
న్యూయార్క్: భార్య, పిల్లలను ఉద్దేశపూర్వకంగా హత్య చేసేందుకు కారును లోయలోకి నడిపారనే కేసులో భారత సంతతి డాక్టర్ ధర్మేష్ పటేల్ జైలు శిక్ష విధించలేదని కాలిఫోర్నియ కోర్టు ప్రకటించింది.
ధర్మేష్ పటేల్ తీవ్రమైన ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారని, ఆయన మానసిక అనారోగ్యం కారణంగా జైలు శిక్ష విధించటం లేదని జడ్జి సుసాన్ జకుబోవ్స్ తెలిపారు. ఆయన మానసిక ఆరోగ్యానికి చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆయన విడుదల, అనారోగ్యానికి సంబంధించి చికిత్స వివరాలను జూలై 1న వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది.
గతేడాది కాలిఫోర్నియాలో ఉండే డాక్టర్ ధర్మేష పటేల్.. పిల్లలతోపాటు తన భార్య ప్రయాణం చేస్తున్న కారు శాన్ మాటియోలోని హైవే పక్కన ఉన్న భారీ లోయలో పడిపోయింది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న 4 ఏళ్ల అమ్మాయి, 9 ఏళ్ల బాలుడు సహా ధర్మేష్, ఆయన భార్య ప్రాణాలతో భయటపడ్డారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. ధర్మేష్ కావాలనే కారును లోయలో పడేశాడని అనుమానిస్తూ ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ధర్మేష్‌ను శాన్ మాటియో కౌంటీలోని జైలుకు తరలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంతో కేసుపై విచారణ జరిపిన కోర్టు జైలు శిక్ష విధించటంలేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment