భారీ కొండ చిలువ రెండు కోళ్లను అమాంతం మింగి.. ఆతర్వాత.. | Python Enters Mans Home In Khammam | Sakshi
Sakshi News home page

భారీ కొండ చిలువ రెండు కోళ్లను అమాంతం మింగి.. ఆతర్వాత..

Published Sat, Oct 2 2021 1:55 PM | Last Updated on Sat, Oct 2 2021 2:06 PM

Python Enters Mans Home In Khammam - Sakshi

ఖమ్మం: ఒక కొండ చిలువ దారితప్పి జనావాసాల్లోకి ప్రవేశించింది. అంతటితో ఆగకుండా అక్కడి కోళ్లను మింగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్కడినుంచి వచ్చిందో కానీ.. ఒక కొండ చిలువ కొత్తగూడెంలో ఉంటున్న జావీద్‌ అనే వ్యక్తి ఇంట్లో ప్రవేశించింది. ఆ తర్వాత అక్కడే ఉన్న రెండు కోళ్లను లటుక్కున మింగింది. ఆ తర్వాత ఎటూ కదల్లేక అక్కడే పడుకుంది.

దీన్ని గమనించిన ఆ ఇంటివారు.. పాములను పట్టుకునే వారికి సమాచారం అందించారు. వారు వెంటనే  జావీద్‌ ఇంటికి చేరుకుని కొండచిలువను బంధించారు. ఆ తర్వాత దాన్ని పైకెత్తగానే..  కొండ చిలువ మింగిన కోళ్లను బయటకు కక్కింది. ఆ తర్వాత దాన్ని ఫారెస్టు అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

చదవండి: వామ్మో.. 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement