
హైవేపై వేలాది కోళ్లు... ట్రాఫిక్ జాం
ఆస్ట్రియా: వియన్నాలో మంగళవారం ఉదయం వింత ఘటన చోటు చేసుకుంది. దేశరాజధానిని కలిపే రహదారిపై వేలాది కోళ్లు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆస్ట్రియా దేశం ఉత్తరాన ఉన్నల లింజ్ వద్ద ఈ సంఘటన జరిగింది. కోళ్ల లోడుతో వెళ్తున్న ఓ లారీ లింజ్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది.
దీంతో అందులోని వేలాది కోళ్లలో కొన్ని చనిపోగా మరికొన్ని రోడ్డుపైకి చేరాయి. 160 మీటర్ల వెడల్పు ఉన్న ఆ రోడ్డు కోళ్లతో నిండిపోయింది. సుమారు ఏడువేల కోళ్లు రోడ్డుపైకి చేరడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక వాహనదారులు వాహనాలు నిలిపేసి వాటిని ఆసక్తికరంగా తిలకించసాగారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు కోళ్లను పక్కకు తప్పించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.