊక, విద్యుత్ బిల్లులు, రుణాలు, వడ్డీలు ఇతరత్రా ఖర్చులన్నీ విపరీతంగా పెరిగాయి. కంపెనీ వారు కిలోకి ఇచ్చే రూ.4.50 ఏ మూలకూ సరిపోవడం లేదు. – యలమర్తి రామకృష్ణ, రైతు, మెట్టగూడెం, ద్వారకాతిరుమల మండలం లాక్డౌన్ తప్పదు 10 వేల కోడి పిల్లల బ్యాచ్‌ను పెంచడానికి రైతుకు అయ్యే పెట్టుబడి రూ.1,72,600 అయితే కంపెనీ వారు ఇచ్చేది కేవలం రూ.94,050 మాత్రమే. అంటే ఒక బ్యాచ్‌కి రైతుకు రూ.78,550 నష్టం వస్తోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని నిర్ణయించాం. గ్రోయింగ్ చార్జీని రూ.12కు పెంచడంతో పాటు మరో 17 డిమాండ్లను నెరవేర్చాలి. – చిలుకూరి ధర్మారావు, బ్రాయిలర్ రైతు సంఘం రాష్ట్ర సభ్యుడు, ద్వారకాతిరుమల చదవండి👇 క్వింటాల్ పసుపు రూ. 6,850 ఏమ్మా.. నాకూ కాస్త అన్నం పెట్టండి -
కోడి ధరకు రెక్కలు
తణుకు: చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా ఎండాకాలం మొదలవగానే చికెన్ ధరలు తగ్గుతుంటాయి. అయితే ఒక్కసారిగా ఉత్పత్తి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. వారం రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ రూ.180, స్కిన్ చికెన్ రూ. 160 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్ చికెన్ రూ.280కు విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ రూ.300 పలుకుతోంది. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. దాంతో వ్యాపారాలు మందగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల మేత ధరలు విపరీతంగా పెరగడంతో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో బహుళజాతి సంస్థల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా చికెన్ ధరలకు రెక్కలు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మేత ధరల మోత పశ్చిమ గోదావరి జిల్లాలో సాధారణంగా రోజుకు 2 లక్షల కిలోల మేర చికెన్ వినియోగిస్తుండగా ఆదివారం, ఇతర పండుగల రోజుల్లో రెట్టింపు అమ్మకాలు జరుగుతుంటాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 ఫారాల్లో 8 లక్షలకు పైగా బ్రాయిలర్ కోళ్లు పెరుగుతున్నాయి. సాధారణంగా ఎండలు పెరుగుతున్న సమయంలో చికెన్ ధర తగ్గుతుంది. ఈ సారి ధర పెరగడంతో అటు వ్యాపారులు, ఇటు సామాన్యులకు చికెన్ గుబులు పుట్టిస్తోంది. సాధారణంగా రెండు కిలోల కోడి తయారు కావడానికి 40 రోజులు సమయం పడుతుంది. ఎండాకాలంలో మేత సరిగ్గా తినకపోవడంతో 60 రోజులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో మేత ధరలు అమాంతం పెరగడంతో కొత్త బ్యాచ్‌లు వేయడంలేదు. దీంతో అనుకున్న సమయానికి కోళ్లు ఉత్పత్తి కావడంలేదు. మరోవైపు పౌల్ట్రీ రైతులు నష్టాల బాట పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచుతున్నారు. బ్రాయిలర్‌తో పోల్చితే లేయర్ చికెన్ ధరలు పెద్దగా పెరగకపోవడం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు మేత ధరలు పెరిగిపోవడంతో రైతులు కొత్త బ్యాచ్‌లు వేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో జిల్లాలో డిమాండ్‌కు తగినట్లుగా కోళ్లు అందుబాటులో లేవు. దీంతో చికెన్ ధర పెరిగింది. మేత ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగాయి. మేత ధరలు తగ్గి కొత్త బ్యాచ్‌లు వస్తేనే ధరలు తగ్గుతాయి. – బండి గణేష్, చికెన్ వ్యాపారి, తణుకు తగ్గిన బ్రాయిలర్ కోళ్ల పెంపకం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఇతరత్రా కారణాలతో కొద్ది రోజుల వ్యవధిలోనే మేత ధర పెరిగింది. స్థానిక ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండటం, కొత్త పంటలు మార్కెట్లోకి రాకపోవడం మేత ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబీన్ ధర నెల రోజుల్లో కిలోకు ఏకంగా రూ. 35 నుంచి రూ.90కి పెరిగింది. మొక్కజొన్న కిలో రూ. 12 నుంచి రూ. 24కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో ఉభయగోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని బ్రాయిలర్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బ్రాయిలర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. -
కోళ్లకు కొరత!
సాక్షి, అమరావతి బ్యూరో: వైరస్ భయంతో బ్రాయిలర్ కోళ్ల పెంపకాన్ని ఫౌల్ట్రీ రైతులు తగ్గించడంతో.. మార్కెట్లో కొరత ఏర్పడుతోంది. దీంతో చికెన్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 5న చికెన్(స్కిన్లెస్) కిలో ధర రూ.200 ఉండగా.. ఇప్పుడది రూ.300 దగ్గరకు చేరుకుంది. స్థానిక పౌల్ట్రీల నుంచి రోజూ మూడు లక్షల బ్రాయిలర్ కోళ్ల విక్రయాలు జరుగుతుంటాయి. హైదరాబాద్ నుంచి కోళ్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. డిమాండ్‌కు తగినన్ని బ్రాయిలర్ కోళ్లు లభ్యం కాక ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కాజా వెంకటేశ్వరరావు(నాని) ‘సాక్షి’కి చెప్పారు. -
పడిపోతున్న 'గుడ్డు'
సాక్షి, అమరావతి బ్యూరో: కోడి గుడ్ల ధరలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. నెల రోజుల్లోనే వంద కోడిగుడ్ల ధర దాదాపు రూ.50 మేర పడిపోయింది. రాష్ట్రంలో రోజుకు సగటున ఐదు కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. పొరుగున ఉన్న తెలంగాణ, కర్నాటక, తమిళనాడుల నుంచి మరో కోటి గుడ్లు ఏపీకి దిగుమతి అవుతాయి. వీటిలో 2.50 కోట్ల గుడ్లను ఏపీ నుంచి ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. రాష్ట్రంలో స్థానికంగా 3.50 కోట్ల గుడ్లను వినియోగిస్తుంటారు. సాధారణంగా వాతావరణ ప్రభావంతో సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కోడిగుడ్ల వినియోగం పెరుగుతుంటుంది. దీంతో గుడ్ల ధర కూడా పైకి ఎగబాకుతుంది. కానీ ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా గుడ్ల ధర క్షీణిస్తుండడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో సెప్టెంబర్ 25న వంద గుడ్ల ధర రూ.441గా ఉండగా 30వ తేదీ నాటికి రూ.456కి చేరింది. అప్పటి నుంచి ధర క్రమంగా కిందకి పడిపోవడం మొదలైంది. ఈనెల 5వ తేదీ నాటికి రూ.431కి పడిపోయిన ధర.. 25వ తేదీకల్లా రూ.392కి క్షీణించింది. ఒడిశా, బెంగాల్ ఎఫెక్ట్.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆశ్వయుజ పౌర్ణమి నుంచి మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీంతో ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం బాగా తగ్గిపోయింది. అదే సమయంలో అక్కడ గుడ్ల ఉత్పత్తి మాత్రం పెరిగిపోయింది. ఫలితంగా ఆయా రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు గుడ్లను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి చేసే గుడ్లకు పోటీ ఏర్పడి.. ధర భారీగా పడిపోయింది. గత ఏడాది ధర వెరీ గుడ్.. గతేడాది ఇదే సమయానికి వంద గుడ్ల ధర రూ.500కి పైగా ఉంది. ప్రస్తుత సీజన్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతేడాదితో పోలిస్తే వంద గుడ్ల ధర రూ.100కు పైగానే దిగజారిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. వంద గుడ్ల ధర రూ.470కి పైగా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ(నెక్) జోనల్ చైర్మన్ కుటుంబరావు ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. -
కొండెక్కిన కోడి: కొక్కరొకో.. దిగిరాను పో..!
సాక్షి, అమరావతి బ్యూరో: కోడి మాంసం ధర కొండెక్కింది. కొన్నాళ్ల నుంచి ధర పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.300కు చేరువలో ఉంది. డిమాండ్‌కు తగినంతగా సరఫరా లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కోవిడ్ నేపథ్యంలో చికెన్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో మాంసం ధరకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం అమరావతి పౌల్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ మార్కెట్లో స్కిన్లెస్ కిలో మాంసం ధరను రూ.296గా నిర్దేశించింది. అయితే విజయవాడతోపాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది వ్యాపారులు కిలో రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. అయినప్పటికీ వినియోగం అంతగా తగ్గలేదని వ్యాపా రులు చెబుతున్నారు. జిల్లాల్లో సాధారణ రోజుల్లో రోజుకు లక్షా 25 వేల బ్రాయిలర్ కోళ్లు (దాదాపు 2.50 లక్షల కిలోలు), ఆదివారాల్లో రెట్టింపు.. అంటే రెండున్నర లక్షల కోళ్ల విక్రయాలు జరుగుతాయి. ప్రస్తుతం జిల్లాలో చికెన్ వినియోగం రోజుకు రెండు లక్షల కిలోల వరకు ఉంటోంది. ఇలా ఎందుకంటే..! కోళ్ల ఉత్పత్తి, విక్రయాలను దృష్టిలో ఉంచుకుని హ్యాచరీల నిర్వాహకులు ఏటా మే/జూన్ నెలల్లో క్రాప్ హాలిడే ప్రకటిస్తారు. ఆ సమయాల్లో వీరు పౌల్ట్రీలకు కోడి పిల్లలను విక్రయించరు. ఇలా నెలన్నర రోజుల క్రితం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ హ్యాచరీల నిర్వాహకులు క్రాప్ హాలిడే అమలు చేశారు. దీంతో ఫారాల్లో కొత్త బ్యాచ్‌లు వేయడం తగ్గిపోయింది. దాదాపు నాలుగు వారాల నుంచి మళ్లీ కొత్త బ్యాచ్‌లు వేయడం మొదలు పెట్టారు. వీటిలో కోళ్లు రెండు నుంచి రెండున్నర కిలోల బరువు ఎదిగే వరకు ఫారాల్లో పెంచుతారు. ఇందుకు 35 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత మార్కెట్లో విక్రయిస్తారు. ఇలా కొద్ది రోజుల నుంచి డిమాండ్‌కు సరిపడినంతగా కోళ్ల లభ్యత లేక చికెన్ ధర పెరగడానికి కారణమవుతోందని అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు (నాని) ‘సాక్షి’కి చెప్పారు. నెలలో రూ.78 పెరుగుదల.. గత నెల 18న కిలో చికెన్ ధర రూ.218 ఉంది. అలా జులై ఒకటి నాటికి రూ.230కి పెరిగింది. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ సోమవారానికి రూ.296కి చేరుకుంది. అంటే గడచిన నెల రోజుల్లో కిలోపై రూ.78లు, 19 రోజుల్లో కిలోకు రూ.66 పెరిగిందన్న మాట. ప్రస్తుత పరిస్థితుల్లో కిలో రూ.300కి పైగా చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది మే 15న చికెన్ కిలో రూ.312కి చేరుకుని ఆల్‌టైం రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే! రెండు వారాల్లో తగ్గుముఖం కోడి మాంసం ధర మరో రెండు వారాల్లో తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వివిధ ఫారాల్లో పెరుగుతున్న బ్రాయిలర్ కోళ్లు అప్పటికి రెండు నుంచి రెండున్నర కిలోల బరువుకు చేరుకోనున్నాయి. దీంతో అవసరమైన మేరకు కోళ్ల లభ్యత పెరిగి చికెన్ రేటు తగ్గనుంది. అంటే కిలో రూ.250 లోపు దిగివచ్చి చికెన్ ప్రియులకు ఒకింత అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. -
కోవిడ్‌తో కోలుకున్న గుడ్డు!
సాక్షి, అమరావతి బ్యూరో: కోవిడ్ మహమ్మారి అన్ని రంగాలను కుదేలు చేస్తుండగా కోడి గుడ్డును మాత్రం కోలుకునేలా చేసింది. పోషక విలువలు అధికంగా ఉడే కోడి గుడ్ల వినియోగం కరోనా సమయంలో గణనీయంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే రోజురోజుకూ గుడ్డు ధరలు ఎగబాకుతున్నాయి. ఇది పౌల్ట్రీ రైతులకు కొంతమేర ఊరటనిస్తోంది. కోడి గుడ్లు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో వినియోగం పెరగడంతో గిరాకీ ఎక్కువైంది. రోజూ అదనంగా 50 లక్షల గుడ్లు రాష్ట్రంలో రోజుకు 4.50 కోట్ల కోడి గుడ్ల ఉత్పత్తి జరుగుతుండగా తమిళనాడు, కర్ణాటక నుంచి మరో కోటి గుడ్లు దిగుమతి అవుతున్నాయి. రెండు కోట్ల కోడిగుడ్లు అసోం, బిహార్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు సగటున మూడు కోట్ల గుడ్ల వినియోగం ఉండగా ప్రస్తుతం మూడున్నర కోట్లకు పెరిగింది. రోజుకు 50 లక్షలకు పైగా గుడ్లను అదనంగా వినియోగిస్తున్నారు. అసోం, బెంగాల్, బిహార్, ఒడిశాలోనూ గుడ్ల వినియోగం 20 శాతం వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదల ఇలా.. కోడిగుడ్ల ధరల పెరుగుదల కొద్ది రోజులుగా జోరందుకుంది. ఈనెల 5వ తేదీన విజయవాడలో వంద గుడ్ల ధర హోల్‌సేల్‌లో రూ. 370 ఉండగా ప్రస్తుతం రూ.476కి పెరిగింది. విశాఖపట్నంలో రూ.360 నుంచి 500కి చేరుకుంది. పది రోజుల్లోనే విజయవాడలో రూ. 106, విశాఖలో రూ.140 చొప్పున ధరలు పెరిగాయి. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ.6 వరకు «విక్రయిస్తున్నారు. అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, నాగపూర్, పుణే తదితర నగరాల్లో కొద్దిరోజులుగా వంద గుడ్ల ధర రూ.500కి పైనే పలుకుతోంది. ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలో వంద కోడి గుడ్ల ధర రూ.526 పలికి ఆల్‌టైం హైకి చేరింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి గుడ్ల ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మేత ధరలూ పైపైకి.. కోళ్ల మేత ధరలు కూడా గతం కంటే పెరిగాయి. డిసెంబర్లో కిలో రూ.35–40 వరకు ఉన్న మేత ధర ప్రస్తుతం రూ.70కి చేరిందని పెంపకందార్లు చెబుతున్నారు. మేత రేటు పెరగడంతో గిట్టుబాటు కావడం లేదని ఆందోళన చెందుతున్న తరుణంలో గుడ్లకు గిరాకీ ఏర్పడటం పౌల్ట్రీ రైతులకు కొంత ఊరటనిస్తోంది. రైతులకు వెసులుబాటు.. ‘‘ప్రస్తుత కోడిగుడ్డు ధర పౌల్ట్రీ రైతుకు కాస్త వెసులు బాటునిస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు వంద గుడ్ల ధర రూ.400 లోపే పలికింది. మేత ధర మాత్రం రెట్టింపైంది. దీంతో రైతుకు గిట్టుబాటు కాక నష్టపోవాల్సి వస్తోంది. కోవిడ్ నేపథ్యంలో గుడ్ల వినియోగం బాగా పెరగడం మంచి పరిణామం. కొద్దిరోజుల పాటు వీటి ధరల పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది’’ –టి.కుటుంబరావు, జోనల్ చైర్మన్,నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ (నెక్), విజయవాడ -
Chicken Prices: సగానికి తగ్గిన చికెన్ ధర!
సాక్షి, అమరావతి బ్యూరో: కోవిడ్ ప్రభావం చికెన్ ధరపై పడింది. కొద్దిరోజులుగా దీని ధర పతనమవుతూ వస్తోంది. దాదాపు 20 రోజుల క్రితం కిలో బ్రాయిలర్ కోడిమాంసం రూ.312కి చేరి రికార్డు సృష్టించింది. పౌల్ట్రీ చరిత్రలోనే చికెన్ అత్యధిక ధర పలకడం అదే తొలిసారి. అప్పట్లో మండుటెండలు, వడగాడ్పులతో పాటు ఫారాల్లో కోళ్ల కొరత ఏర్పడింది. దీంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. కానీ ఆ తర్వాత నుంచి చికెన్ ధర క్రమంగా క్షీణించడం మొదలైంది. రోజుకు రూ.5 నుంచి 10 చొప్పున తగ్గుతూ వచ్చి ఇప్పుడు కిలో రూ.160కి చేరింది. ప్రస్తుతం కొన్నిచోట్ల రూ.150కి కూడా చికెన్‌ను విక్రయిస్తున్నారు. కోవిడ్ ప్రభావంతో.. రెండు వారాల నుంచి కోవిడ్ విజృంభణ తీవ్రతరమవుతోంది. రోజూ కోవిడ్ బారిన పడుతున్న రోగుల సంఖ్య పదుల నుంచి వందలకు చేరింది. దీంతో జనం చికెన్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించుకున్నారు. మరోవైపు కొన్నాళ్ల క్రితం వరకు చికెన్‌కు అధిక ధర లభిస్తుండడంతో రైతులు ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని పెంచారు. అలా వేసిన బ్యాచ్‌లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. వివిధ ఫారాల్లో కోళ్లు రెండు నుంచి రెండున్నర కిలోల బరువుకు చేరుకున్నాయి. ఈ బరువుకు మించి పెంపకాన్ని కొనసాగిస్తే రైతుకు నష్టం వాటిల్లుతుంది. రోజూ మేత ఖర్చు పెనుభారంగా మారుతుంది. అందువల్ల నిర్ణీత బరువుకు పెరిగిన కోళ్లను తెగనమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వినియోగానికి మించి కోళ్ల లభ్యత పెరగడంతో చికెన్ ధర క్షీణిస్తోంది. హైదరాబాద్ నుంచి ఆగిన కోళ్లు.. మరోవైపు హైదరాబాద్‌లో ధర ఒకింత తక్కువగా ఉండడం అక్కడ నుంచి కృష్ణా జిల్లాకు బ్రాయిలర్ కోళ్లను తీసుకొస్తుంటారు. కానీ ప్రస్తుతం జిల్లాలో ఉన్న కోళ్లే ధర లేక అమ్ముడవకపోవడంతో అక్కడ నుంచి కొనుగోలు చేయడం లేదని బ్రాయిలర్ కోళ్ల వ్యాపారులు చెబుతున్నారు. ఏడాదిగా పడుతూ.. లేస్తూ.. ► దాదాపు ఏడాది నుంచి పౌల్ట్రీ పరిశ్రమ ఒడిదొడుకులకు లోనవుతోంది. కోడి ధర కొన్నాళ్లు పెరుగుతూ, మరికొన్నాళ్లు పతనమవుతూ వస్తోంది. ► వాస్తవానికి గత ఏడాది కోవిడ్ ఆరంభానికి ముందు వరకు చికెన్ రేటు కిలో రూ.270 వరకు ఉండేది. ► కోవిడ్ ఉద్ధృత రూపం దాల్చాక చికెన్ తింటే కరోనా సోకుతుందన్న దుష్ప్రచారంతో అప్పట్లో వినియోగం తగ్గింది. నాలుగైదు నెలల పాటు దీని ధర భారీగా పతనమై ఒకానొక దశలో మూడు కిలోలు రూ.100కి దిగజారింది. ► ఆ తర్వాత ఆ పరిస్థితి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ గట్టెక్కడంతో మళ్లీ చికెన్ ధర పెరగడం మొదలైంది. ► ఇలా విజయవాడ జోన్లో గత డిసెంబర్ వరకు కిలో రూ.250 వరకు అమ్ముడయ్యేది. అయితే బర్డ్‌ఫ్లూ విజృంభిస్తుందన్న ప్రచారంతో మళ్లీ చికెన్ రేటు జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.150కి పడిపోయింది. ఆ భయం నుంచి బయట పడి మళ్లీ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ► ఇలా ఫిబ్రవరి 23న రూ.200 ఉన్న ధర మార్చి 31కి రూ.260కి చేరింది. ఏప్రిల్ 2న రూ.270, ఏప్రిల్ 6 రూ.312కి పెరిగింది. ► కాగా ప్రస్తుత చికెన్ ధరలు కొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాజా వెంకటేశ్వరరావు (నాని) ‘సాక్షి’కి చెప్పారు. ఇక్కడ చదవండి: Prawns Price: నిలకడగా రొయ్యల ధరలు ‘చాక్లెట్’ పంట.. ఏపీ వెంట.. -
నా కోళ్లు గుడ్లు పెట్టడం లేదు.. ఆ కంపెనీపై కేసు పెట్టండి
సాక్షి, ముంబై: తన కోళ్ల ఫారంలోని కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయని అందుకు దాణా అమ్మిన కంపెనీ బాధ్యత వహించాలని ఒక వ్యక్తి పోలీసుస్టేషన్ మెట్లెక్కాడు. ఈ చిత్రమైన సంఘటన పుణేలోని లోణి కాల్భోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసిన కేసు ప్రకారం.. ‘‘ నా కోళ్ల ఫారంలోని కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయి. అహ్మదాబాద్‌లోని ఓ కంపెనీ అమ్మిన దాణా తిన్న తరువాతే కోళ్లు ఈ విధంగా మొండికేశాయి. నాకు న్యాయం చేయండి’ అని ఫిర్యాదులో సదరు ఫాం యజమాని పేర్కొన్నారు. కాగా, ఇలాంటి కేసులే రెండు, మూడు వచ్చాయని, కంపెనీ యజమానులతో చర్చించి నష్టపరిహారం ఇచ్చేలా ఫాం యజమానులు ఒప్పందం కుదుర్చుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసును కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేంద్ర పేర్కొన్నారు. -
Poultry Farmers: 'గుడ్డు'కు గడ్డుకాలం
కోడిగుడ్డు ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ పౌల్ట్రీ రైతులు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. పెరిగిన మేత ఖర్చులు, వేసవిలో కోళ్ల సంరక్షణకు అధికంగా ఖర్చు పెట్టాల్సి రావడం వారికి భారంగా మారింది. దీనికి తోడు గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు 100కు పైగా లారీల్లో గుడ్లు ఎగుమతి కాగా, ప్రస్తుతం 60కి పడిపోయింది. ఇరగవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, ఇతర రాష్ట్రాలకు 80 లక్షల మేర ఎగుమతి చేస్తున్నారు. స్థానికంగా 20 నుంచి 30 లక్షల వరకు వినియోగిస్తున్నారు. జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా సుమారు పదివేల మంది ఉపాధి పొందుతున్నారు. అన్ స్కిల్డ్ లేబర్‌ను తీసుకుని వారికి పూర్తి స్థాయిలో ఉపాధి కల్పిస్తోంది. లేయర్ కోడిపిల్లను ప్రస్తుతం పౌల్ట్రీ రైతులు రూ.41లకు కొనుగోలు చేస్తున్నారు. 23 వారాలకు గుడ్లు పెట్టే దశకు చేరుకునేసరికి మొత్తం రూ.250 ఖర్చు అవుతుంది. ఈ దశ నుంచి ఒక కోడి సరాసరి రోజుకొకటి చొప్పున ఏడాదికి 320 గుడ్లు పెడుతుంది. గుడ్లను పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు గతంలో 100 నుంచి 120 లారీల్లో ఎగుమతి చేయగా, ప్రస్తుతం రోజుకు 60 నుంచి 70 లారీలు మాత్రమే ఎగుమతి అవుతుండటం గమనార్హం. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం లేదు జిల్లాలో ఉత్పత్తి అయిన గుడ్డును స్థానికంగా నిల్వ చేసే అవకాశం లేదు. గుడ్డు నిల్వ చేసి ఎగుమతి చేసే అవకాశం ఉంటే పౌల్ట్రీ రైతులకు వరమేనని చెప్పవచ్చు. అయితే కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ చేయడం కష్టసాధ్యం. దీనిలో నిల్వ చేసిన గుడ్డును వెంటనే వినియోగించుకోవాలి. లేదంటే పాడైపోతుంది. దీంతో ఉత్పత్తికే పరిమితమయ్యారు. అయితే సేల్ పాయింట్ల వద్ద కోల్డ్ స్టోరేజ్‌లు పెట్టుకుని వేరే రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాలలో ఎక్కువ లాభాలు అర్జిస్తుండగా, పౌల్ట్రీ రైతులకు నిరాశే మిగులుతోంది. పెరిగిన మేత రేట్లు గతంతో పోలిస్తే మేత ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదే రోజుల్లో సోయ కేజి రూ.36 ఉండగా, ప్రస్తుతం రూ.58కి చేరింది. అలాగే ఎండు చేప, స్టోన్, నూకలు ఇలా ప్రతీది ధరలు పెరిగాయి. ఇందుకు అనుగుణంగా గుడ్డు ధర పెరిగినప్పటికీ పౌల్ట్రీ రైతులకు లాభాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. గతంలో ఒడిశా నుంచి కుటుంబాలతో సహా వచ్చి కోళ్లఫారాలలో మకాం ఉండి పనిచేసేవారు ఉండగా, ప్రస్తుతం కరోనా ప్రభావంతో కొత్తవారు పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఉన్నవారు వెళ్లిపోతుండటంతో ఈ పరిశ్రమ లేబర్ సమస్యను ఎదుర్కొంటోంది. వేసవిలో జాగ్రత్తలతో అదనపు ఖర్చు సాధారణ రోజుల్లో వేసవిలో పౌల్ట్రీ పరిశ్రమ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోక తప్పదు. కోళ్ల షెడ్లపైన స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండాలి. దీనికి తోడు గోనుపట్టాలు, ఎండు గడ్డి, దబ్బగడ్డి వేసి కోళ్లకు రక్షణ కల్పించాలి. చల్లటి నీరు కోళ్లకు పెడుతుండాలి. ఇలా చేయడం వల్ల గతంలో కంటే కోడికి రూ.15 నుంచి 20 వరకు అదనంగా ఖర్చు అవుతోంది. అయినప్పటికీ సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే 10 నుంచి 20 శాతం కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంది. విద్యుత్‌పై రాయితీ ఇవ్వాలి గతంలో బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ ఇచ్చేవారు. ఇప్పుడు అది లేదు. లేబర్ సమస్యల వల్ల యంత్రాలను ఎక్కువ వినియోగిస్తుండటంతో విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయి. ఆక్వా పరిశ్రమకు ఇచ్చినట్లే పౌల్ట్రీ పరిశ్రమకు కూడా విద్యుత్ రాయితీ ఇవ్వాలి. పౌల్ట్రీ నిర్వహణలో గతంలో కంటే సమస్యలు పెరిగాయి. కోళ్లలో వైరస్ల నివారణకు ఒక్కో కోడికి రూ.15 నుంచి రూ.20 వరకు ఖర్చవుతోంది. – పెన్మెత్స సుబ్బరాజు, పౌల్ట్రీ రైతు, డీసీఎమ్ఎస్డైరెక్టర్, కావలిపురం మేత ధరలు తగ్గించాలి వేసవిలో కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. ఎండ తీవ్రతను బట్టి సుమారు 8 లక్షల వరకు మృత్యువాత పడుతుంటాయి. కోళ్లను సంరక్షించడానికి అదనంగా ఖర్చు అవుతుంది. వీటితో పాటు కోళ్లు మేతకు వాడే ముడి సరుకు ధరలు విపరీతంగా పెరిగాయి. ముడి సరుకులపై ప్రభుత్వం రాయితీ కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుంది. – జి.గంగాధరరావు, నెక్ గోదావరి జోనల్ కమిటీ చైర్మన్ -
ఆ కోడి ధర వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
తెల్లటి రంగు.. 7 కిలోల బరువు.. 28 అంగుళాల ఎత్తు.. చిలుక ముక్కు.. డేగ లాంటి శరీర సౌష్టవంతో చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది ఆ కోడి పుంజు! దీని ధర వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే! పెద్దపర్ల జాతికి చెందిన ఈ కోడి పుంజు ధర అక్షరాలా లక్ష రూపాయలు. గిద్దలూరు రూరల్ (ప్రకాశం జిల్లా): గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన రైతు మందగంటి పెద్ద పుల్లయ్య గత 30 ఏళ్లుగా కోళ్ల పెంపకంలో ఆరితేరాడు. నాలుగేళ్ల నుంచి అరుదైన జాతి కోళ్లను పెంచుతూ కోళ్ల పెంపకంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. మొదట్లో తాపీమేస్త్రీగా జీవనం సాగించే పెద్దపుల్లయ్య తన ఇంట్లో వివిధ రకాల నాటు, బెడస తదితర జాతి కోళ్లను పెంచేవాడు. నాలుగేళ్ల క్రితం తాపీమేస్త్రీ పని చాలించుకుని గ్రామంలోనే 2 ఎకరాల పొలం కొని సాగు చేస్తున్నాడు. అరుదైన జాతి కోళ్లను పెంచాలనే తన కలను నెరవేర్చుకునేందుకు ఎన్నో ఊర్లు తిరిగాడు. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచ్చిలో పెద్దపర్ల జాతికి చెందిన ఏడు నెలల వయసు గల కోడిని రూ.లక్షకు కొనుగోలు చేశాడు. అరుదైన జాతి కోళ్లను జల్లెడ పట్టేందుకు ఊర్లన్నీ తిరిగేందుకు రూ.24 వేలు ఖర్చు చేశాడు. మొత్తం మీద తమిళనాడు నుంచి కోడి పుంజును ఇంటికి తీసుకొచ్చేందుకు రూ.1.24 లక్షలు అయింది. గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, పోరుమామిళ్ల, మైదుకూరు ప్రాంతాల్లో ఇటువంటి అరుదైన జాతి పుంజు లేదని పుల్లయ్య గర్వంగా చెబుతున్నాడు. తన వద్ద ఉన్న కోళ్లలో ఒక్కటి కూడా రూ.30 వేలకు తక్కువ ధరలో లేకపోవడం గమనార్హం. చాలా మంది ఎగతాళి చేశారు ఒక్కో కోడికి దాణా కోసం నెలకు రూ.3 వేలు ఖర్చు అవుతుంది. బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఉడికించిన గుడ్డు, శనగలు, వేరుశనగలు, రాగులు, సజ్జలను దాణాగా పెట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలకు తినిపించినట్లు తినిపించాల్సి వస్తుంది. కోళ్ల పెంపకం ద్వారా నెలకు రూ.30 వేలకు వరకు ఆదాయం పొందుతున్నా. పది రోజుల పిల్ల రూ.5 వేలు, కోడి గుడ్డు రూ.వెయ్యి చొప్పున విక్రయిస్తుంటా. దిష్టి తగులుతుందని బయటకు ఎంతో జాగ్రత్తగా తీసుకువెళ్తుంటా. దీని విలువ తెలియని కొంత మంది కోడి లక్ష రూపాయాలా అని ఎగతాళి చేశారు. మా గేదె కూడా అంత విలువ చేయదు, నీ కోడి చేస్తుందా అంటుంటారు. అందుకోసమే కోడిని ఎవరికీ చూపించకుండా జాగ్రత్తగా పెంచుతున్నా. – పెద్ద పుల్లయ్య, కోళ్ల పెంపకందారుడు -
గత నెల ఎంత వస్తే అంతే కట్టండి!
సాక్షి, అమరావతి: మార్చి నెలలో వచ్చిన విద్యుత్ బిల్లులే ఏప్రిల్ నెలకూ వర్తిస్తాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నందున సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విద్యుత్ బిల్లులు తీయడం సాధ్యం కాదని రాష్ట్ర డిస్కమ్‌లో కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి మార్చి (ఫిబ్రవరి వినియోగం)లో వచ్చిన కరెంట్ బిల్లే ఏప్రిల్‌కూ వర్తింపజేస్తూ ఆదేశాలిచ్చారు. సమయం మరో 2 గంటలైనా పెంచండి ప్రభుత్వానికి పౌల్ట్రీ రైతుల విన్నపం సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలను సడలించాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. రైతుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని మరో రెండు గంటల పాటు చికెన్ దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్, ఏపీ రైతు సంఘాలు కోరాయి. (కరోనా: పెనుగొండలో నిషేధాజ్ఞలు) -
‘కరోనా’.. కోటి రూపాయల నజరానా
సాక్షి, చెన్నై: కోడి గుడ్లు, చికెన్ తినడం వలన, కరోనా వైరస్ వ్యాపిస్తుందని ఎవరైనా నిరూపిస్తే వారికి రూ.కోటి బహుమతిని అందజేస్తామని తమిళనాడు ఫౌల్ట్రీ రైతు సమాఖ్య, తమిళనాడు ఫౌల్ట్రీ రైతు మార్కెటింగ్ సొసైటీ సంయుక్తంగా ప్రకటించాయి. కరోనా కలకలం నేపథ్యంలో చికెన్, గుడ్లు ధరలు దారుణంగా పడిపోయాయి. ఫౌల్ట్రీకి ప్రసిద్ధి చెందిన నామక్కల్‌లో ఎన్నడూ లేనంతగా కోళ్ల ఫారాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫౌల్ట్రీ రైతులు మంగళవారం నామక్కల్ పట్టణంలో సమావేశమయ్యారు. ఫౌల్ట్రీ రైతు సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాంగిలి సుబ్రమణ్యం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కరోనా భీతితో కొన్ని రోజులుగా కోడి మాంసం, కోడిగుడ్ల వ్యాపారం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కోడి గుడ్డు ధర ఇప్పుడు రూ. 1.3 పడిపోయిందని, కోడి మాంసం రూ. 20కి తగ్గిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వదంతులే దీనికి కారణమన్నారు. (‘కరోనా’పై కొత్త చాలెంజ్.. భారీ స్పందన) ఇటువంటి ప్రచారంతో కోళ్ల ఫారం రైతులే కాకుండా వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. రూ. 20 విక్రయించిన మొక్క జొన్నలు (కోళ్ల దాణా) ఇప్పుడు రూ. 16కు విక్రయిస్తున్నా కొనేవారు కరువయ్యారని అన్నారు. వ్యాపారం దారుణంగా పడిపోవడంతో నామక్కల్ మండలంలో 15 కోట్ల గుడ్లు నిలిచిపోయాయని, పాఠశాలలు సెలవుల కారణంగా అదనంగా మరో 4 కోట్ల గుడ్లు నిలిచిపోయాయని వెల్లడించారు. వీటిని శీతలీకరణ పెట్టెల్లో పెట్టి ధర పెరిగిన తర్వాత విక్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. చికెన్, కోడిగుడ్లు తినడం ద్వారా కరోనా వ్యాపిస్తుందని ఎవరైనా నిరూపిస్తే వారికి తమ సమాఖ్య తరఫున రూ.కోటి బహుమతి అందజేస్తామని ప్రకటించారు. అమెరికా, చైనా, ఇటలీ వంటి దేశాల్లో కూడా కోడి మాంసం, కోడి గుడ్లను ఆహారంగా తీసుకుంటున్నారు.. అక్కడ కోడి మాంసం వలన ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. ప్రజలు వదంతులను నమ్మకుండా కోడి మాంసం, గుడ్లు తినాలని కోరారు. కరోనా వదంతుల వల్లే ఇప్పటి వరకు పౌల్ట్రీకి దాదాపు రూ. 500 కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపారు. వదంతులు సృష్టించిన ఆడిటర్ అరెస్ట్ సేలం: కోడి మాంసం, గుడ్లు తింటే కరోనా వస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టించిన ఆడిటర్ బాబు శరవణన్ (40)ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోడి మాంసం, కోడి గుడ్లు తింటే కరోనా వ్యాపిస్తుందంటూ శరవణన్.. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. ఇది వైరల్‌గా మారడంతో తమిళనాడు ఫౌల్ట్రీ రైతు సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాంగిలి సుబ్రమణ్యం.. నల్లిపాళయం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సోమవారం రాత్రి శరవణన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. (కరోనా: తెర వెనుక హీరోపై ప్రశంసలు) -
కోడి కొనలేం.. గుడ్డు తినలేం
సాక్షి, అమరావతి బ్యూరో: గత కొన్ని రోజులుగా కొండెక్కిన కోడి ధర కిందికి దిగిరానంటోంది. ఆదివారం అలవాటుగా నాన్ వెజ్ తిందామనుకునే మాంసాహార ప్రియులకు చికెన్ ధరలు షాకిస్తున్నాయి. కిలో చికెన్ రేటు రూ. 200లు దాటిపోవడంతో కొనేందుకు దుకాణాలకు వెళ్లిన మాంసాహార ప్రియులు అమ్మో! అంత రేటా.. అని నోరెళ్లబెడుతున్నారు. చికెన్‌కు పోటీగా గుడ్డు కూడా కొనుగోలుదారుల జేబుకు చిల్లుపెడుతోంది. రిటైల్ మార్కెట్లో గుడ్డు ధర రూ. 6లుగా ఉంది. కూరగాయల రేట్లు దిగివస్తున్నా.. వీటి ధరలకు మాత్రం రెక్కలొచ్చాయి. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడం వల్లే.. సాధారణంగా శీతాకాలంలో మాంసం, కోడిగుడ్లను ఎక్కువగా తింటారు. ఆ డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేకపోవడంతో ధర పెరుగుతూ ఉంది. నెలన్నర రోజులుగా స్కిన్లెస్ చికెన్ ధర కిలో రూ.190 నుంచి కిందికి దిగిరాలేదు. ఇప్పుడది రూ.200కి చేరింది. వారం రోజుల క్రితం బ్రాయిలర్ చికెన్ ధర కిలో రూ.214కి చేరి కంగారెత్తించింది. ఈ సీజనులో ఇదే అత్యధిక ధర. గత ఏడాది కూడా చికెన్ కిలో ధర రూ.200 చేరి తర్వాత దిగొచ్చింది. ఇప్పుడు మాత్రం రేటు పైపైకే తప్ప సామాన్యుడికి అందుబాటులోకి రావడం లేదు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో రోజుకు సగటున 2 లక్షల కిలోల చికెన్‌ను వినియోగిస్తారు. ఆదివారం 3 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. అయితే ఆ స్థాయిలో కోళ్ల లభ్యత లేకపోవడం వల్ల ధరలు స్వల్పంగా పెరిగాయని కోళ్ల ఫారాల రైతులు చెబుతున్నారు. ‘గుడ్లు’ తేలేసేలా ధర మరోవైపు కోడిగుడ్డు ధర వింటే గుడ్లు తేలేసేలా ఉంది. గుడ్డు ధర మార్కెట్లో రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం వంద గుడ్లకు రైతుకు చెల్లించే ధర రూ.473గా ఉండగా.. రిటైల్ మార్కెట్లో డజన్ గుడ్ల ధర రూ.66 వరకు ఉంది. రైతు బజార్లో విడిగా ఒక్కొక్కటి రూ.6కు అమ్ముతున్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ (నెక్) విజయవాడ జోన్ పరిధిలో కృష్ణా, విజయవాడ, గుంటూరు జిల్లాలుండగా.. ఒక్క కృష్ణా జిల్లాలోనే రోజుకు 80 లక్షల గుడ్ల వరకు ఉత్పత్తవుతున్నాయి. వీటిలో 50 శాతం స్థానికంగా వినియోగిస్తుండగా మిగతా ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, అస్సాం తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం చలికాలం కావడం వల్ల స్థానికంగా, ఈశాన్య రాష్ట్రాల్లో కోడిగుడ్ల వినియోగం పెరిగింది. మరోవైపు గిట్టుబాటు కాక కొంతమంది కోళ్ల ఫారాల రైతులు బ్యాచ్‌లు తగ్గించారు. దీంతో గుడ్ల ఉత్పత్తి తగ్గి కోడిగుడ్ల ధరలు పెరిగాయని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. దిగొస్తున్న కూరగాయలు కూరగాయల ధరలు దిగొస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు కిలో రూ.30 నుంచి రూ.50 వరకూ పలికిన కూరగాయల ధరలు తగ్గాయి. రైతు» బజార్లలో కిలో టమోటా రూ.13, వంగ రూ.14, బెండ రూ.20, కాకర, గోరుచిక్కుడు రూ.18, కాలీఫ్లవర్ రూ.15, చిక్కుడుకాయలు రూ.24, బంగాళాదుంపలు రూ.25కు దొరుకుతున్నాయి. బయట మార్కెట్లో రూ.5 నుంచి 10లు పెంచి విక్రయిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం రైతుబజార్లు, మార్కెట్ యార్డుల్లో కిలో రూ.15కే ఉల్లిపాయలను అందుబాటులో ఉంచింది. బయట కిలో రూ.100–150 వరకు పలికిన ఉల్లిపాయలు ఇప్పడు రూ.60కు లభ్యమవుతున్నాయి. గుడ్ల రేటు పెరగడంతో రైతుకు ఉపశమనం కోళ్ల మేత ధరలు బాగా పెరిగాయి. కిలో రూ.14 ఉండే మొక్కజొన్న రూ.26 వరకు పెరిగింది. సోయా కూడా పెరగడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ తరుణంలో గుడ్ల ధరల పెరుగుదల రైతుకు కాస్త ఊరటనిస్తోంది. అయితే ఈ గిట్టుబాటు ధరలు మరో రెండు నెలల వరకే కొనసాగుతాయి. ఆ తర్వాత ఎండలు మొదలైతే తగ్గుముఖం పడతాయి. –కుటుంబరావు, నెక్ విజయవాడ జోన్ చైర్మన్ ఈ ధరలు కొన్నాళ్లే.. కోళ్ల దాణా ధరలు, నిర్వహణ వ్యయం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత చికెన్ ధర పౌల్ట్రీ రైతులకు గిట్టుబాటుగానే ఉంది. ఇవి కొన్నాళ్ల పాటే కొనసాగుతాయి. – వెంకటేశ్వరరావు, అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్, ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు -
పౌల్ట్రీ రైతు విలవిల
యాచారం: ఇటీవల భానుడి ప్రకోపానికి పౌల్ట్రీఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో నిత్యం ఒక్కో ఫారంలో వందలాదిగా చనిపోతున్నాయి. నిత్యం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కోళ్లు పెంచుతున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కోళ్ల మృత్యువాతను భరించలేక చిన్న, సన్నకారు రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల చికెన్ ధరలు కిలో రూ. 200 దాటింది. పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లకు చల్లదనం కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. దీంతో కోళ్లు చనిపోవడం పరిపాటిగా మారింది. ఇబ్రహీంపట్నం డివిజన్లోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మాడ్గుల తదితర మండలాల్లో వెయ్యి మంది రైతులు ఆయా మండలాల్లోని పీఏసీఏస్‌లు, వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని పౌల్ట్రీఫారాలు నిర్వహిస్తున్నారు. కొందరు రైతులు ఇంటిగ్రేషన్ పద్ధతిలో సుగుణ, స్నేహ, సీపీ తదితర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని కోళ్లను పెంచుతున్నారు. ఆయా కంపెనీలు రైతులకు కోడిపిల్లలను సరఫరా చేయడంతో అవి రెండు నుంచి రెండున్నర కిలోల బరువు వచ్చే వరకు పౌల్ట్రీ ఫారాల్లో పెంచుతున్నారు. కోడి పిల్లలకు కావాల్సిన దాణా, వైద్యం తదితరాలను కంపెనీ ప్రతినిధులే భరిస్తారు. కోళ్లు 40 నుంచి 45 రోజుల వయసు రాగానే రైతులు ఆయా కంపెనీలకే కోళ్లను విక్రయిస్తుంటారు. కిలోకు రూ. 22 నుంచి రూ.23 వరకు కంపెనీలు రైతులకు చెల్లిస్తున్నాయి. ఇలా డివిజన్ పరిధిలోని ఆయా గ్రామాల్లో వెయ్యి మందికి పైగా రైతులు కోళ్ల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాగా, ఇటీవల భానుడి ప్రతాపంతో పౌల్ట్రీ రైతు పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యం ఒక్కో ఫారంలో వందలాదిగా కోళ్లు చనిపోవడం(మొటాల్టీ)తో ఇంటిగ్రేటెడ్ రైతులతో పాటు స్వతహాగా ఫారాలు నిర్వహిస్తున్న రైతులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో ఒక్కో ఫారంలో సగటున 20 నుంచి 30 శాతం వరకు కోళ్లు చనిపోతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. నిత్యం లక్ష వరకు మృతి.. ఇటీవల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో డివిజన్లోని ఆయా గ్రామాల్లో నిత్యం 50 వేల నుంచి లక్ష వరకు కోళ్లు చనిపోతున్నాయి. ఎండల తీవ్రత నుంచి కోళ్లకు ఉపశమనం కలిగించడం కోసం రైతులు ఫ్యాన్లను ఏర్పాటు చేయడం, గోనె సంచులు కట్టి నీళ్లను చల్లడం, పైకప్పులపై గడ్డి వేసి నీళ్లు పోయడం.. తదితర రక్షణ చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎండల తీవ్రత పెరగడంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. యాచారం, మంచాల, మాడ్గుల, ఇబ్రహీంపట్నం మండలాల్లో బోరుబావుల్లో భూగర్భజలాలు లేకపోవడంతో కోళ్లను కాపాడుకోవడం, వాటి దాహార్తి తీర్చడం కోసం రైతులు ఒక్కో ట్యాంటర్కు రూ. 800 నుంచి రూ. 1,500 వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా కోళ్ల పెరిగే 40 రోజుల్లోనే కేవలం నీటికే రూ. 40 వేల ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లేక పోవడంతో రైతులు చాలా మంది ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో కోళ్లు పెంచుతున్నారు. ఎండలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఇక స్వయంగా కోళ్ల పెంపకం చేపడుతున్న రైతుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం వేలసంఖ్యలో కోళ్లు చనిపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. చనిపోతున్న కోళ్లను పొలాల్లో గుంతలు తీసి పూడ్చివేస్తున్నారు. నష్టం రోజుకు రూ. కోటికి పైగానే ఇబ్రహీంపట్నం డివిజన్లోని ఆయా మండలాల్లో పౌల్ట్రీఫారాలు నిర్వహిస్తున్న దాదాపు వెయ్యి మందికి పైగా రైతులు ఆయా పీఏసీఎస్‌లు, వివిధ బ్యాంకుల్లో సుమారు రూ.100 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. కోళ్ల పెంపకంతో వచ్చే ఆదాయంతో ప్రతి సంవత్సరం మార్చి 31 లోపు వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని విధాలుగా అనుకూలిస్తే 10 వేల కోళ్ల పెంపకం చేస్తున్న రైతులకు 40 రోజులకు రూ. 60 వేల నుంచి రూ.80 వేలు, 20 వేల కోళ్ల పెంపకం చేసే రైతులకు రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. తద్వారా బ్యాంకులకు వాయిదాలు చెల్లిస్తుంటారు. అయితే, ఎండల తీవ్రతతో ఇబ్రహీంపట్నం డివిజన్లోని పలు గ్రామాల్లో వేలాది కోళ్లు మృతి చెందడంతో రైతులకు నిత్యం రూ. కోటికి పైగానే నష్టం వస్తోంది. ఇక జిల్లావ్యాప్తంగా అది రూ. 10 కోట్లకు పైమాటే. ఎండల తీవ్రతకు కోళ్లు చనిపోతే ఇంటిగ్రేషన్ సంస్థలు కోడి పిల్లల ఖర్చు భరిస్తాయే తప్పా, కోళ్ల పెంపకం ఉపయోగించే దాణా, వైద్యం ఖర్చులను రైతే భరించాల్సి ఉంటుంది. కోళ్లు చేతికి వచ్చే సమయంలో చనిపోతుండడంతో రైతులు అప్పుల్లో మునిగిపోతున్నారు. ఆయా మండలాల్లో రెండు, మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈ విషయంలో తమకు ఆపన్నహస్తం అందివ్వాలని పలువురు రైతులు కోరుతున్నారు. చనిపోయిన కోళ్లను చూపిస్తున్న రైతు లిక్కి సుధాకర్‌రెడ్డి -
కొక్కిరి బిక్కిరి
తూర్పుగోదావరి ,మండపేట: జిల్లాలోని పౌల్ట్రీల్లో వివిధ దశల్లో సుమారు 2.4 కోట్ల కోళ్లు ఉండగా వీటిలో గుడ్లు పెట్టేవి 1.30 కోట్లు ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో రోజుకు 1.1 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. రోజుకు 25 నుంచి 28 వేల వరకూ కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటాయి. ఐదు రోజులుగా 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, వేడిగాలుల ప్రభావంతో కోళ్ల మరణాలు ముందెన్నడూ లేనంతగా పెరిగాయని రైతులు అంటున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు 1.5 లక్షల వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు అంచనా. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వల్ల సగటున రూ.100 వరకు నష్టం వాటిల్లుతుంది. ఈ మేరకు కోళ్ల మరణాల రూపంలో రోజుకు రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఈ మేరకు ఆరు రోజులుగా రూ. తొమ్మిది కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఎండలు మరింత ముదిరితే మరణాల సంఖ్య పెరిగిపోతుందన్న ఆందోళనలో కోళ్ల రైతులు ఉన్నారు. మరోపక్క నాలుగు రోజులుగా గుడ్లు ఉత్పత్తి 15 శాతం మేర పడిపోయింది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు కోటి 10 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. ఎండల తీవ్రతతో సుమారు 93.5 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. రోజుకు 16.5 లక్షల గుడ్లను రైతులు కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం గుడ్డు రైతు ధర రూ.3.4 పైసలు ఉండగా రోజుకు రూ.దాదాపు రూ.56 లక్షలు చొప్పున ఆరు రోజుల్లో రూ.3.36 కోట్ల మేర పౌల్ట్రీకి నష్టం వాటిల్లింది. ఆయా రూపాల్లో ఆరు రోజుల్లోను పౌల్ట్రీ పరిశ్రమకు రూ.12.36 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. జిల్లా నుంచి ప్రధానంగా ఎగుమతులు జరిగే పశ్చిమబెంగాల్, ఒడిశాలలో వినియోగం తగ్గడంతో గుడ్డు ధర పతనం బాట పట్టనుందని కోళ్ల రైతులు అంటున్నారు. నిర్వహణ భారం తడిసి మోపెడు అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం తడిసిమోపెడవుతోందని కోళ్ల రైతులంటున్నారు. వడదెబ్బకు గురికాకుండా వాటికి ప్రత్యేక మందులు ఇవ్వడం, కోళ్లకు వేడిగాలులు తగలకుండా ఫారాలు చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్లు ఏర్పాటు తదితర జాగ్రత్తలకు తోడు పెరిగిన మేత ధరలు, కూలీ రేట్లతో నిర్వహణ భారం పెరిగిపోతోంది. ఇటీవల ఈదురుగాలుల ప్రభావం పరిశ్రమకు అపారనష్టాన్ని కలుగజేసింది. అర్తమూరు, ద్వారపూడి, అనపర్తి ఏరియాల్లోని పౌల్ట్రీ ఫారాల్లో షెడ్ల రేకులు ఎగిరిపోయి రైతులు నష్టపోవాల్సి వచ్చింది. గోదాముల్లోని కోడిమేతలు తడిసిపోయాయి. అధిక ఉష్ణోగ్రతలతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, జనరేటర్లు సరిగా పనిచేయకపోవడం తదితర కారణాలతో విద్యుత్ సమస్యలు తోడవుతున్నాయి. ఈ తరుణంలో కోళ్ల మరణాలు, ఉత్పత్తి పడిపోవడం, గుడ్డు ధర తగ్గడం పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుముందు ఎండలు మరింత ముదరనుండటంతో పరిశ్రమ మరింత నష్టాల్లో కూరుకుపోతుందని కోళ్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకోవాలి ఎండల తీవ్రతతో కోళ్ల పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కోళ్ల మరణాలు, గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయి కుదేలైపోయిన కోళ్ల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. లేకపోతే ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఈ రంగాన్నే నమ్ముకున్న వేలాది మంది బతుకులు రోడ్డున పడే ప్రమాదముంది. పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. – పడాల సుబ్బారెడ్డి, నెక్ జిల్లా చైర్మన్,పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెక్ జాతీయ కమిటీ సభ్యుడు, అర్తమూరు -
తగ్గుతున్న చికెన్ ధరలు
సాక్షి, సిటీబ్యూరో: కోడి ధర కొండ దిగింది. వారం రోజుల్లోనే చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. దీంతో పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు పరేషాన్ అవుతున్నారు. వారం క్రితం రూ.160 ఉన్న లైవ్ బర్డ్ 100 రూపాయలకు తగ్గింది. అలాగే రూ.180 ఉన్న విత్స్కిన్ చికెన్ 120కు, రూ.210 ఉన్న స్కిన్లెస్ చికెన్ 140కి తగ్గింది. మొత్తంమీద వారంలో చికెన్ ధరలు దాదాపు రూ.60 వరకు పడిపోయాయి. వాస్తవంగా ఇది హోల్‌సేల్, ఫారంగేట్ ధరల్లో వ్యత్యాసం. రిటైల్ మార్కెట్లో మాత్రం ధరలు కాస్త ఫర్వాలేదన్నట్లుగా ఉన్నాయి. సాధారణంగా వేసవిలో చికెన్ ధరలు తగ్గుతాయి. కాని ప్రారంభంలోనే భారీస్థాయిలో ధరలు పతనమవడంతో పౌల్ట్రీ రైతులు దిగాలు చెందుతున్నారు. ధరలు తగ్గడానికి కారణాలివే.. మన దగ్గర కోళ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి పెరగడంతో ధరలు తగ్గినట్లు పౌల్ట్రీ రంగం నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎండ కాలంలో చికెన్ ధరలు కాస్త తగ్గు ముఖం పట్టడం సహజం. కానీ వేసవి ప్రారంభంలోనే భారీగా తగ్గడంతో పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రం మొత్తంమీద 9 కోట్ల కోళ్లు ఉంటే ఇందులో సగానికి సగం గ్రేటర్ శివారు, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో లేయర్ కోళ్లు నాలుగున్నర కోట్లు , బ్రాయిలర్ నాలుగున్నర కోట్లు ఉన్నాయని అంచనా. హోల్‌సేల్ మార్కెట్లో రైతుకు కోడి గుడ్డు ధర రూ.3.80 పైస ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం రూపాయి నష్టానికి రూ.2.80కే అమ్ముకోవాల్సి వస్తుంది. దిగుమతులు పెరిగాయి తెలంగాణ రాష్ట్రంతో పాటు, మహారాష్ట్ర నుంచి కోళ్ల దిగుమతి పెరిగింది. ఎండా కాలం అవడంతో చికెన్ డిమాండ్ కూడా తగ్గింది. కోడి పారం ధర రూ.65 ఉంది. హోల్‌సెల్ ధర రూ.75 వరకు ఉంది. గత వారం రోజుల్లో కిలోకు దాదాపు రూ.50 నుంచి 60 వరకు తగ్గింది. కానీ రిటైల్ మార్కెట్లో చికెన్ ధరలు తగ్గడం లేదు. – డాక్టర్ రంజిత్ రెడ్డి, తెలంగాణ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేసవిలో ధరలు తగ్గుతాయి ప్రతి ఏటా మార్చి నెల నుంచి గుడ్ల ధరలు తగ్గుతాయి. ప్రత్యేకంగా ఉగాది, శ్రీరామ నవమి నుంచి ధరలు తగ్గుముఖం పడతాయి. వేసవిలో గుడ్ల వినియోగం కాస్త తగ్గుతుంది. అందుకే ధరలు తగ్గుతాయి. – సంజీవ్ చింతావర్, బిజినెస్ మేనేజర్ నెక్ -
లక్ష టన్నుల మొక్కజన్న దిగుమతి: నెక్
హైదరాబాద్: పౌల్ట్రీ రైతులు లక్ష టన్నుల మొక్కజొన్నను త్వరలో దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నట్లు నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటి(ఎన్ఈసీసీ-నెక్) ఒక ప్రకటనలో తెలిపింది. మొక్కజొన్న దిగుమతి వల్ల సమంజసమైన ధరకు రైతులకు మొక్కజొన్న అందుబాటులో వుంటుందని, తద్వారా దేశీయ మార్కెట్లో ధర దిగివస్తుందని పేర్కొంది. కోళ్ల దాణాలో కీలకమైన మొక్కజొన్న ధరలు గత కొన్నేళ్లుగా బాగా పెరుగుతున్నాయని ఇది పౌల్ట్రీ రైతులపై భారాన్ని మోపుతోందని వివరించింది. లక్ష టన్నుల మొక్కజొన్న దిగుమతి వల్ల సరఫరా, డిమాండ్ల మధ్య అంతరం తగ్గి ధరలు దిగిరాగలవని పేర్కొంది. -
మళ్లీ గడ్డు కాలం
మండపేట : వేసవి నష్టాల నుంచి గట్టెక్కుతున్నామన్న కోళ్ల రైతుల ఆనందాన్ని శ్రావణమాసం ఆవిరి చేస్తోంది. వినియోగం తగ్గి గుడ్డు ధర పతనమవుతోంది. ప్రస్తుత ధరను బట్టి రోజూ పరిశ్రమకు సుమారు రూ.40 లక్షల నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. త్వరలో చవితి రానుండటంతో మున్ముందు మరింత గడ్డు కాలమేనని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలోని పౌల్ట్రీల్లో 1.30 కోట్ల కోళ్లుండగా రోజుకు సుమారు 1.04 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఎండల తీవ్రతతో ఏప్రిల్, మే నెలల్లో 20 శాతం మేర పడిపోయిన గుడ్ల ఉత్పత్తి తొలకరి జల్లులతో సాధారణ స్థితికి చేరింది. జిల్లా నుంచి ప్రధానంగా ఎగుమతులు జరిగే పశ్చిమబెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాల్లో గుడ్డు వినియోగం పెరిగింది. వేసవి ప్రభావంతో ఏప్రిల్‌లో రూ. 2.30కు పతనమైన గుడ్డు రైతు ధర జూన్‌లో ఎగుమతులు పుంజుకుని పెరుగుతూ వచ్చింది. జూన్ 19 నాటికి రూ.3.94 అత్యధిక ధరను నమోదు చేసుకుంది. ఇంతలో శ్రావణ మాసం రాకతో ఉత్పత్తికి తగిన డిమాండ్ లేక ధర పతనమవుతోంది. ఎగుమతులకు డిమాండ్ లేక గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతూ శనివారం నాటికి రైతు ధర రూ 2.86కు పతనమైంది. నిర్వహణ భారం దృష్ట్యా రైతు ధర రూ.3.25 ఉంటే తప్ప గిట్టుబాటు కాదని పౌల్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పడాల సుబ్బారెడ్డి అన్నారు. ఆ మేరకు జిల్లాలో పరిశ్రమకు రోజుకు సుమారు రూ.40 లక్షల నష్టం వాటిల్లుతోందని అంచనా. దిగిరాని చిల్లర ధర తక్కువ ధరలో పౌష్టికాహారాన్ని అందించే కోడిగుడ్లను సామాన్య, మధ్య తరగతి ప్రజలు అధికంగా వినియోగిస్తారు. గుడ్డు రైతు ధరకు 40 నుంచి 50 పైసల వరకు అదనంగా వ్యాపారులు చిల్లరగా అమ్ముతుంటారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. రైతు ధర రూ.2.86 ఉండగా బహిరంగ మార్కెట్లో రూ.4 వరకు అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించిన అనపర్తి, మండపేట పరిసర ప్రాంతాలతో పాటు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తుని, జగ్గంపేట తదితర ప్రాంతాల్లోనూ ఇదే రకంగా అమ్మకాలు జరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో రూ.4.50 నుంచి రూ.5 వరకు కూడా అమ్ముతుండటంతో కొనుగోలు చేసేందుకు సామాన్యులు జంకుతున్నారు. కాగా ఈ ధరాభారంతో స్థానిక వినియోగం తగ్గితే రైతు ధర మరింత పతనమవుతుందని పౌల్ట్రీ వర్గాలు కలవరపడుతున్నారుు. వినియోగదారులకు ఊరటనిస్తున్న చికెన్ రేటు కాగా రిటైల్ మార్కెట్లో చికెన్ ధరలు తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. ఎండల తీవ్రతతో గత రెండు నెలల్లో చికెన్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. బ్రాయిలర్ లైవ్ కిలో రూ.90 ఉండగా మాంసం కిలో రూ.=200కు, స్కిన్లెస్ రూ. 220కు చేరి వినియోగదారుల్ని బెంబేలెత్తించాయి. కొత్త బ్యాచ్‌లు రావడం, శ్రావణమాసంతో వినియోగం తగ్గి ధర తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం బ్రాయిలర్ లైవ్ కిలో రూ.58 ఉండగా, మాంసం రూ.120, స్కిన్లెస్ రూ. 140కు తగ్గిందని చెబుతున్నారు. గత నెలలో రూ.59గా ఉన్న లైవ్ కిలో లేయర్ కోడి ధర ప్రస్తుతం రూ.40కు తగ్గిపోయింది. తాము ఆ మేరకు నష్టపోవాల్సి వస్తోందని కోళ్ల రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. -
బర్డ్‌ఫ్లూ భయం లేదు
* పశుసంవర్థక శాఖ స్పష్టీకరణ * 1.45 లక్షల కోళ్లను పూడ్చిపెడుతున్న అధికారులు * పౌల్ట్రీ రైతుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు * వైద్యారోగ్య శాఖతో సమన్వయం,పజలకు అవగాహన కార్యక్రమాలు * నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం రాక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. తెలంగాణలో ఈ వైరస్ తొలిసారిగా నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూరులోని ఓ పౌల్ట్రీ ఫాంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు పశు సంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం వెల్లడించారు. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తొర్రూరులోని రైతు బాలకృష్ణారెడ్డికి చెందిన పౌల్ట్రీ ఫాంలోని 70 వేల కోళ్లలో ఇటీవల కొన్ని కోళ్లు చనిపోవడంతో అనుమానం వచ్చి భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ ఏనిమల్ డిసీజ్ ల్యాబ్‌కు నమూనాలు పంపించారు. పది నమూనాల్లో ఐదింటికి పాజిటివ్ వచ్చిందని, వాటికి బర్డ్‌ఫ్లూ సోకినట్లు సోమవారం నిర్ధారణ అయిందని వెంకటేశ్వర్లు తెలిపారు. వ్యాధి సోకిన జోన్‌లోని అన్ని కోళ్లను నాశనం చేస్తున్నట్లు తెలిపారు. బాలకృష్ణారెడ్డి ఫాంలోని కోళ్లతోపాటు మరో నలుగురు రైతులకు చెందిన మొత్తం 1.45 లక్షల కోళ్లను చంపేసి పూడ్చి పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. నిఘా జోన్‌లోని 18 గ్రామాల్లోని కోళ్ల శాంపిళ్లను పరీక్షలకు పంపుతున్నట్లు తెలిపారు. నివేదికను బట్టే అక్కడి నుంచి గుడ్లు, కోళ్లను మార్కెట్లోకి అనుమతిస్తామన్నారు. గుడ్లను, మాంసాన్ని 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 20 నిముషాలు ఉడికిస్తే వైరస్ చనిపోతుందన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధి సోకి న ప్రాంతంలో నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందని, వైరస్ ఎలా సోకిందన్న దానిపై పరిశోధించి ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభావిత ప్రాంతం నుంచి గత 20 రోజుల్లో ఏయే ప్రాంతాలకు గుడ్లు సరఫరా అయ్యాయన్న విషయాన్నీ ఆరా తీస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ర్టవ్యాప్తంగా కోళ్ల నుంచి నమూనాల సేకరణ నిరంతరం జరుగుతోందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అనుమానాలున్న పౌల్ట్రీ రైతుల కోసం తమ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 9989998097 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని చెప్పారు. సర్కారు అప్రమత్తం బర్డ్‌ఫ్లూ వ్యాధిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నివారణ చర్యల్లో భాగంగా అత్యవసర సేవా విభాగాలను సన్నద్ధం చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. పశుసంవర్థక శాఖతో సమన్వయం చేసుకుంటూ వైద్య, ఆరోగ్య శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఒకవైపు పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్లను చంపి పూడ్చి పెడుతుండగా మరోవైపు వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగి కోళ్లఫారాల్లోని సిబ్బందికి వ్యాధి నిరోధక మాత్రలను పంపిణీ చేస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఎవరిలోనూ బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించలేదని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూరులోని 10 కిలోమీటర్ల పరిధిలో ఇంటింటినీ పరీక్షించాలని అధికారులు నిర్ణయించారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు బుధవారం ముగ్గురు సభ్యుల రాష్ట్రస్థాయి బృందం తొర్రూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించనుంది. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందించేవిధంగా కార్యాచరణ రూపొందించారు. వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు అపోహలు తొలగించేలా ప్రచారం చేస్తారు. కాగా బుధవారం కేంద్ర బృందం కూడా రాష్ట్రానికి రానుంది. బర్డ్‌ఫ్లూ సోకిన వారిలో జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు, కండరాల నొప్పులు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. -
చికెన్ లెగ్స్ స్వేచ్ఛా దిగుమతులు వద్దు
కేంద్ర ప్రభుత్వానికి నెక్ వినతి హైదరాబాద్: అమెరికా నుంచి ఎలాంటి సుంకాలు లేకుండా చికెన్ లెగ్ పీసుల దిగుమతికి విదేశీ వ్యవహారాల శాఖ ప్రతిపాదించినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలపై నెక్ ఆందోళన వెలిబుచ్చింది. భారత్ నుంచి బాస్మతి బియ్యం, పండ్లు దిగుమతి చేసుకోవడంతో పాటు ఐటీ నిపుణులకు దోహదపడేలా వలస సంస్కరణలను అమెరికా అమలు చేస్తే చికెన్ లెగ్ పీసుల స్వేచ్ఛా దిగుమతికి అనుమతిస్తామని విదేశీ వ్యవహారాల శాఖ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇలా చేయడం వల్ల భారత్‌లోని 50 లక్షల మందికిపైగా పౌల్ట్రీ రైతులు, ఈ పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది తీవ్రంగా నష్టపోతారని నెక్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇతర ఉత్పత్తుల ఎగుమతి కోసం, ఐటీ నిపుణుల ప్రయోజనాల కోసం పౌల్ట్రీ రైతుల జీవితాలను పణంగా పెట్టడం తగదని తెలిపింది. ‘అమెరికా ప్రజలు చికెన్ బ్రెస్ట్‌ను మాత్రమే అధికంగా తింటారు. లెగ్‌పీసులకు గిరాకీ అతి తక్కువ. అక్కడ కిలో చికెన్ ధర 4 డాలర్లు, బ్రెస్ట్ మీట్ 7.9 డాలర్లుగా ఉంది. చికెన్ లెగ్స్‌కు డిమాండు లేకపోవడంతో లెగ్ పీసులను కిలో 40-80 సెంట్ల కంటే తక్కువ రేటుకే ఎగుమతి చేస్తారు. చికెన్ బ్రెస్ట్ విక్రయంతోనే అమెరికా పౌల్ట్రీ రైతులకు తగినన్ని లాభాలు వస్తాయి. లెగ్ పీసులంటే దాదాపు వృథాకిందే లెక్క. ఎలాంటి సుంకాలు లేకుండా వాటిని దిగుమతి చేసుకోవడమంటే దేశీయ పౌల్ట్రీ రంగాన్ని చావుదెబ్బతీయడమే. పౌల్ట్రీ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇస్తుంది. కానీ భారత్‌లో మాత్రం పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. ఈ నేపథ్యంలో చికెన్ లెగ్స్ దిగుమతులపై సుంకాలను తగ్గించవద్దు. అంతేకాదు, దేశీయ పౌల్ట్రీ రైతుల ప్రయోజనాల దృష్ట్యా చికెన్ లెగ్స్ దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకం విధించాలి’ అని ప్రభుత్వానికి నెక్ విజ్ఞప్తి చేసింది.