Yosemite National Park
-
రాతి కొండను జయించింది!
దాని ఎత్తు 3 వేల అడుగులే. అంటే దాదాపు ఓ కిలోమీటరు. కానీ దాన్ని ఎక్కాలంటే కొమ్ములు తిరిగిన ప్రొఫెషనల్ పర్వ తారోహకులకు సైతం ముచ్చెమటలు పడతాయి. ఎందుకంటే అది నిట్టనిలువుగా ఉండే ఏకశిల! అమెరికాలో కాలిఫోర్నియాలోని యోసెమైట్ నేషనల్ పార్క్‌లో ఉంది. పేరు ఎల్ కాపిటన్. ఆ నిలువు రాతి కొండను ఎక్కాలంటే ప్రొఫెషనల్స్‌కు కూ డా ఎన్నో ఏళ్ల అకుంఠిత పరిశ్రమ, సాధన తప్పనిసరి. అలాంటి కొండను ఎలాంటి తడబాటూ లేకుండా ఏకబిగిన ఎక్కేసింది ఆ్రస్టియాకు చెందిన బాబ్సీ జాంగెర్ల్ అనే 36 ఏళ్ల మహిళ. అది కూడా తొలి ప్రయత్నంలోనే! అంతేకాదు, ఈ ఘనత సాధించిన తొలి మహిళగా కూడా నిలిచిందామె!! క్లిష్టమైన మార్గంలో... ఎల్ కాపిటన్‌ను ఎక్కడానికి గోల్డెన్ గేట్, ఫ్రీ రైడర్, ప్రాఫెట్, డాన్వాల్ అని నాలుగు మార్గాలున్నాయి. ఫ్రీ రైడర్ మార్గంలో ఎక్కే ప్రయత్నంలో అనుభవజు్ఞలు కూడా పదేపదే కాలు జారుతుంటారు. కానీ వృత్తిరీత్యా రేడియోగ్రఫీ డాక్టర్ అయిన జాంగెర్ల్ మాత్రం తొలి ప్రయత్నమే ఆ మార్గంలోనే ప్రయత్నించి అసలు తడబాటే లేకుండా ఎక్కేశారు. ఇందుకామెకు నాలుగు రోజులు పట్టింది. రాత్రులు కొండ తాలూకు గోడలపై ఉండే స్థలాల్లో నిద్రించారు. పర్వతారోహణలో భాగస్వామి అయిన బాయ్ ఫ్రెండ్ జాకోపో లార్చర్ కూడా ఆమెతో పాటు ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ మధ్యలోనే పడిపోయారు. ‘‘మేమిద్దరం కలిసి ఈ ఫీట్ సాధించాలనుకున్నాం. లా ర్చర్ విఫలమవడం బాధగా ఉంది. కానీ ఓడినా నాకు స్ఫూర్తినిచ్చాడు’’అంటూ అత డిని పొగడ్తలతో ముంచెత్తింది జాంగెర్ల్. ఆ మె కంటే ముందు ఫ్రీ రైడర్ మార్గంలో ఎల్ కేపిటన్పైకి ఎక్కేందుకు ఎందరో పర్వతారోహకులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ జాబితాలో ప్రముఖ బ్రిటిష్ పర్వతారోహకుడు పీట్ విట్టేకర్ కూడా ఉన్నారు. అలెక్స్ హోనాల్డ్ మాత్రం ఎలాంటి తాళ్లూ లేకుండా ఫ్రీ రైడర్ మార్గంలో ఎల్ కాపిటన్‌ను అధిరోహించాడు. ఆ డాక్యుమెంటరీ ‘ఫ్రీ సోలో’ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాలో తెలుగు యువకుడు మృతి
న్యూయార్క్: స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ తెలుగు వ్యక్తి∙ప్రమాదవశాత్తు మృతి చెందారు. కాలిఫోర్నియాలోని యోస్మైట్ నేషనల్ పార్క్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆశిష్ పెనుగొండ(29) న్యూయార్క్‌లో ఉంటున్నారు. ఈనెల 21న ఆశిష్ స్నేహితులతో కలిసి నేషనల్ పార్క్‌కు వెళ్లారు. పార్క్‌లో ఉన్న హాఫ్‌డోమ్ అనే గ్రానైట్ కొండను తోటి వారితో కలిసి ఎక్కేందుకు ప్రయత్నించారు. బాగా ఏటవాలుగా ఉండే ఆ కొండపైకి రెండు చేతులతో తాళ్లు పట్టుకుని నడుస్తూ ఎక్కుతుండగా గాలివాన మొదలైంది. ఆ క్రమంలోనే ఆశిష్ కాలుజారి కొండపై నుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆశిష్ అక్కడికక్కడే చనిపోయారు. ఫెయిర్లీ డికిన్సన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఆశిష్ న్యూజెర్సీలోని న్యూమిల్‌ఫోర్డ్ కేంద్రంగా ఉన్న సీమెన్స్ హెల్త్‌కేర్ కంపెనీలో బయోకెమిస్ట్‌గా పనిచేస్తున్నారు. -
కొండెక్కిన ప్రేమ పెళ్లి
కాలిఫోర్నియా: పాశ్చాత్య దేశాల్లో ప్రేమికులు వినూత్న పద్ధతిలో పెళ్లి చేసుకోవాలనే పోకడలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని జంటలు ఆకాశమార్గాన పెళ్లి చేసుకుంటే మరికొన్ని జంటలు సముద్ర గర్భంలో పెళ్లి చేసుకుంటున్నారు. ఆ కోవకు చెందిన జంటే ఎడ్జీస్, ఎలినా పెర్కాన్స్. వారు జీవితాంతం గుర్తుండి పోయేలా కాలిఫోర్నియా రాష్ట్రంలోని సియెర్రా నేవడ పర్వత ప్రాంతాల్లోని యోసేమైట్ నేషనల్ పార్క్‌లో...అందులోనూ 4500 అడుగుల ఎత్తులోవున్న కొండ శిఖరంపై పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతవరకు వారి పెళ్లి ముచ్చట బాగానే ఉంది. సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చిదన్నట్లుగా....వారి పెళ్లి ఫొటోలను తీయాల్సిన ప్రముఖ కాలిఫోర్నియా ఫొటోగ్రాఫర్ బ్రియాన్ ర్యూబ్స్కు అసలు కష్టాలు ఇక్కడే ప్రారంభమయ్యాయి. రకరకాల లెన్సులు, స్టాండులతో బరువుగల కెమెరా బ్యాగును భుజానేసుకొని 4500 అడుగుల ఎత్తులోవున్న పర్వత శిఖరం ఎక్కడం మామాలు విషయమా! అందులో 42 ఏళ్ల వయస్సులో బ్రియాన్‌కు కొండెక్కడం మాటలా! ఎలాగూ ఒప్పుకున్నాక తప్పుతుందా అనుకుంటూ ఫిలిప్ నికోలస్ అనే అసిస్టెంట్‌ను తీసుకోని ముందురోజే కష్టపడి కొండెక్కాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఐదున్నర గంటల నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు ఎడ్డీస్, ఎలినాల పెళ్లి తంతును, ప్రమాణాలను కెమెరాతో షూట్ చేశాడు. ఈ పెళ్లికి అసిస్టెంట్ కెమెరా మేన్ ఫిలిప్ సాక్షిగా వ్యవహరించారు. అనంతరం షాంపేన్ పార్టీని ముగించుకొని న లుగురు కాలిఫోర్నియాకు చేరుకున్నారు. జూలై 25వ తేదీన జరిగిన ఈ పెళ్లిలో తాను 14 గంటలపాటు ఏకభిగినా షూట్‌చేసి అలసి పోయానని, కనీసం షాంపేన్ తాగే అదృష్టం కూడా లేకపోయిందని తొలుత తిట్టుకున్నాడు. అయితే ఆ పెళ్లి ఫొటోలు అద్భుతంగా రావడంతో పడిన శ్రమను మరిచిపోయానంటూ ఆ ఫొటోలను ఇప్పుడు ఆన్లైన్లో పోస్ట్ చేశాడు.