చికెన్ ముక్కలుడకవ్! | Distressed poultry farmers | Sakshi
Sakshi News home page

చికెన్ ముక్కలుడకవ్!

Published Thu, Oct 31 2013 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM

Distressed poultry farmers

 

 =శనివారం నరకచతుర్ధశి, ఆదివారం దీపావళి
 =ఆ రెండు రోజుల్లో రూ.10 కోట్ల చికెన్ వ్యాపారానికి బ్రేక్
 =వరుస పండుగలతో రెండు నెలలుగా పడిపోయిన అమ్మకాలు
 =నష్టాల్లో పౌల్ట్రీ రైతులు

 
సాక్షి, చిత్తూరు: వరుస పండుగలతో రెండు నెలలుగా జిల్లాలో బ్రాయిలర్ కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో పడింది. సాధారణంగా నెలకు 30 లక్షల కోళ్ల ఉత్పత్తితో రూ.45 కోట్ల టర్నోవర్ జరిగేది. వినాయక చవితి, దసరా, తిరుమల శనివారాల(పెరటాసి నెల)తో రెండు నెలలుగా మాంసాహార వినియోగం తగ్గింది. దీంతో లైవ్ చికెన్ ధరలు పడిపోవడంతో అటు పౌల్ట్రీరైతులు ఇ టు ఇంటిగ్రేటెడ్ హేచరీస్ కంపెనీలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఉత్పత్తి ఎక్కువ, వ్యాపారం తక్కువ కావడంతో పౌల్ట్రీల  నుంచి కోళ్లను కొనేవారు లేరు.

సాధారణంగా దీపావళి సందర్భంగా తొలిరోజు నరకచతుర్ధశి రోజున ప్రజలు మాంసాహారంతో పండుగ జరుపుకుం టారు. ఈ ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 3 లక్షల కోళ్లను(చికెన్) విక్రయం జరుగుతుంది. దా దాపు   ఒక్కరోజే రూ.4.5 కోట్ల వ్యాపారం జరుగుతుంది.  ఈ సారి నరకచతుర్ధశి  శనివారం రావడంతో ఎక్కువమంది ప్రజలు సెంటిమెం ట్‌గా భావించి మాంసాహారం తినే పరిస్థితి లేదు. ఆదివారం కూడా నోముల పండుగ కావడంతో మరో 3 లక్షల కోళ్ల కటింగ్ అగినట్లే. ఈ రెండు రోజుల్లోనే రూ.10 కోట్ల వరకు చికెన్ వ్యాపారం నిలిచిపోనుందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

 పౌల్ట్రీల్లో పడిపోయిన ధరలు

 పౌల్ట్రీల్లో 45 రోజుల పాటు రైతులు బ్రాయిలర్ కోళ్లను పెంచి ఇంటిగ్రేటెడ్ కంపెనీలకు తిరిగి అ ప్పగిస్తారు. ఇందుకు గాను ఒక కోడి (బ్రాయిలర్)పై రెండు నెలల క్రితం కిలోకు రూ.70 చె ల్లించేవారు. ప్రస్తుతం కిలోకు రూ.40 మాత్ర మే చెల్లిస్తున్నారు. దీంతో ఒక కోడిపై రెండు కి లోలకు రూ.60 వరకు నష్టపోతున్నారు. నెలకు 30 లక్షల బ్రాయలర్ కోళ్లు ఉత్పత్తి అయ్యే   జి ల్లాలో నెల రోజులుగా కొనుగోలుదారులు లేక లక్షల కోళ్లు  ఇంటిగ్రేటెడ్ కంపెనీల్లోనూ, పౌల్ట్రీ ఫారాల్లోనే ఉంటున్నాయి. దీంతో పౌల్ట్రీ రై తు లు దాణా, ఇతర ఖర్చులకు కూడా గిట్టుబాటు కాక తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఎక్కువ రోజులు షెడ్లలోని కోళ్లకు దాణావేయలేక పోవడంతో సీఆర్‌డీ, డయేరి యా సమస్యలతో వం దల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.

 పిల్లల పెంపకం ఆపినా పెరగని డిమాండ్

 పౌల్ట్రీల్లో పెంచేందుకు బ్రాయలర్ కోడిపిల్లలను విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్, కో యంబత్తూరు, ఈరోడ్డు నుంచి చిత్తూరు హేచరీస్ కంపెనీలు తెప్పించి రైతులకు అందజేస్తుం టాయి. కంపెనీలతో ఒప్పందం చేసుకున్న రై తులు 45 రోజుల పాటు వీటిని పెంచి బరువు వచ్చిన తరువాత కోతకు కంపెనీలకే తిరిగి అప్పగిస్తారు. పెంచినందుకు గాను కేజీ పైన ఆ రోజు మార్కెట్ రేటు అధారంగా చెల్లిస్తారు. రెం డు నెలల నుంచి వరుసగా పండుగలు, పెరటాసి నెల ఎఫెక్ట్‌తో చికెన్ విక్రయాలు పడిపోయాయి. దీంతో ఇంటిగ్రేటెడ్ హేచరీస్ కంపెనీలు నెలలో ఏడు రోజుల పాటు పిల్లలను సరఫరా చేయకుండా డిమాండ్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి.

అయినా కూడా ఇప్పటికే ఉత్పత్తి అయిన కోళ్లను కొనేవారు లేక కంపెనీల యజమానులు, రైతులు తలలు పట్టుకుంటున్నారు. దాదాపు వెయ్యి మంది రైతులు, పరోక్షంగా మరో 10వేల మంది వరకు కార్మికులు, ఉద్యోగులు కోళ్ల పరిశ్రమలో ఉన్నారు. ప్రస్తు తం   పరిశ్రమలో లేయర్లు(గుడ్డుపెట్టే కోళ్లు)కు మాత్రం కొంత డిమాండ్ ఉంది. బ్రాయిలర్ ఉత్పత్తి, అమ్మకాలు మాత్రం బాగా మందగిం చాయి. దీంతో నెలకు రూ.45 కోట్ల టర్నోవర్ జరిగే కోళ్ల పరిశ్రమ సంక్షోభం ఎదుర్కొంటోంది.
 
 రెండునెలలుగా అమ్మకాలు పడిపోయాయి

 రెండు నెలలుగా పండుగలు, పెరటాసి నెల, అమావాస్య, శుక్ర, గురు, సో మవారాలు వంటి సెంటిమెంట్‌తో చికెన్ కొనేవారు తగ్గారు. దీనికితోడు అవసరానికి మించి కోళ్ల ఉత్పత్తి ఉంటోంది. ఇంటిగ్రేటెడ్ హేచరీస్‌తో పాటు, పౌల్ట్రీరైతులు కూడా సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈసారి నరకచతుర్ధశి శనివారం రావడంతో చికెన్ కొనేవారి సంఖ్య ఆ రోజు దాదాపుగా ఉండదు. మరుసటి రోజు ఆదివారం అయినా గౌరి వ్రతం, నోముల పండుగ కాబట్టి మాంసాహారం తినరు. దీంతో అమ్మకాలు పూర్తిగా తగ్గనున్నాయి.
 -డాక్టర్ పెరుమాళ్,
 పౌల్ట్రీ టెక్నికల్ ఎక్స్‌పర్ట్, చిత్తూరు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement