ఎల్ కేపిటన్‌ను అధిరోహించిన ఆ్రస్టియావాసి
ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు
దాని ఎత్తు 3 వేల అడుగులే. అంటే దాదాపు ఓ కిలోమీటరు. కానీ దాన్ని ఎక్కాలంటే కొమ్ములు తిరిగిన ప్రొఫెషనల్ పర్వ తారోహకులకు సైతం ముచ్చెమటలు పడతాయి. ఎందుకంటే అది నిట్టనిలువుగా ఉండే ఏకశిల! అమెరికాలో కాలిఫోర్నియాలోని యోసెమైట్ నేషనల్ పార్క్‌లో ఉంది. పేరు ఎల్ కాపిటన్. ఆ నిలువు రాతి కొండను ఎక్కాలంటే ప్రొఫెషనల్స్‌కు కూ డా ఎన్నో ఏళ్ల అకుంఠిత పరిశ్రమ, సాధన తప్పనిసరి. అలాంటి కొండను ఎలాంటి తడబాటూ లేకుండా ఏకబిగిన ఎక్కేసింది ఆ్రస్టియాకు చెందిన బాబ్సీ జాంగెర్ల్ అనే 36 ఏళ్ల మహిళ. అది కూడా తొలి ప్రయత్నంలోనే! అంతేకాదు, ఈ ఘనత సాధించిన తొలి మహిళగా కూడా నిలిచిందామె!!
క్లిష్టమైన మార్గంలో...
ఎల్ కాపిటన్‌ను ఎక్కడానికి గోల్డెన్ గేట్, ఫ్రీ రైడర్, ప్రాఫెట్, డాన్‌వాల్ అని నాలుగు మార్గాలున్నాయి. ఫ్రీ రైడర్ మార్గంలో ఎక్కే ప్రయత్నంలో అనుభవజు్ఞలు కూడా పదేపదే కాలు జారుతుంటారు. కానీ వృత్తిరీత్యా రేడియోగ్రఫీ డాక్టర్ అయిన జాంగెర్ల్ మాత్రం తొలి ప్రయత్నమే ఆ మార్గంలోనే ప్రయత్నించి అసలు తడబాటే లేకుండా ఎక్కేశారు. ఇందుకామెకు నాలుగు రోజులు పట్టింది. రాత్రులు కొండ తాలూకు గోడలపై ఉండే స్థలాల్లో నిద్రించారు. పర్వతారోహణలో భాగస్వామి అయిన బాయ్ ఫ్రెండ్ జాకోపో లార్చర్ కూడా ఆమెతో పాటు ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ మధ్యలోనే పడిపోయారు.
‘‘మేమిద్దరం కలిసి ఈ ఫీట్ సాధించాలనుకున్నాం. లా ర్చర్ విఫలమవడం బాధగా ఉంది. కానీ ఓడినా నాకు స్ఫూర్తినిచ్చాడు’’అంటూ అత డిని పొగడ్తలతో ముంచెత్తింది జాంగెర్ల్. ఆ మె కంటే ముందు ఫ్రీ రైడర్ మార్గంలో ఎల్ కేపిటన్‌పైకి ఎక్కేందుకు ఎందరో పర్వతారోహకులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ జాబితాలో ప్రముఖ బ్రిటిష్ పర్వతారోహకుడు పీట్ విట్టేకర్ కూడా ఉన్నారు. అలెక్స్ హోనాల్డ్ మాత్రం ఎలాంటి తాళ్లూ లేకుండా ఫ్రీ రైడర్ మార్గంలో ఎల్ కాపిటన్‌ను అధిరోహించాడు. ఆ డాక్యుమెంటరీ ‘ఫ్రీ సోలో’ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment