hens
-
అంతుచిక్కని లక్షణాలతో.. గుడ్లు తేలేస్తున్న కోళ్లు
సాక్షి, భీమవరం/పెరవలి: ఏపీ పౌల్ట్రీల్లో కోళ్ల మృత్యువాత కలకలం రేపుతోంది. అంతుచిక్కని వైరస్‌తో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతుండటం కలవరపెడుతోంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ప్రతి పౌల్ట్రీలో నిత్యం రోజుకు వేలాది కోళ్లు మరణిస్తున్నాయి. గత 15 రోజుల్లో సుమారు 40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు అంచనా. డిసెంబర్లోనే మొదలైన అంతుచిక్కని వైరస్ సంక్రాంతి తర్వాత మరింత విజృంభించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని ఓ పౌల్ట్రీలో ఇప్పటికే 1.60 లక్షల కోళ్లు మరణించాయి. ఆరోగ్యంగానే ఉన్నా క్షణాల్లో మరణం అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ నిర్వాహకులను కలవరపెడుతోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతుండటం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అంతుచిక్కని వైరస్ చాపకింద నీరులా పౌల్ట్రీలకు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో దాదాపు 200 పౌల్ట్రీలు ఉన్నాయి. వీటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.30 కోట్ల వరకు ఉండగా.. రోజుకు 1.05 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 245 షెడ్లలో 1.35 కోట్ల కోళ్లు ఉండగా.. వీటిని 245 షెడ్లలో పెంచుతున్నారు. ఈ జిల్లాలో నిత్యం 1.08 కోట్ల వరకు గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. మొత్తంగా రెండు జిల్లాల్లో గుడ్లు పెట్టే కోళ్లు 2.65 కోట్ల వరకు ఉండగా.. నిత్యం 2.13 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి, నిడదవోలు, నల్లజర్ల, గోపాలపురం, కొవ్వూరు, కడియం ప్రాంతాల్లో పౌల్ట్రీలు ఉన్నాయి. ఇవేకాకుండా మాంసానికి వినియోగించే బ్రాయిలర్ కోళ్లను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నెలకు 12 లక్షలకు పైగా పెంచుతున్నారు. వీటి సంఖ్య ప్రతి 40 రోజులకు మారిపోతుంటుంది. ఊహించని రీతిలో మరణాలు సాధారణంగా డిసెంబర్, జనవరి మాసాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువై కొరైజా, సీఆర్డీ (క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్), రానికెట్ వంటి ఊపిరితిత్తుల సంబంధిత వైరస్లు వ్యాపిస్తుంటాయి. సాధారణంగా ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో పౌల్ట్రీలోని కోళ్ల సంఖ్యలో రోజుకు 0.05 శాతం లోపు కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 20 నుంచి 50 వరకు కోళ్లు చనిపోతుంటే పరిగణనలోకి తీసుకోరు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. కొద్దిరోజుల క్రితం నాటు కోళ్లలో కనిపించిన వింత లక్షణాలు ఇప్పుడు లేయర్, బ్రాయిలర్ కోళ్లకు వ్యాపించాయి. నాటు కోళ్లతో పోలిస్తే లేయర్ కోళ్లకు వ్యాక్సినేషన్ విషయంలో పౌల్ట్రీ వర్గాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. కోడికి 20 వారాల వయసు వచ్చేనాటికి ఐ డ్రాప్స్, నీటిద్వారా, ఇంజెక్షన్ రూపంలో దాదాపు 23 వరకు వ్యాక్సిన్లు వేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోళ్లు అంతుచిక్కని లక్షణాలతో మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ వర్గాలను కలవరపరుస్తోంది. కొన్ని పౌల్ట్రీల్లో అసాధారణ రీతిలో కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయి. లక్ష కోళ్లు ఉంటే రోజుకు 3వేల నుంచి 4వేల వరకు చనిపోతున్నాయి. మూడు లక్షల కోళ్లు ఉన్న ఒక పౌల్ట్రీలో వారం రోజులుగా రోజుకు 13 వేల నుంచి 14 వేల వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు ఉంగుటూరు మండలానికి చెందిన రైతు ఒకరు చెప్పారు. బర్డ్‌ఫ్లూ తరహాలోనే.. బర్డ్‌ఫ్లూ తరహాలోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. శీతాకాలంలో వచ్చే వ్యాధులకు భిన్నంగా ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. తెల్లారేసరికి ఎన్ని కోళ్లు ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది వారాల క్రితం కృష్ణా జిల్లాలో అక్కడకక్కడా కనిపించిన ఈ వైరస్ లక్షణాలు తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు విస్తరించినట్టు తెలుస్తోంది. గతంలో బర్డ్‌ప్లూ వచ్చినప్పుడు కోళ్లను పూడ్చిపెట్టిన తరహాలోనే ఇప్పుడు చనిపోయిన కోళ్లను భారీ గోతులు తీసి సున్నం, బ్లీచింగ్, ఉప్పు వేసి పూడ్చిపెడుతున్నారు. పౌల్ట్రీల వద్ద ఫార్మాలిన్ ద్రావణంతో సిబ్బంది కాళ్లు, వాహనాల టైర్లు శుభ్రపరచిన తరువాత మాత్రమే లోపలికి అనుమతిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పతనమవుతున్న గుడ్డు ధర శీతల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకుని డిసెంబర్లో ఫామ్ గేట్ వద్ద రూ.6.30కి అమ్ముడైన గుడ్డు ధర ఎండలు ముదురుతుండటంతో తిరోగమనం బాట పట్టాయి. ప్రస్తుతం ఫామ్ గేట్ వద్ద గుడ్డు ధర రూ.4.62కు చేరింది. ఓ వైపు గుడ్డు ధర పతనమవుతుంటే మరోపక్క అధిక సంఖ్యలో కోళ్ల మరణాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక కోడి చనిపోతే రైతుకు రూ.300 నష్టం వస్తుంది. ఈ మేరకు ఎన్ని కోళ్లు చనిపోతే అంత నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. బ్యాంకు రుణాలు, అమ్మకాలు తగ్గిపోతాయన్న ఆందోళనతో పౌల్ట్రీ వర్గాలు వీటిపై నోరుమెదపని పరిస్థితి నెలకొంది. స్పష్టత ఇవ్వలేకపోతున్న పశు సంవర్థక శాఖ కోళ్ల ఆకస్మిక మరణాలపై పశు సంవర్థక శాఖ పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని, నివేదికలు రావాల్సి ఉందని పశుసంవర్ధక శాఖ ఏలూరు జిల్లా ఇన్చార్జి జేడీ టి.గోవిందరాజు తెలిపారు. ప్రస్తుతం హైలీ వైరల్డ్ ఆర్డీగా భావించి పౌల్ట్రీల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెడుతూ.. మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ముందుజాగ్రత్తలే నివారణ కోళ్లకు సోకుతున్న వైరస్‌లకు మందులు లేవు. ముందుజాగ్రత్తలతోనే నివారణ సాధ్యం. వైరస్ సోకిన కోళ్లు గంటల వ్యవధిలోనే మృత్యువాత పడతాయి. ఒక కోడికి వైరస్ సోకిన నిమిషాల్లోనే మిగిలిన కోళ్లకు వ్యాపిస్తుంది. దీని నివారణకు వైరస్ సోకిన కోళ్లను వేరు చేయటం ఒక్కటే మార్గం. ముందస్తు టీకాలు వేయటం ద్వారానే అరికట్టాలి. కోళ్లలో వ్యాధి నిరోదక శక్తి పెంచేలా చర్యలు తీసుకోవాలి. – చరణ్, పశువైద్యాధికారి, పెరవలి -
భారీ కొండ చిలువ రెండు కోళ్లను అమాంతం మింగి.. ఆతర్వాత..
ఖమ్మం: ఒక కొండ చిలువ దారితప్పి జనావాసాల్లోకి ప్రవేశించింది. అంతటితో ఆగకుండా అక్కడి కోళ్లను మింగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్కడినుంచి వచ్చిందో కానీ.. ఒక కొండ చిలువ కొత్తగూడెంలో ఉంటున్న జావీద్ అనే వ్యక్తి ఇంట్లో ప్రవేశించింది. ఆ తర్వాత అక్కడే ఉన్న రెండు కోళ్లను లటుక్కున మింగింది. ఆ తర్వాత ఎటూ కదల్లేక అక్కడే పడుకుంది. దీన్ని గమనించిన ఆ ఇంటివారు.. పాములను పట్టుకునే వారికి సమాచారం అందించారు. వారు వెంటనే జావీద్ ఇంటికి చేరుకుని కొండచిలువను బంధించారు. ఆ తర్వాత దాన్ని పైకెత్తగానే.. కొండ చిలువ మింగిన కోళ్లను బయటకు కక్కింది. ఆ తర్వాత దాన్ని ఫారెస్టు అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: వామ్మో.. 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి.. -
నా కోళ్లు గుడ్లు పెట్టడం లేదు.. ఆ కంపెనీపై కేసు పెట్టండి
సాక్షి, ముంబై: తన కోళ్ల ఫారంలోని కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయని అందుకు దాణా అమ్మిన కంపెనీ బాధ్యత వహించాలని ఒక వ్యక్తి పోలీసుస్టేషన్ మెట్లెక్కాడు. ఈ చిత్రమైన సంఘటన పుణేలోని లోణి కాల్భోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసిన కేసు ప్రకారం.. ‘‘ నా కోళ్ల ఫారంలోని కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయి. అహ్మదాబాద్‌లోని ఓ కంపెనీ అమ్మిన దాణా తిన్న తరువాతే కోళ్లు ఈ విధంగా మొండికేశాయి. నాకు న్యాయం చేయండి’ అని ఫిర్యాదులో సదరు ఫాం యజమాని పేర్కొన్నారు. కాగా, ఇలాంటి కేసులే రెండు, మూడు వచ్చాయని, కంపెనీ యజమానులతో చర్చించి నష్టపరిహారం ఇచ్చేలా ఫాం యజమానులు ఒప్పందం కుదుర్చుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసును కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేంద్ర పేర్కొన్నారు. -
వింత వ్యాధితో కోళ్లు, కాకులు మృతి
సాక్షి, కొత్తపల్లె/పాములపాడు (కర్నూలు): కొత్తపల్లె, పాములపాడు మండలాల్లోని పలు ప్రాంతాల్లో వింత వ్యాధితో కోళ్లు, కాకులు చనిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోళ్లు చనిపోయిన తర్వాత ముక్కులోంచి ఒక రకమైన ద్రవం కారడం, కొన్ని కోళ్లకు చర్మంపై బోడిపెలుగా వచ్చి చర్మం రాలిపోవడం వంటివి జరుగుతున్నాయని బాధితులు చెబుతున్నారు. గురువారం కొత్తపల్లె మండలం సింగరాజుపల్లె గ్రామంలో సంజీవరాయుడుకు చెందిన 50 కోళ్లు మృత్యువాత పడ్డాయి. అదే గ్రామంలో ఐదు కాకులు కూడా మృతి చెందాయి. అలాగే పాములపాడుకు చెందిన నబీరసూల్ అనే రైతు ఇంట్లో నాలుగు, కృష్ణానగర్ గ్రామంలో రామకోటినాయక్ అనే రైతు ఇంట్లో 70 కోళ్లు చనిపోయాయి. చాలా మంది రైతుల ఇళ్లలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ విషయం తమ దృష్టికి రాలేదని పాములపాడు పశువైద్యాధికారి భాస్కర్ తెలిపారు. -
దేశంలో కొత్త విపత్తు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్ ఫ్లూ) వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. పక్షులకు ప్రాణాంతకమైన ఈ హెచ్5ఎన్1 వైరస్ కారణంగా రాజస్తాన్, కేరళ, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో గణనీయమైన సంఖ్యలో వివిధ రకాల పక్షులు చనిపోతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి కారణంగా అడవి బాతుల (వైల్డ్ గీస్) వంటి వలస పక్షులు చనిపోయినట్లు యంత్రాంగం నిర్ధారించింది. అలాగే రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో కాకులు, కేరళలో బాతులు చనిపోయినట్టు వివిధ వార్తాసంస్థలు తెలిపాయి. హరియాణాలో కొద్దిరోజులుగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడం వెనక కారణాలు ఇంకా తెలియరాలేదు. విపత్తుగా ప్రకటించిన కేరళ కేరళలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో ఈ వైరస్ ప్రభావం కనిపించింది. అలప్పుజ జిల్లాలోని కుట్టనాడ్ ప్రాంతంలో నేదుముడి, తకాళి, పల్లిప్పడ్, కరువత్తా తదితర నాలుగు పంచాయతీలలో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కేరళలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని విపత్తుగా ప్రకటించింది. ఈ కేసులు గుర్తించిన ప్రాంతాలకు ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న పెంపుడు కోళ్లు, బాతులను బుధవారం సాయంత్రం కల్లా చంపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది. ఒక్క కుట్టనాడ్ ప్రాంతంలోనే 34 వేల పెంపుడు పక్షులను చంపాల్సి ఉండగా, కొట్టాయం జిల్లా నీందూర్ పంచాయతీలో 3 వేల పక్షులను ఇప్పటికే చంపినట్లు యంత్రాంగం తెలిపింది. ఈ పంచాయతీలో 1,700 బాతులు వైరస్ బారిన పడి చనిపోయాయి. అలప్పుజ జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతంలో మాంసం, గుడ్ల వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధిస్తూ ఆయా వ్యాపార కేంద్రాల మూసివేతకు ఆదేశించారు. మధ్యప్రదేశ్‌లోనూ.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వారం రోజుల్లో 155 కాకులు వైరస్ కారణంగా చనిపోయాయి. అయితే, ఈ వైరస్ ఇప్పటివరకు పౌల్ట్రీలో సంక్రమించలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాజస్తాన్ నుంచి పక్షుల ద్వారా వైరస్ సంక్రమించినట్టు వచ్చిందని యంత్రాంగం అనుమానిస్తోంది. పొరుగునే ఉన్న రాజస్తాన్‌లోని దాదాపు 16 జిల్లాల్లో 625 పక్షులు చనిపోయినట్టు యంత్రాంగం వెల్లడించింది. ఝాల్వార్, కోటా, బారన్ జిల్లాల్లో వైరస్ జాడలు కనిపించాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో గల పాంగ్ డ్యామ్ సరస్సులో బర్డ్ ఫ్లూ కారణంగా 2,700 వలస పక్షులు చనిపోయాయి. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకడం వల్లే ఈ పక్షులు చనిపోయినట్టు నిర్ధారణయింది. అప్రమత్తమైన రాష్ట్రాలు రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, కేరళలో బర్డ్‌ఫ్లూ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిక జారీ చేశాయి. ఆయా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోవడంతో ఇతర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. కేరళను కలిపే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, తనిఖీలు చేపట్టినట్లు తమిళనాడు తెలిపింది. మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఈ వైరస్ మనుషులకు సోకినట్లు ఆధారాలు లేవని బాధిత రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. -
పందెం కోడికి భలే గిరాకీ
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. మరో మూడు వారాల్లో సంక్రాంతి పండుగ రానే వస్తుంది. పండుగ మరో 20 రోజులు ఉండగానే సంక్రాంతి సరదాలు మొదలయ్యాయి. ఏ రంగుపై ఏ రంగు కోడిని వదలాలి, ఏది గెలుస్తుంది ఏది ఓడిపోతుందనే çముచ్చట్లు మండలంలో మొదలయ్యాయి. క్రితం పండక్కి నా రసంగి, కాకిని నేలకరిపించిందిరా బావ అంటే... నీ రసంగి కాకినే కొట్టింది నా నెమలి అయితే రంగుతో పని లేకుండా నాలుగు పందేలే చేసింది రా బావ అంటూ పందెంరాయుళ్లు ముచ్చట్లు మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా మరో 20 రోజుల్లో సంకాంత్రి సందడి మొదలు కానుండటంతో ఎక్కడ చూసినా కోడిపందేలా ముచ్చట్లే వినబడుతున్నాయి. జాతిపుంజుల కోసం జల్లెడ సంక్రాంతి సమీపిస్తుండటంతో పందెంకోళ్ల కోసం పందెంరాయుళ్లు పరుగులు పెడుతున్నారు. పందెంకోడి కూతపెడితే చాలు చటుక్కున ఆగి బేరసారాలు మొదలెడుతున్నారు. రంగును బట్టి ధర నిర్ణయించి డబ్బులు విసిరేస్తున్నారు. పుంజు నచ్చితే చాలు రేటు గురించి ఆలోచించకుండా చటుక్కున చంకలో పెట్టుకుంటున్నారు. పండుగ మరో 20 రోజులు మాత్రమే ఉండటంతో పందెంకోళ్లను బరుల్లోకి వదిలేందుకు సిద్ధం చేస్తున్నారు. అందుకోసం జీడిపప్పు, పిస్తా, కోడిగుడ్లుతో పాటు మరింత ఖరీదైన మేతలతో కోళ్లను పసిపిల్లల్లా సాకుతున్నారు. రంగును బట్టి పందెకోళ్లకు గిరాకీ ఉండటంతో నచ్చిన కోడిని కొనుక్కునేందుకు పందెంరాయుళ్లు వెనుకడుగు వేయటంలేదు. కాకి, పచ్చకాకి, డేగ, కాకిడేగ, నెమలి, సీతువా, రసంగి, పర్లా, కక్కిరి, మైలా ఇలా రంగులను బట్టి ఒక్కో కోడి రూ.5000 నుంచి రూ.10000 మధ్య పలుకుతుండగా, జాతికోళ్లు అయితే రూ.8000 నుంచి రూ. 15,000 వరకు పలుకుతున్నాయి. అయితే రంగు నచ్చి కోడిపై మోజుపడితే చాలు పందెంరాయుళ్లు వాటిని కొనేందుకు ఏమాత్రం వెనుకాడటంలేదు. సండే మార్కెట్లో సందడి సంక్రాంతి సమీపిస్తుండటంతో సండే మార్కెట్లో సందడి మొదలైంది. మిగిలిన రోజుల్లో కూర కోళ్లకు మాత్రమే గిరాకీ ఉండగా గత రెండు వారాలుగా పందెంపుంజులు మార్కెట్లో కూతలు పెడుతున్నాయి. దీంతో గత రెండు ఆదివారాలుగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పందెంరాయుళ్లు పందెం పుంజుల కోసం సండే మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో చేరతున్నారు. మచిలీపట్నంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పందెంరాయుళ్ళు సండే మార్కెట్లో పందెంకోళ్లు కోసం పడిగాపులు పడుతున్నారు. కోడి రంగు, పోట్లాట, కోడి సైజును బట్టి బేరసారాలు చేసి నచ్చిన పుంజులను పట్టుకుపోతున్నారు. దీంతో బందరు నియోజకవర్గంలో మూడు వారాల ముందుగానే సంక్రాంతి సందడి మొదలైనట్లు కనబడుతుంది. -
భీమవరం పుంజుకు పొగరెక్కువ
సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్): సంక్రాంతి బరిలో ఢీ అంటే ఢీ అనేందుకు కోడిపుంజులు రెడీ అవుతున్నాయి.. రోజూ కఠోర శిక్షణ.. బలవర్ధక ఆహారం.. క్రమతప్పని వ్యాయామంతో కోళ్లను పెంపకందారులు సిద్ధం చేస్తున్నారు.. ముఖ్యంగా భీమవరం పుంజులకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద పండుగకు మరో 20 రోజులే సమయం ఉండటంతో భీమవరం ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పుంజులను పెంపకందారులు సాకుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ నుంచి ప్రముఖులు వచ్చి ఇక్కడ పుంజులను కొనుగోలు చేస్తుంటారు. ఢీ అంటే ఢీ సంక్రాంతి కోడి పందాలకు భీమవరం ప్రాంతం పుంజులు అంటే యమ క్రేజ్ ఉంటుంది. ఈ ప్రాంతంలో కొందరు పుంజులను కేవలం సంక్రాంతి పండుగ పందాలకు మాత్రమే పెంచుతారు. చంటి పిల్లల్లా వాటిని చూసుకుంటూ ఆహారం, వ్యాయామంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటుంటారు. పుంజుల శిబిరాల వద్ద జీతగాళ్లను పెట్టి మరీ వాటిని పెంచుతున్నారు పెంపకందారులు. ఈ ప్రాంతంలో కోడి పుంజులు పెంచడం ఒక రాయల్టీగా ఫీలవుతారు. పర్ల జాతి పుంజు, డేగ పుంజు ఆహారం ఇలా.. పందెం పుంజులకు అందించే ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. మటన్ కైమా, బాదం, జీడిపప్పు, కోడిగుడ్డు, చోళ్లు, గంట్లు, వడ్డు మిశ్రమంగా కలిపి క్రమం తప్పకుండా ఆహారంగా అందిస్తున్నారు. ప్రతిరోజూ మటన్ ఖైమా తప్పనిసరి. ఉదయం బాదం, మటన్ కైమా, సాయంత్రం గంట్లు, చోళ్లు పెడతారు. ఉదయం పుంజులతో ఈత కొట్టిస్తారు. కత్తులు లేకుండా డిక్కీ పందాలు మాదారి పుంజులు తలపడేలా చూస్తుంటారు. దీని ద్వారా పుంజు సామర్థ్యాన్ని పెంపకందారులు అంచనా వేస్తారు. ప్రత్యేక ఆవాసాలలో(గూళ్లు) వీటిని ఉంచుతారు. ఎండ, వాన, చలి నుంచి రక్షణ కలి్పంచేలా ఏర్పాట్లు చేస్తారు. 3 నెలలు.. రూ.15 వేలు ఖర్చు కోడిపుంజు పందానికి సిద్ధం చేయడానికి మూడు నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. ఈ కాలంలో వీటికి అందించే ఆహారం, భద్రత తదితరాల కింద పెంపకందారులు రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేస్తారు. ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా మంచి సామర్థ్యం ఉన్న పుంజులను సిద్ధం చేయడమే లక్ష్యంగా వీరు పనిచేస్తుంటారు. భీమవరం ప్రాంతంలో కోడి పుంజుల పెంపక కేంద్రం, బలవర్ధక ఆహారం ఇదే.. భీమవరం పుంజుకు పొగరెక్కువ భీమవరం పుంజుకు పొగరే కాదు ధర కూడా ఎక్కువే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు ఇక్కడకు వచ్చి పుంజులు కొనుగోలు చేస్తుంటారు. రకాన్ని బట్టి కోడి ధర రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. పందెంరాయుళ్లు ముందుగా వచ్చి వారికి కావాల్సిన రకం బట్టి కొంత అడ్వాన్సు ఇచ్చి మరీ వెళుతుంటారు. దీంతో సంక్రాంతి సీజన్‌కు ముందు పెంపకందారులకు పుంజులు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. రకాలు పచ్చకాకి, నల్ల నెమలి, పింగలి, సేతువా, కక్కరాయి (ఎరుపు, నలుపు రకాలు), అబ్రాస్ (తెలుపు, ఎరుపు రకాలు), మైల (ఎరుపు, నలుపు రకాలు, డేగ, పండు డేగ, నల్ల బొట్టుల తేతువా, గేరువా, రసంగి(ఎరుపు, తెలుపు రకాలు), పెట్టమర్రు, కాకి డేగ పర్ల, పర్ల రకాలు ఎక్కువుగా పందాలకు వినియోగిస్తుంటారు. -
కోళ్లకు కూడా టికెట్ ఇవ్వాలంటూ..
యశవంతపుర : బస్సులో ప్రయాణించే చిన్నారులకు అరటికెట్ తీసుకోవడం సాధారణం. అయితే కోళ్లకు కూడా అర టికెట్ తీసుకోవాల్సిందేని కండక్టర్ ఒత్తిడి చేయడంతో ఓ ప్రయాణికుడు తన కోళ్లను తీసుకొని మధ్యలోనే బస్సు దిగి వెళ్లిపోయాడు. ఈ ఘటన దక్షణ కన్నడ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఉప్పినంగడి సమీపంలోని కుప్పెట్టికి చెందిన వ్యక్తి శిరాడి కారణికలోని ప్రసిద్ద దేవస్థానంలో మొక్కులు తీర్చుకునేందుకు బుధవారం రెండు కోళ్లను కొన్నాడు. వాటిని తీసుకొని సంచిలో ఉంచుకొని ఉప్పినండి–సకలేశపురల మధ్య సంచరించే కేఎస్ఆర్టీసీ బస్ ఎక్కాడు. అయితే రెండు కోళ్లను చూసిన కండక్టర్ వాటికి అరటికెట్ తీసుకోవాలని, ఒక్కో కోడికి రూ. 77 చొప్పున రూ. 154 చెల్లించాలని సూచించాడు. ఇద్దరి మధ్య తీవ్రమైన వాదులాట జరిగింది. ప్రాణంతో ఉన్న కోళ్లను తీసుకెళ్లాలంటే తప్పని సరిగా టికెట్ తీసుకోవాలని, ఇదీ ప్రభుత్వం అదేశామని కండక్టర్ తెల్చి చెప్పాడు. దీంతో ఆ ప్రయాణికుడు మధ్యలోనే బస్సు దిగి వెళ్లాడు. -
కోళ్లను మింగిన కొండ చిలువ
గుంటూరు, తాడేపల్లిరూరల్ :వనాలు, కొండల్లో సంచరించే కొండ చిలువ ఒకటి ఉండవల్లి గ్రామంలోకి ఆదివారం తెల్లవారు జామున ప్రవేశించింది. ఓ ఇంటి వరండాలో ఉన్న నాలుగు కోళ్లనుమింగేసింది. ఆ తర్వాత అక్కడే ఉన్న మేకను మింగేందుకు ప్రయత్నించింది. అలికిడికి నిద్ర లేచిన ఇంటిలోని సభ్యులు కొండ చిలువను ఒక్కసారిగా చూసి భయాందోళనకు గురయ్యారు. కొండ చిలువ మింగిన నాలుగు కోళ్లను వారి ఎదుట బయటకుఊసివేయడంతో భయంతో వణికిపోయారు. ధైర్యం చేసిన ఇంటి యజమానికొండ చిలువను మట్టుబెట్టాడు. అది సుమారు 10 అడుగుల పొడవు ఉండడంతో స్థానికులు ఆసక్తిగా గమనించారు. -
కాసుల కోడి ఐడియా
ఉత్తర కర్ణాటకలోని ఒక గ్రామం ఇప్పుడు పల్లె విజయాలకు ప్రతీకగా నిలుస్తోంది. వ్యవసాయంలో నష్టాలు మూటగట్టుకుని దిగాలుగా ఉన్న పల్లెలో ఒక కోడి కొత్త వెలుగులు నింపింది. గిరిరాజ కోళ్ల పెంపకంతో వందల కుటుంబాలు ఉపాధి పొందడం విశేషం. ఒకరితో ఆరంభమైన ఈ విజయం గ్రామం తలరాతను మార్చేసింది. దొడ్డబళ్లాపురం: ధార్వాడ జిల్లాలోని ఆ గ్రామంలో గ్రామస్తులు చాలా ఏళ్ల నుండి బాయిలర్ కోళ్ల పెంపకంతోనే జీవితం నెట్టుకొస్తున్నారు. చాలామంది తమ పొలాల వద్ద వ్యవసాయంతో పాటు కోళ్లఫారాలు నిర్మించుకుని బాయిలర్ కోళ్లు పెంచుతూ ఆదాయం గడిస్తున్నారు. వారికి వ్యవసాయం కన్నా కోళ్ల పెంపకంతోనే ఆదాయం ఎక్కువట. అబ్దుల్ ఆరంభించాడు ధార్వాడ జిల్లా మిశ్రికోటి అనే గ్రామంలో ఇప్పుడు గిరిరాజ కోళ్లు, రాజశ్రీ కోళ్లు పెంపకందారుల పాలిట బంగారు గుడ్లు అంతటి లాభాలనిస్తున్నాయి. గ్రామవాసులు కోళ్ల పెంపకంతో లబ్ధి పొందడం వెనుక అబ్దుల్ అనే పౌల్ట్రీ రైతు కృషి ఉంది. అబ్దుల్ సంవత్సరం క్రితం పశుపాలన శాఖ నిర్వహించిన సదస్సులో గిరిరాజ కోళ్ల పెంపకంపై శిక్షణ తీసుకున్నాడు. మొదట అనుమానంతోనే అబ్దుల్ 20 గిరిరాజ కోళ్లను కొని పెంచడం ప్రారంభించాడు. పెద్దగా జాగ్రత్తలు తీసుకోకుండానే అవి సులభంగా పెరిగి ఊహించినదాని కంటే ఎక్కువగా ఆదాయం తెచ్చిపెట్టసాగాయి. దీంతో ఆయన మరో 50 కోడి పిల్లలను ఖరీదుచేసి పెంచసాగాడు. అప్పటి వరకూ కేవలం బాయ్లర్ కోళ్లను మాత్రమే చూసిన గ్రామస్తులు గిరిరాజ కోళ్ల ఫలితాలను చూసి ఆశ్చర్యపోయారు. వారు కూడా ఆ కోళ్లను లబ్దుల్ వద్దే ఖరీదు చేయడం ప్రారంభించారు. అబ్దుల్ ఇప్పుడు పెద్ద ప్రమాణంలో గిరిరాజ కోళ్లు పెంచేందుకుగాను పెద్ద ఫారం కూడా నిర్మించాడు. అతి తక్కువ కాలంలోనే గిరిరాజ కోళ్లు 10 – 15 కేజీల వరకూ బరువు పెరుగుతాయి. ఎక్కువ మాంసం, గుడ్లు...ఎక్కువ లాభాలు మాంసం, గుడ్లు రెండూ ధర ఎక్కువయినా జనం వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా వీటి పోషణ చాలా సులభం. పెద్దగా జాగ్రత్తలు పాటించకపోయినా నాటు కోళ్లకు మల్లే ఆహారాన్ని బయటే సేకరించి తింటాయి. 5 నెలల తరువాత ఇవి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి.ఒక విడతకు 100 నుండి 150 గుడ్లు పెడతాయి.అబ్దుల్ సమాచారం ప్రకారం 7 కేజీలు ఉండే పుంజు రూ.800లు పలుకుతుందట. గిరిరాజ జాతి పెట్ట కోడి 40 వారాలలో 3 నుండి 4 కేజీలు, పుంజు 4 నుండి 5 కేజీలు పెరుగుతుందట. వీటి గుడ్డు కూడా ఒక్కోటి 55 గ్రాముల బరువు ఉండి రూ.10 ధర పలుకుతుందట. అబ్దుల్ ప్రస్తుతం హైదరాబాద్ నుండి రాజశ్రీ అనే జాతి కోళ్ల నుకూడా వీటితో పాటు పెంచుతున్నారు. -
కోళ్లకూ భానుడి ఎఫెక్ట్
జిల్లాలో మండుతున్నఎండలు కోళ్ల రైతులకుఊపిరాడకుండా చేస్తున్నాయి. ఫారాల్లోని కోళ్లు ఎండ ధాటికి పిట్టల్లా రాలిపోతున్నాయి. వ్యయప్రయాసల కోర్చి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. గత నెల 30వ తేదీన ఎండ 43 డిగ్రీలుగా నమోదైంది. ఆ రోజు ఎండతీవ్రతను తట్టుకోలేక జిల్లాలో మూడు వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. కొడవలూరు: ఈ ఏడాది వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండటంతో జిల్లాలో రోజుకు వెయ్యి నుంచి రెండువేల కోళ్లు దాకా చనిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత మరో నెల ఇదేవిధంగా కొనసాగుతూ మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతుండటంతో కోళ్ల రైతులు అయోమయంలో పడ్డారు. జిల్లాలో మూడు లక్షల కోళ్లు జిల్లాలోని కొడవలూరు మండలం తలమంచి, కోవూరు మండలం పాటూరు, నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ, అల్లీపురంలో కోళ్ల ఫారాలున్నాయి. వీటన్నింటిలో సుమారు మూడు లక్షల కోళ్లు ఉన్నాయి. వీటిలో సింహభాగం తలమంచిలోనే 1.50 లక్షల కోళ్లున్నాయి. గుడ్లు ఉత్పత్తి లక్ష్యంగా వీటిని కోళ్ల ఫారాల్లో పెంచుతున్నారు. రోజుకు సగటున రెండు లక్షల గుడ్లు దాకా జిల్లాలోని కోళ్ల ద్వారానే ఉత్పత్తి చేస్తున్నారు. రోజుకు 10 లక్షల గుడ్లు దాకా జిల్లాలో వినియోగం ఉన్నా, మిగిలిన గుడ్లను హైదరాబాద్, విజయవాడ, తమిళనాడులోని నమ్మకల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ముందు జాగ్రత్తలు ♦ ఎండ తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడకుండా వ్యయ ప్రయాసలకోర్చి రైతులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోళ్ల ఫారం చుట్టూ గోతపు పట్టలు కప్పి నిత్యం వాటిని నీటితో తడుపుతున్నారు. ♦ పైకప్పు రేకులపై స్పింక్లర్లు ఏర్పాటు చేసి ఎండ సెగను తగ్గించేందుకు యత్నిస్తున్నారు. ♦ కోళ్ల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన చానల్స్‌లో నీళ్లు నిల్వ ఉండకుండా నిత్యం సరఫరా అయ్యేలా చూస్తున్నారు. ♦ ఎండకు కోళ్లు మేత తక్కువగా తింటుండడంతో గుడ్ల పరిమాణం తగ్గుతోంది. దీనిని పెంచేందుకు హైప్రొటీన్, హై ఎనర్జీ, ఎక్స్ట్రా కాల్షియం, గ్లూకోజ్‌లు అదనంగా ఇస్తున్నారు. ♦ కోళ్ల ఫారాలు లోపల వేడిని తగ్గించేందుకు నీటిని మంచు వలె చల్లే ఫాగర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫారాల్లో ప్రత్యేక ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తీవ్ర నష్టమే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ నష్టాన్ని నివారించలేకపోతున్నారు. రోజుకు సగటున జిల్లాలో వెయ్యి కోళ్లు దాకా మృతి చెందుతున్నాయి. ఏప్రిల్ 30వ తేదీన ఎండ తీవ్రమవ్వడంతో తలమంచిలోనే వెయ్యి కోళ్లు మృతి చెందాయి. మిగిలిన అన్ని చోట్ల కలిపి రెండు వేల దాకా మృతి చెందాయి. పాటూరులో 30 వేల కోళ్లకు గానూ ఆ ఒక్క రోజే 500 మృతి చెందాయి. తగ్గిన గుడ్ల ఉత్పత్తి ♦ రోజుకు రెండు లక్షల గుడ్ల ఉత్పత్తి రావాల్సి ఉండగా, కేవలం 1.50 లక్షల గుడ్ల ఉత్పత్తే వస్తోంది. ♦ చిన్న పరిమాణం గుడ్లు 50 శాతం ఉంటున్నాయి. పరిమాణం పెద్దగా ఉంటే రూ.3.50 పైసల వంతున విక్రయిస్తున్నారు. చిన్నవిగా ఉంటే మాత్రం రూ.2.50 పైసల వంతునే విక్రయించాల్సి వస్తోంది. ♦ వేసవి పరిస్థితుల దృష్ట్యా గుడ్డు ధర పెంచాలంటే ధర నిర్ణయం రైతుల చేతుల్లో లేదు. దేశ వ్యాప్త మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ముంబయిలో ధర నిర్ణయం జరుగుతోంది. దీనికితోడు వేసవిలో జిల్లాలోనూ గుడ్ల వినియోగం తగ్గుతోంది. సాధారణం కంటే 10 నుంచి 15 శాతం వినియోగం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ధర పెంచడం కుదరదని ధర నిర్ణేతలే ప్రకటిస్తున్నారు. పెరిగిన బ్రాయిలర్ కోళ్ల మృతుల శాతం ఫారాల్లో మాంసం కోసం పెంచే బ్రాయిలర్ కోళ్లకూ వేసవి షాక్ తగులుతోంది. వీటి మృతుల సంఖ్య వేసవిలో గణనీయంగా పెరుగుతోంది. సాధారణ పరిస్ధితుల్లో వీటి మరణాలు 4 నుంచి 5 శాతం ఉంటే వేసవిలో 10 నుంచి 15 శాతం ఉంటున్నాయి. ఫలితంగా వీటి మాంసం ధర గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో నెలకు ఆరు లక్షల కోళ్లు అవసరం ఉంది. ఒక్క కోడి నుంచి సగటున రెండు కిలోల మాంసం వస్తుంది. ఈ లెక్కన జిల్లాలో నెలకు ఆరు లక్షల కిలోల బ్రాయిలర్ మాంసం అవసరం ఉంది. వేసవిలో వీటి మరణాలు అధికంగా ఉండటంతో వేసవి కాలంలో జిల్లాలో వీటి పెంపకాన్ని పూర్తిగా వదిలేశారు. ప్రస్తుతం జిల్లాకు అవసరమైన బ్రాయిలర్ కోళ్లను చిత్తూరు జిల్లా పలమనేరు, తమిళనాడులోని కృష్ణగిరి, కర్ణాటకలోని కోలార్ నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాకు అవసరమైన కోళ్లన్నీ ఇతర ప్రాంతాల నుంచి వస్తుండడంతో రవాణాలోనే మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. మే, జూన్ మాసాల్లోనైతే 15 శాతానికి తగ్గకుండా మరణాలుంటున్నాయి. ఫలితంగా వీటి మాంసం ధర వేసవిలో ఆకాశాన్నంటుతోంది. గురువారం కిలో బ్రాయిలర్ మాంసం చర్మంతో కలిపి రూ.176 ఉండగా, చర్మం లేకుండా(స్కిన్లెస్) రూ.208గా ఉంది. -
యుద్ధానికి సిద్ధమైన పందెం కోళ్ళు
-
హైవేపై వేలాది కోళ్లు... ట్రాఫిక్ జాం
-
హైవేపై వేలాది కోళ్లు... ట్రాఫిక్ జాం
ఆస్ట్రియా: వియన్నాలో మంగళవారం ఉదయం వింత ఘటన చోటు చేసుకుంది. దేశరాజధానిని కలిపే రహదారిపై వేలాది కోళ్లు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆస్ట్రియా దేశం ఉత్తరాన ఉన్నల లింజ్ వద్ద ఈ సంఘటన జరిగింది. కోళ్ల లోడుతో వెళ్తున్న ఓ లారీ లింజ్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులోని వేలాది కోళ్లలో కొన్ని చనిపోగా మరికొన్ని రోడ్డుపైకి చేరాయి. 160 మీటర్ల వెడల్పు ఉన్న ఆ రోడ్డు కోళ్లతో నిండిపోయింది. సుమారు ఏడువేల కోళ్లు రోడ్డుపైకి చేరడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక వాహనదారులు వాహనాలు నిలిపేసి వాటిని ఆసక్తికరంగా తిలకించసాగారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు కోళ్లను పక్కకు తప్పించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. -
30వరకూ కోళ్లకు ఉచితంగా టీకాలు
అనంతపురం అగ్రికల్చర్ : పెరటికోళ్లకు కొక్కెర, బొబ్బతెగుళ్ల నివారణకు శుక్రవారం నుంచి ఉచితంగా టీకాలు కార్యక్రమం ప్రారంభమైందని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథఠాగూర్, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ డాక్టర్ ఎన్.రామచంద్ర శుక్రవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఈనెల 30వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. గడువులోగా 6 లక్షల పెరటికోళ్లకు టీకాలు వేయడంతో పాటు డీవార్మింగ్ మందులు కూడా తాపుతామన్నారు.ఈ అవకాశాన్ని గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
గోదావరి బరి.. పాతబస్తీ కోడి
సంక్రాంతి సమరానికి సన్నద్ధం పుంజు ధర రూ.1.5 లక్షలు! చాంద్రాయణగుట్ట: సంక్రాంతి సమరానికి పాతబస్తీ కోడిపుంజులు కాలు దువ్వుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కత్తులు దూసేందుకు సిద్ధమవుతున్నాయి. పండుగ వేళ పందెంలో మజా పొందాలంటే పాత బస్తీ పుంజులు ఉండాలని పందెం రాయుళ్లు కోరుకుంటారు. కుస్తీ పోటీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఇక్కడి పహిల్వాన్లు.. కోడిపుంజులను సైతం ఎంతో శ్రద్ధగా పెంచుతారు. వాటికి శిక్షణ సైతం ఇస్తారు. అందుకే ఇక్కడి పుంజులంటే అంతే మో జు. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు పెద్ద ఎత్తున నిర్వహించడం తెలిసిన విషయమే. ఈ రెండు జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా పందేలు జరుగుతుంటాయి. కోట్ల రూపాయలు చేతులు మారే పోటీల్లో పందెంరాయుళ్ల పంట పండించే కోడిపుంజులు పాతబస్తీ నుంచి ఎగుమతి కావడం విశేషం. అందుకే పాతబస్తీ కోడి పుంజుకు లక్షల రూపాయలు వెచ్చించేందుకు వెనుకాడరు. కాస్ట్లీ ఫుడ్డు.. మసాజ్.. పహిల్వాన్లు పెంచే కోడి పుంజులకు విటమిన్స్‌తో కూడిన ఆహారాన్ని అందిస్తారు. బాదం, పిస్తా, ఆక్రోట్స్, కీమా, ఉడికించిన గుడ్ల తెల్లసొన ఆహారంలో భాగం. తిండి పెట్టి సరిపెట్టరు.. ప్రతి కోడికి నిత్యం ప్రత్యేకంగా పందెం శిక్షణ ఇస్తూ కదనరంగంలో దూకేలా తర్ఫీదునిస్తారు. అందుకోసం ప్రత్యేక కోచ్‌లను సైతం నియమిస్తారు. వారు పుంజులకు మసాజ్ చేయడం, పరిగెత్తడం, ఈత వంటి వాటిలో శిక్షణనిస్తారు. బార్కాస్, కొత్తపేట, ఎర్రకుంట తదితర ప్రాంతాలలోని కొంత మంది ఫహిల్వాన్ల వద్ద మాత్రమే ఇలాంటి కోడిపుంజులున్నాయి. వీరు పరిమిత సంఖ్యలో కోళ్లకు మాత్రమే ఈ శిక్షణనిస్తారు. అందుకే ఇక్కడి పుంజులకు ఎంత రేటైనా పెట్టేందుకు సిద్ధమవుతారు. నచ్చిందంటే లక్షలు పెట్టాల్సిందే.. కోస్తాంధ్ర, రాయలసీమలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాల కోసం పందెం రాయుళ్లు బార్కాస్‌లో వాలిపోతుంటారు. ఇక్కడి పహిల్వాన్ల వద్ద నుంచి పుంజు తీసుకెళితే పందెంలో విజయం తథ్యమని చాలామంది నమ్మకం. జాతి, రంగును బట్టి ఒక్కో కోడిపుంజు ధర రూ.50 వేల నుంచి లక్షన్నర రూపాయల వరకు పలకడం విశేషం. అలాగని వీరు కోళ్ల వ్యాపారం చేస్తారనుకుంటే పొరపాటే. ఎంతో దగ్గరి వ్యక్తులకు మాత్రమే ఏడాదికి పరిమిత సంఖ్యలో కోడిపుంజులను విక్రయిస్తుంటారు. ఈ కోళ్ల కోసం ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు ఏర్పాటుచేసి పెంచుతారు. రెండేళ్ల వయసున్న పుంజులనే పందానికి వినియోగిస్తారు -
పెరటికోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం
నాగారం(కోనరావుపేట) : పెరటికోళ్ల పెంపకంతో మహిళలు అదనపు ఆదాయం పొందవచ్చని సర్పంచ్ గోపాడి జ్యోతి, బీజేపీ అధ్యక్షుడు సురేందర్‌రావు అన్నారు. నాగారంలో ఎస్సీ మహిళలకు ఆదివారం పెరటి కోల్లు పంపిణీ చేసి మాట్లాడారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు సహకారంతో గ్రామంలోని 750 కుటుంబాలకు పెరటికోళ్లు పంపిణీ చేశారన్నారు. తొలివిడతలో ఒక్కో కుటుంబానికి 20 కోడిపిల్లలు అందజేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు సైండ్ల రాజు, కీసరి మురళి, బొడ్డు విమల, మ్యాకల రవి, తీగల గంగవ్వ, గడప విజయలక్ష్మి, బాస సునీత, యూత్ సభ్యులు ఊరడి మధు, ఇల్లెందుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బర్డ్ ఫ్లూ... బహుపరాక్
- ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలి - పశుసంవర్థక శాఖ సంయుక్త - సంచాలకులు వెంకయ్య నాయుడు పోచమ్మమైదాన్ : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడంతో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోయూరుు. ఈ విషయమై అప్రమత్తమైన పశుసంవర్థక శాఖ ఇప్పటికే నివారణ చర్యలు చేపట్టింది. ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేం దుకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, సూచనలు చేసింది. ఈ సందర్భంగా బర్డ్ ఫ్లూ లక్షణాలు-నివారణ కు తీసుకోవాల్సిన చర్యల గురించి పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు వెంకయ్య నాయుడు వివరించారు. జిల్లాలో 48.83 లక్షల కోళ్లు ఉన్నాయ ని, బర్డ్ ఫ్లూ వ్యాధి అన్ని జాతుల కోళ్లు, బాతులకు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మనుషులపైనా దీని ప్రభావం ఉంటుందని చెప్పారు. అరుు తే జిల్లాలో ఇప్పటి వరకు ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి లక్షణాలు బయటపడలేదని, అరుునా కోళ్ల ఫారాల యజమానులు, పెంపకం రైతులు, చికెన్ షాప్ యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బర్డ్ ఫ్లూ లక్షణాలు - ముక్కు, నోటి నుంచి ద్రవాలు కారుతూ సాధార ణ జలుబు లక్షణాలు కనబతారుు. - తల కొప్ప, వాటిల్స్, నీలం రంగుగా మారి కనపడుతుంది. - కాళ్ల మీద వాపు వచ్చి ఎర్రగా మారతాయి. - వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పచ్చగా విరేచనాలు, రక్తంలా ద్రవాలు నోటి నుంచి ముక్కు నుంచి కారతాయి. -కోళ్ల ఫారంలో, చికెన్ షాపులలో పనిచేసే వ్యక్తుల కు వ్యాధి సోకిన కోళ్ల పేడ ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. మనుషులలో సాధారణ జలుబు లక్షణాలుండి జ్వరం వస్తుంది. కోళ్ల ఫారం యజమానులకు - రంగారెడ్డి ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలింది. అక్కడి నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవద్దు. -కోళ్లను నిరంతరం గమనిస్తూ ఉండాలి. బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. -ఫారంలో పని చేసే వ్యక్తులు పరిసరాలు, వాహనాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. -చికెన్ షాప్ యజమానులకు.. -వ్యాధి సోకిన కోళ్లను ఫారాల నుంచి కొనుగోలు చేయవద్దు. -చికెన్ షాప్ వ్యర్థాలను సక్రమంగా కాల్చివేయడం లేదా బొంద తీసి పాతి పెట్టాలి. -షాప్‌లో పని చేసే వ్యక్తులు, కోళ్లను తీసుకువచ్చే వాహనాలతోపాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. -
సినీమృగాయణం!
నేడు జంతు హక్కుల దినోత్సవం ఆ రోజు అడవిలో జంతువులన్నీ చేరి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాయి. ‘‘సినిమా సక్సెస్ కావాలంటే నేనో, నా గురించి పాటో ఉండి తీరాల్సిందే’’ అంది కోడి. ‘‘అదెలా?’’ అడిగింది బాతు. ‘‘ఓసోసీ పిల్లకోడి పెట్టా... అనీ, బంగారు కోడి పెట్ట వచ్చెనమ్మా... అనే పాటల వల్లనే ఆ సినిమాలు హిట్టయ్యాయి. ఆ సెంటిమెంట్ కొద్దే మగధీరలో కోడి పాట మళ్లీ పెట్టారు. దీన్నిబట్టి కోళ్లు అంటేనే బ్లాక్‌బస్టర్ ఫార్ములా అని తెలీడం లేదూ!’’ అంది కోడి. ‘‘చాల్లే ఊరుకో... బంగారూ బాతుగుడ్డూ... అంటూ మా జాతిని తలుచుకోబట్టే వేటగాడు హిట్టయ్యింది. ఫో... ఫో... నీ బోడి గొప్పలూ, నువ్వూనూ’’ అంటూ ఈసడించింది బాతు. ‘‘మీ ఇద్దరూ తప్పే... ఓసోసీ పిల్లకోడి పెట్టా... అన్న పల్లవిలో వెంటనే ‘నా వయ్యారీ పావురాయి పిఠ్ఠా’ అంటారు ఎన్టీఆర్. అంటే కోడి ఫోర్సు సరిపోక పావురాళ్లను వాడుకున్నారన్నమాట’’ అంటూ తన గొప్ప చెప్పుకుంటూ వాదనకు దిగింది పావురాయి పిట్ట. ఈలోపు సరసరా పాక్కుంటూ వచ్చింది నాగుపాము. ‘‘సినిమా బ్లాక్‌బస్టర్ కావాలంటే నాగుపాము ఉండి తీరాల్సిందే. ‘నోము’ లాంటి అలనాటి చిత్రాల నుంచి ‘నగీనా’ లాంటి సినిమాల వరకూ అన్నింట్లో నేనుండాల్సిందే. అనకొండ అనీ... అది మాకు దూరబ్బంధువులే! సాక్షాత్తూ హాలీవుడ్ వాళ్లూ మా రిలేటివ్ అయిన దాన్ని పెట్టి సినిమాలు తీస్తుంటారు తెల్సా’’ అంటూ కస్సు ‘బుస్సు’మంది పాము. ‘‘విలన్ అబద్ధాలకు నీ రెండు నాల్కలను ఉదాహరణగా చూపిస్తారు. ఫో... ఫో... నీ గొప్పలూ నువ్వూనూ’’ అంటూ విసుక్కున్నాయి పిట్టలు. ‘‘అలనాటి రాజుల సినిమాల నుంచి ఇవ్వాళ్టి మగధీర వరకూ హార్స్ ఉందంటే సినిమాలో ఫోర్స్ ఉన్నట్లే’’ అన్నాయి గుర్రాలు. ఇంతలో గాండ్రిస్తూ సీన్లోకి ఎంటరైంది పులి. ‘‘ఆగండాగండి. ఎంత పెద్ద హీరో అయినా నాతో పోల్చుకోవాల్సిందే. ‘పులితో ఫొటో దిగాలనుకున్నావనుకో కాస్త రిస్కయినా పర్లేదు గానీ... చనువిచ్చింది కదా అని పులితో ఆడుకున్నావనుకో...’ అంటూ నాతో గేమ్సాడితే జరిగే పరిణామాలను చెప్పకనే చెబుతాడు హీరో’’ అంటూ తన గొప్పల్ని చెప్పింది పులి. ‘‘ఆపండెహె మీ గోల. మీ అందరికంటే నేనే గొప్ప. మాతో పోల్చుకుంటూ హీరో ఏమంటాడో తెల్సా... ‘అడవిలో సింహం... ఇక్కడ నేనూ సేమ్ టు సేమ్ రా. అది గెడ్డం చేసుకోదు... నేను గెడ్డం చేసుకుంటానంతే’ అంటాడు. దీన్నిబట్టి తెలిసేదేమిటి? సింహం ప్రస్తావన ఉంటేనే సినిమాకు సింహబలమొస్తుందన్నమాట’’ గొప్పలు పోయింది సింహం. ఈలోపు బొద్దింక గొంతు సవరించుకుంది. అంతే... అక్కడున్న జంతువులన్నీ ఒక్కసారిగా నవ్వాయి. ‘‘నీకు ఇక్కడ మాట్లాడే సీన్ లేదు. ఫో’’ అంటూ కసురుకున్నాయి జంతువులు. ‘‘మీరంతా మీ ఇండివిడ్యువల్ గొప్పలు చెప్పుకొన్నారు. నేనలా కాదు... ప్రేమే నా మార్గం. సీన్లో నేను కనబడీ కనబడగానే హీరోయిన్ ఎగిరి హీరో అక్కున చేరి ముద్దుముద్దుగా...‘బొద్దింక... అదంటే నాకు భయం’ అంటుంది. అంతే...! అప్పటివరకూ హీరో హీరోయిన్ల మధ్య సెలైంట్‌గా లేటెంట్గా ఉన్న ప్రేమ కాస్తా పెల్లుబికి డ్యుయెట్‌లా పారుతుంది. ఇలా పాట పెట్టడానికి డెరైక్టర్‌కి అవకాశం ఇచ్చేది ఎవరో తెల్సా? నేనే’’ అంటూ మీసాలు తిప్పింది బొద్దింక. ఆ మాటకొస్తే... తన టైటిల్ తోనే తనపై ఫుల్ లెంత్ సినిమా తీశారని ఈగా, ఐశ్వర్యా రాయ్ మెప్పు కోసం సాక్షాత్తూ రోబోయే తమను పట్టుకోడానికి అవస్తలు పడ్డాడని దోమలు సైతం సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాయి. ‘‘ఇలా ఎవరి గొప్పలు వాళ్లమే చెప్పుకుంటూ పోతే ఎలా? మన గొప్పను సినీరంగమూ గుర్తించాలి కదా. అందుకు ఏం చేయాలో నక్కను అడుగుదాం. అందరిలోకీ తెలివైనది అదేకదా’’ అని ఒక నిర్ణయానికి వచ్చాయి జంతువులన్నీ. సరే అని నక్క తన సలహా ఇలా చెప్పింది... ‘‘మొన్న హుద్‌హుద్ తుఫాను వచ్చినప్పుడు పరిశ్రమలోని పెద్ద సార్లూ, పెద్ద స్టార్లూ, చిన్న నటులంతా ‘మేము సైతం’ అంటూ సహాయం చేశారు కదా. మరి వాళ్ల సినిమాల హిట్ల కోసం మనం సైతం కష్టపడుతున్నాం కదా. కాబట్టి జంతుహక్కుల కోసం వాళ్లు ఏదైనా చేస్తారేమో చూద్దామా? ఎందరు స్టార్లు... సినిమాల్లో తమకు అండగా ఉండే ఈ జంతువుల సంక్షేమం కోసం పాటుపడతారో లేక సామాన్య జనాలే జంతువులకు సాయం చేసి నిజజీవితంలో రియల్ హీరోలవుతారో చూద్దాం! అంటూ ఓ ఊళ వేసింది నక్క. - యాసీన్ -
కోళ్ల ఫారాలకు కోలుకోలేని దెబ్బ!
తుపాన్‌తో ఉత్తరాంధ్రలో 25 లక్షల కోళ్ల మృతి (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఉత్తరాంధ్రలో ఫౌల్ట్రీ పరిశ్రమ హుదూద్ తుపాను దెబ్బకు కోలుకోలేని విధంగా నష్టపోయింది. విషపు గాలుల తీవ్రతకు తుపాను ప్రభావిత నాలుగు జిల్లాల్లో 25 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో భారీ కోళ్ల ఫారాలు సుమారు 200 దాకా ఉన్నాయి. విశాఖ జిల్లా యలమంచిలి నుంచి భోగాపురం వరకూ, విజయనగరంలోని జిల్లాలోని బొబ్బిలి, శృంగవరపుకోట, పూసపాటిరేగ, శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పార్వతీపురం, ఆముదాలవలస ప్రాంతాల్లో ఫౌల్ట్రీ పరిశ్రమలు ఎక్కువగా ఉంది. ఒక్కొక్కరూ రూ.10 లక్షల నుంచి రూ. 25 లక్షల మేర పెట్టుబడులు పెట్టారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకూ పెద్ద ఎత్తున కోళ్లు చనిపోయాయి. మేత, నీరు అందక రోగాల బారిన పడ్డాయి. షెడ్లకున్న రేకులు, తాటాకులు గాలుల తీవ్రతకు ఎగిరిపోయి కోళ్లు వర్షంలో తడిసి అనారోగ్యం బారిన పడ్డాయి. తీరని కష్టమిది.... తుపాను వల్ల ఫౌల్ట్రీ పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లింది. రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకునేందుకు ముందుకు రావాలి. - జీ రామకృష్ణ చౌదరి, విశాఖ జోనల్ చైర్మన్, నెక్ -
ఉభయగోదావరి పందేలకు హైదరాబాద్ నుంచే కోళ్లు