అమెరికాలో తెలుగు యువకుడు మృతి | Indian national killed in hiking accident in Yosemite National Park | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు యువకుడు మృతి

May 30 2018 4:40 AM | Updated on Apr 4 2019 3:25 PM

Indian national killed in hiking accident in Yosemite National Park - Sakshi

న్యూయార్క్‌: స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ తెలుగు వ్యక్తి∙ప్రమాదవశాత్తు మృతి చెందారు. కాలిఫోర్నియాలోని యోస్‌మైట్‌ నేషనల్‌ పార్క్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆశిష్‌ పెనుగొండ(29) న్యూయార్క్‌లో ఉంటున్నారు. ఈనెల 21న ఆశిష్‌ స్నేహితులతో కలిసి నేషనల్‌ పార్క్‌కు వెళ్లారు. పార్క్‌లో ఉన్న హాఫ్‌డోమ్‌ అనే గ్రానైట్‌ కొండను తోటి వారితో కలిసి ఎక్కేందుకు ప్రయత్నించారు. బాగా ఏటవాలుగా ఉండే ఆ కొండపైకి రెండు చేతులతో తాళ్లు పట్టుకుని నడుస్తూ ఎక్కుతుండగా గాలివాన మొదలైంది. ఆ క్రమంలోనే ఆశిష్‌ కాలుజారి కొండపై నుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆశిష్‌ అక్కడికక్కడే చనిపోయారు. ఫెయిర్లీ డికిన్సన్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ చేసిన ఆశిష్‌ న్యూజెర్సీలోని న్యూమిల్‌ఫోర్డ్‌ కేంద్రంగా ఉన్న సీమెన్స్‌ హెల్త్‌కేర్‌ కంపెనీలో బయోకెమిస్ట్‌గా పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement