సాక్షి, ముంబై: తన కోళ్ల ఫారంలోని కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయని అందుకు దాణా అమ్మిన కంపెనీ బాధ్యత వహించాలని ఒక వ్యక్తి పోలీసుస్టేషన్ మెట్లెక్కాడు. ఈ చిత్రమైన సంఘటన పుణేలోని లోణి కాల్భోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసిన కేసు ప్రకారం.. ‘‘ నా కోళ్ల ఫారంలోని కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయి. అహ్మదాబాద్‌లోని ఓ కంపెనీ అమ్మిన దాణా తిన్న తరువాతే కోళ్లు ఈ విధంగా మొండికేశాయి. నాకు న్యాయం చేయండి’ అని ఫిర్యాదులో సదరు ఫాం యజమాని పేర్కొన్నారు. కాగా, ఇలాంటి కేసులే రెండు, మూడు వచ్చాయని, కంపెనీ యజమానులతో చర్చించి నష్టపరిహారం ఇచ్చేలా ఫాం యజమానులు ఒప్పందం కుదుర్చుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసును కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేంద్ర పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment