Telugu young man
-
అమెరికాలో తెలుగు యువకుడు అదృశ్యం
సాక్షి, సైదాబాద్: కొడుకు ఉన్నత ఉద్యోగం చేస్తానంటే అప్పు చేసి మరి అమెరికా పంపించారు కన్నవారు. అయితే గత 8 నెలలుగా కొడుకు ఆచూకి లేకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు అమెరికాలోని కాలిఫోర్నియాలో అదృశ్యం కావడంతో వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు చంపాపేట సమీపంలోని వినయ్ నగర్ కాలనీలో శక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంద్రప్రదేశ్‌లోని ఈస్ట్‌గోదావరి జిల్లా అమలాపురం గ్రామానికి చెందిన పండు బంగారం, పుష్పలత దంపతులు ఉద్యోగ రిత్యా నగరానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు అనారోగ్యంతో చిన్నతనంలోనే కర్నూల్లో మృతి చెందారు. దీంతో చిన్న కుమారుడు పి.రాఘవేందర్రావును ఎంతో గారాంభంగా పెంచారు. ఉన్నత చదువులు చదించారు. జెన్టీయులో బీటెక్, ఆ తరువాత లండన్‌లో 2010లో ఎంబీఏ చదివించారు. రాఘవేందర్రావు 2011లో అమెరికా వెళ్లాడు. అక్కడి కాలిఫోర్నియాలోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ప్రాజెక్ట్ మెనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కాగా ప్రతి రోజు రాఘవేందర్రావు తల్లిదండ్రులతో ఫోన్లో, వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడేవారు. అయితే అక్టోబర్ 2017 నుంచి రాఘవేందర్ ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుంది. అప్పటి నుంచి నేటి వరకు కొడుకు ఆచూకి లభించడం లేదు. అతడి స్నేహితులను ఆరా తీసినా సరైన సమాచారం లేదు. దీంతో అప్పటి నుంచి కొడుకు ఆచూకి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ విషయంమై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించారు. సైదాబాద్ పోలీసులను సంప్రదించగా వారు ఎన్ఆర్ఐ సెల్‌కు పంపించారు. ఒక్కగానొక్క కొడుకు ఎప్పటికైన తిరిగొస్తాడని దీనంగా ఎదురు చూస్తుంది ఆ కుంటుంబం. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -
అమెరికాలో తెలుగు యువకుడు మృతి
న్యూయార్క్: స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ తెలుగు వ్యక్తి∙ప్రమాదవశాత్తు మృతి చెందారు. కాలిఫోర్నియాలోని యోస్మైట్ నేషనల్ పార్క్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆశిష్ పెనుగొండ(29) న్యూయార్క్‌లో ఉంటున్నారు. ఈనెల 21న ఆశిష్ స్నేహితులతో కలిసి నేషనల్ పార్క్‌కు వెళ్లారు. పార్క్‌లో ఉన్న హాఫ్‌డోమ్ అనే గ్రానైట్ కొండను తోటి వారితో కలిసి ఎక్కేందుకు ప్రయత్నించారు. బాగా ఏటవాలుగా ఉండే ఆ కొండపైకి రెండు చేతులతో తాళ్లు పట్టుకుని నడుస్తూ ఎక్కుతుండగా గాలివాన మొదలైంది. ఆ క్రమంలోనే ఆశిష్ కాలుజారి కొండపై నుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆశిష్ అక్కడికక్కడే చనిపోయారు. ఫెయిర్లీ డికిన్సన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఆశిష్ న్యూజెర్సీలోని న్యూమిల్‌ఫోర్డ్ కేంద్రంగా ఉన్న సీమెన్స్ హెల్త్‌కేర్ కంపెనీలో బయోకెమిస్ట్‌గా పనిచేస్తున్నారు. -
బిచ్చగాడు కేంబ్రిడ్జ్ పట్టభద్రుడయ్యాడు!
‘సెల్ఫ్‌ట్రస్టు’ ప్రోత్సాహంతో తెలుగు యువకుడి విజయం కేకే.నగర్: కరువు కాటేస్తే.. బతుకు పయనం అతడిని భిక్షగాడిగా మార్చింది. చెన్నై రోడ్లమీద తల్లితో కలసి యాచనలో ఉన్న పసివాడిని చూసి ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల హృదయం చలించింది. తామున్నామంటూ అక్కున చేర్చుకుని చేయూత నందించింది. విఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పట్టా తీసుకునే స్థాయికి చేర్చింది. నెల్లూరు నుంచి చెన్నై వలస వెళ్లిన ఓ రైతు కుటుంబానికి చెందిన యువకుడి గాథ ఇది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఏర్పడిన కరువు రక్కసితో ఉన్న ఊరు వదలి బతుకుదెరువు కోసం అనేక రైతు కుటుంబాలు చెన్నపట్నంను ఆశ్రయించాయి. నాటి పరిస్థితుల్లో చెన్నై బతుకు భారం కావడంతో భిక్షాటన సాగించి కడుపు నింపుకున్న కుటుంబాలు ఉన్నాయి. వాటిలో నెల్లూరుకు చెందిన జయవేలు కుటుంబం ఒకటి. కడుపు నింపుకునేందుకు నగరంలోని ముఖ్య కూడళ్లలో తల్లితో కలసి ఈ పసివాడు యాచన చేస్తుండడం ఓ దంపతుల కంట పడింది. భిక్షాటనతో వచ్చిన మొత్తాన్ని తల్లి మద్యం తాగేందుకు వాడుకోవడంతో ఆ పసివాడు కన్నీళ్ల పర్యంతం అవుతుండడం వారి హృదయాన్ని కదిలించింది. ఆ దంపతులే చెన్నైకు చెందిన ఉమ, ముత్తురామన్. భిక్షగాళ్ల జీవితంపై డాక్యుమెంటరీ తీయడానికి వచ్చిన ఆ దంపతులు తాము నడుపుతున్న ‘సెల్ఫ్‌ట్రస్టు’ ద్వారా 1999లో జయవేలును దత్తత తీసుకుని పాఠశాలలో చేర్పించి చదివించారు. చెన్నైలోనే ప్లస్‌టూ వరకు చదువుకున్నాడు. తర్వాత ప్రఖ్యాత కేంబ్రిడ్‌జ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడం.. అక్కడ చదువు పూర్తి చేసుకొని పట్టభద్రుడు కావడం జరిగిపోయాయి. ప్రస్తుతం విదేశాల్లోని ఓ వర్సిటీలో మరో ఉన్నత విద్యను పూర్తి చేసే పనిలో జయవేలు ఉన్నాడు. ఈ విషయం ఓ తమిళ మీడి యా వెలుగులోకి వచ్చింది.