Kothagudem District
-
క్యూలైన్లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య!
పాల్వంచ: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఏళ్లు గడుస్తున్నా అదే ఒరవడి సాగిస్తున్నారు. సైకిల్‌పై వెళ్లడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఇదే క్రమాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షల కోసం బుధవారం ఆయన వచ్చారు. అక్కడ అందరితోపాటే ఓపీ చీటీ తీసుకుని వైద్యుల గది ముందు క్యూలో వేచి ఉండి తన వంతు వచ్చాక పరీక్ష చేయించుకున్నారు. వార్డుమెంబర్, ఎంపీటీసీలే హంగూ ఆర్భాటాలతో జీవిస్తుండగా 25 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్య అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని పలువురు అభినందించారు.చదవండి: హీరో ప్రభాస్ హెయిర్ స్టైల్ కావాలి.. ఫ్లాట్ హెయిర్ కట్ వద్దు -
భద్రాద్రి జిల్లాలో ఒక్కసారిగా మిర్చి నారుకు పెరిగిన డిమాండ్
-
ఆయనకిద్దరితో పెళ్లి.. ఆరు ముళ్లు.. పద్నాలుగు అడుగులు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘‘మూడే ముళ్లు... ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు...’’ ఓ సినీ గేయ రచయిత అన్న మాటలను ఈయన సరిగ్గా డబుల్ చేశాడు. ఒకే రోజు ఇద్దరికీ.. ఒక్కొక్కరికి మూడు ముళ్లు.. వెరసి ఆరు ముళ్లు వేసి పద్నాలుగు అడుగులు నడిచాడు. ఇక కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలు.. చందంగా పెళ్లి సమయానికే ఇద్దరు వధువులూ ఒకరు మగ బిడ్డతో.. ఒకరు ఆడ బిడ్డతో పెళ్లి పీటలపై కూర్చొని సదరు పెళ్లి కొడుకుతో తాళి కట్టించుకున్నారు. ఈ చిత్రమైన పెళ్లి’ళ్లు’భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామంలో జరిగాయి. పూర్వాపరాలిలా.. గ్రామానికి చెందిన సత్తిబాబు దోశిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ శారీరకంగా ఒకటి కావడంతో స్వప్నకుమారి గర్భం దాల్చింది. విషయం ఆమె ఇంట్లో తెలియడంతో పెళ్లి చేసుకునేందుకు సత్తిబాబు ఓకే అన్నాడు. కానీ స్వప్నకి తెలియకుండా సత్తిబాబు కుర్నపల్లికి చెందిన సునీతతోనూ మరో ప్రేమ కథ నడిపాడు. ఈమెనూ గర్భవతిని చేశాడు. ఇరువురు యువతుల తల్లిదండ్రులతో పాటు కుల పెద్దలూ రంగంలోకి దిగారు. తాను ఇద్దరినీ ప్రేమించానని, ఇరువురినీ పెళ్లి చేసుకుంటానని సత్తిబాబు చెప్పగా, యువతులూ అంగీకరించడంతో పరస్పర అంగీకారంతో ఒకే చోట కాపురం పెట్టాడు. గతేడాది జూలైలో స్వప్నకుమారి పాపకు జన్మనివ్వగా, సెప్టెంబర్‌లో సునీతకు బాబు పుట్టాడు. కాగా తన పెళ్లి ఘనంగా జరగలేదని భావించిన సత్తిబాబు..ఈనెల 9న గురువారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక వరుడు, ఇద్దరు వధువుల పేర్లతో పెళ్లి పత్రిక అచ్చు వేయించి బంధుమిత్రులందరికీ పంచాడు. సోషల్ మీడియాలో ఈ పెళ్లికార్డు వైరల్‌గా మారింది. సత్తిబాబు పెళ్లి ముచ్చట ఆరు ముళ్లు, పద్నాలుగు అడుగులతో ముగిసింది. -
తెలంగాణకు రూ.3 లక్షల కోట్లు నష్టం.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్..
సాక్షి, కొత్తగూడెం: విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కొత్తగూడెంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. సీఎం మాట్లాడుతూ.. కొత్తగూడెం జిల్లాకు చాలా వచ్చాయని, ఇంకా చాలా వస్తాయని తెలిపారు. ఐక్య పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. 8 ఏళ్ల కిందటి తెలంగాణకు, ఇప్పటి తెలంగాణకు పోలికే లేదన్నారు. ఆనాడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.87 వేలు ఉంటే ఉప్పుడు తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు ఉందని కేసీఆర్ తెలిపారు. ఆనాడు జీఎస్డీపీ రూ. 5లక్షల కోట్లు.. ఇప్పుడు మన జీఎస్డీపీ రూ.11.5 లక్షల కోట్లని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ పథకాన్ని పూర్తి మానవీయ కోణంలో అమలు చేస్తున్నామన్నారు కేంద్ర అసమర్థ, దుర్మార్గ విధానాల వల్ల తెలంగాణ రూ.3లక్షల కోట్లు నష్టపోయిందని ఆరోపించారు. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు చేశారు. హెలికాప్టర్ ద్వారా మహబూబాబాద్ నుంచి కొత్తగూడెంకు వచ్చిన కేసీఆర్ జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకోగా.. పోలీసుల నుంచి గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్లో కలెక్టర్ అనుదీప్‌ను కుర్చీలో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: ఏపీలో ఏ బాధ్యతలు ఇచ్చినా ఓకే: సోమేశ్ కుమార్ -
సరిహద్దుల్లో మావోల అలజడి.. పుంజుకోకముందే కట్టడి చేయాలని పోలీసుల అలర్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దుల్లో కొన్నేళ్ల తర్వాత మళ్లీ మావోయిస్టు పార్టీ కదిలికలు కనిపిస్తుండటంతో నిఘా వర్గాలతోపాటు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోల కార్యకలాపాలు పుంజుకోకముందే వారిని నియత్రించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని మంగి, తిర్యాణి అటవీ ప్రాంతాల్లో గ్రామ రక్షక దళాలను పునర్నిర్మించే పనిలో స్థానిక దళాలు ఉన్నట్లు వార్తలు రావడం, కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలో ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు తాజాగా ఇద్దరిని హతమార్చిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ స్థానికులతో సమావేశమై మావోయిస్టు పార్టీ వైపు ఎవరూ వెళ్లకూడదని, పార్టీకి సహకరించరాదని సూచిస్తున్నారు. అలాగే గ్రేహౌండ్స్ పార్టీలను కూంబింగ్‌లో నిమగ్నం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు మీదుగా గోదావరి దాటి మావోయిస్టులు భారీగా సమీప అటవీ ప్రాంతాల్లోకి వచ్చారన్న సమాచారం నిఘా వర్గాలకు అందినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకలాపాలను ఏకకాలంలో విస్తృతపరిచేందుకు మావోయిస్టులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న అనుమానంతో ఈ మొత్తం సరిహద్దు ప్రాంతాల్లో గ్రేహౌండ్స్‌తోపాటు సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలను ఉన్నతాధికారులు కూంబింగ్‌లోకి దించినట్లు సమాచారం. మాజీల సహకారంపై అనుమానం వాస్తవానికి ఆదిలాబాద్‌లో 2011 వరకు మావోయిస్టు పార్టీ విస్తృతంగా కార్యకలాపాలు కొనసాగించింది. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, గ్రేహౌండ్స్ సంయుక్త ఆపరేషన్లలో కీలక నేతలు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోవడంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు మకాం మార్చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పెద్దగా కదలికలు, కార్యకలాపాలు లేవు. గతంలో తిర్యాణి, మంగి ప్రాంతంలో ఐరీ దళం నాయకుడు శ్రీనివాస్ నాయకత్వం వహించాడు. తర్వాత దళం అంతరించిపోవడం, మిగతా సభ్యులంతా లొంగిపోవడంతో కార్యలాపాలు లేవు. అయితే అప్పుడు దళంలో పనిచేసిన పాత సభ్యులెవరైనా మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఉన్నతాధికారుల ధీమా.. మావోయిస్టు పార్టీకి గతంలో మాదిరిగా రిక్రూట్మెంట్ జరిగే అవకాశమే లేదని, ప్రస్తుతమున్న టెక్నాలజీ యుగంలో ఎవరూ మావోయిస్టు పార్టీ వైపు అడుగులు వేయబోరని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. పైగా ఎవరైనా అలా పార్టీలో చేరే ప్రయత్నం చేస్తే తమకున్న ‘నెట్వర్క్’ద్వారా గంటల వ్యవధిలోనే ఆ సమాచారం తెలుస్తుందని... అలాంటి వారిని వెనక్కి తెచ్చి కౌన్సెలింగ్ సైతం ఇస్తామని చెబుతున్నారు. -
భద్రాద్రి జిల్లాలో గవర్నర్ పర్యటన.. ఢిల్లీ పర్యటన రద్దు చేస్కొని మరీ..
సాక్షి, హైదరాబాద్: కనీవినీ ఎరుగనిరీతిలో గోదావరి మహోగ్రరూపంతో గోదావరి తీర ప్రాంతాల్లో కలిగించిన నష్టాన్ని అంచనా వేయడానికి, వరద ప్రభావిత భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో ఆదివారం గవర్నర్ తమిళిసై పర్యటించనున్నారు. శనివారంరాత్రి ఆమె రైలుమార్గం ద్వారా కొత్తగూడెంకు బయలుదేరివెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున మణుగూరుకు చేరుకోనున్నారు. గవర్నర్ పర్యటనను అధికార టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుండగా, వరదబాధితులను కలుసుకుని వారి కష్టాలను అడిగి తెలుసుకోవడానికి ఈ పర్యటన జరుపుతున్నట్టు ఆమె వెల్లడించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు విందులో పాల్గొనడానికి గవర్నర్ తమిళిసై ఆదివారంరాత్రి ఢిల్లీకి వెళ్లాల్సింది. కానీ, భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజల దీనస్థితిని చూసి చలించిన గవర్నర్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని కొత్తగూడెం జిల్లాకు వెళ్లాలని నిర్ణయించినట్టు రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని వరద పరిస్థితులను తమిళిసై రాష్ట్రపతికి ఫోన్లో వివరించి, తాను అత్యవసరంగా కొత్తగూడెం జిల్లా పర్యటనకు వెళ్లాల్సి ఉందని విన్నవించారని పేర్కొంది. పునరావాస శిబిరాలను సందర్శించనున్న గవర్నర్ కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ పునరావాస కేంద్రాలను సందర్శించి వరదబాధితులను కలుసుకోనున్నారు. రెడ్‌క్రాస్, ఇతర స్వచ్ఛంద సంస్థలు, దాతల నుంచి వచ్చిన విరాళాలు, సామగ్రిని బాధితులకు పంపిణీ చేయనున్నారు. బాధితుల సహాయార్థం విరివిగా విరాళాలు అందజేయాలని, సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పునరావాస కేంద్రాలు, ఇతర ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య, ఇతర సహాయాన్ని అందించాలని తమిళిసై ఈఎస్ఐ వైద్య కళాశాల, రెడ్‌క్రాస్ సంస్థలను కోరారు. కాగా, వరద ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యలకు గవర్నర్ పర్యటనతో ఆటంకం కలగనుందని టీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. గవర్నర్ పర్యటన రాజకీయమేనని ఆరోపిస్తున్నాయి. ప్రతిఒక్కరూ తప్పక బూస్టర్ తీసుకోవాలి: గవర్నర్ అమీర్‌పేట (హైదరాబాద్): కరోనా నివారించాలంటే ప్రతిఒక్కరూ తప్పక బూస్టర్ డోస్ తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం అమీర్‌పేట 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమె బూస్టర్ డోస్ తీసుకున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చిన గవర్నర్‌కు వైద్య సిబ్బంది టీకా వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
రాఘవ కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలించాం: ఏఎస్పీ రోహిత్ రాజ్
-
వనమా రాఘవపై 12 కేసులున్నాయి: ఏఎస్పీ
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావుపై ఇప్పటివరకూ 12 కేసులున్నట్లు కొత్త గూడెం జిల్లా ఏఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. రాఘవ కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. నిన్న(శుక్రవారం) దమ్మపేట వద్ద రాఘవను అరెస్ట్ చేశామన్న ఏఎస్పీ.. అతని డ్రైవర్ మురళీ, అనుచరుడు గిరీష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.ఈరోజు రాఘవను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు రోహిత్‌రాజ్ స్పష్టం చేశారు. రాఘవ డబ్బులే కాకుండా రామకృష్ణ భార్యను కూడా ఆశించినట్లు సెల్ఫీ వీడియోలో ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో విషాదం
-
భారీ కొండ చిలువ రెండు కోళ్లను అమాంతం మింగి.. ఆతర్వాత..
ఖమ్మం: ఒక కొండ చిలువ దారితప్పి జనావాసాల్లోకి ప్రవేశించింది. అంతటితో ఆగకుండా అక్కడి కోళ్లను మింగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్కడినుంచి వచ్చిందో కానీ.. ఒక కొండ చిలువ కొత్తగూడెంలో ఉంటున్న జావీద్ అనే వ్యక్తి ఇంట్లో ప్రవేశించింది. ఆ తర్వాత అక్కడే ఉన్న రెండు కోళ్లను లటుక్కున మింగింది. ఆ తర్వాత ఎటూ కదల్లేక అక్కడే పడుకుంది. దీన్ని గమనించిన ఆ ఇంటివారు.. పాములను పట్టుకునే వారికి సమాచారం అందించారు. వారు వెంటనే జావీద్ ఇంటికి చేరుకుని కొండచిలువను బంధించారు. ఆ తర్వాత దాన్ని పైకెత్తగానే.. కొండ చిలువ మింగిన కోళ్లను బయటకు కక్కింది. ఆ తర్వాత దాన్ని ఫారెస్టు అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: వామ్మో.. 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి.. -
పోక్సో కేసులో 21 ఏళ్ల శిక్ష
కొత్తగూడెం రూరల్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారితప్పాడు. సొంత పిల్లల్లా చూసుకోవాల్సిన విద్యార్థినులపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటనపై నమోదైన కేసులో నిందితుడికి 21 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.11 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువడింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అదనపు జిల్లా జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ శుక్రవారం వెలువరించిన తీర్పు వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చింతవర్ర గామ ప్రభుత్వ పాఠశాలలో దొడ్డ సునీల్‌కుమార్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడిన గత ఏడాది డిసెంబర్లో పాఠాలు చెబుతానంటూ విద్యార్థినులను పాఠశాలకు పిలిచేవాడు. ఆయన మాటలు నమ్మి వచ్చిన ఐదుగురు విద్యార్థినుల(మైనర్లు)పై సునీల్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో గత ఏడాది డిసెంబర్ 15న లక్ష్మీదేవిపల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సునీల్‌ను అరెస్టు చేశారు. ఈ కేసును ఐపీఎస్ అధికారి వినీత్ విచారణ జరిపారు. ఈ మేరకు కేసు కోర్టు విచారణకు రాగా, న్యాయమూర్తి వాదోపవాదాలు విన్నారు. అనంతరం నిందితుడు సునీల్‌కు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.11 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
సాక్షి ఎఫెక్ట్: ‘కిన్నెరసాని’పై ఇనుప వంతెన ఏర్పాటు
గుండాల: శాశ్వత పరిష్కారం కాకపోయినా.. కిన్నెరసాని నదిపై తాత్కాలిక ఇనుప వంతెన ఏర్పాటైంది. దీంతో వర్షం వచ్చినప్పుడు నది ఉధృతంగా ప్రవహించినా రాకపోకలు సులభతరం కానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మొదుగులగూడెం–నడిమిగూడెం గ్రామాల నడుమ నదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ ప్రాంత గిరిజనులు ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వర్షాలతో నదీ వ్రాహం పెరగగా, గిరిజనులు కట్టెలతో నిచ్చెన మాదిరి ఏర్పాటుచేసుకుని దాటిన విషయమై ‘సాక్షి’లో మంగళవారం ‘ఈ సాహసం ప్రమాదకరమై‘నది’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ఎస్పీ సునీల్‌దత్ ఆదేశాలతో గుండాల సీఐ శ్రీనివాస్, ఎస్సై ముత్యం రమేశ్ సిబ్బందితో కలసి బుధవారం ఇనుప పైపులు, స్లాబ్ రేకులతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయించారు. చదవండి: ‘ఈ సాహసం ప్రమాదకరమై‘నది’ -
కరోనాపై పోరు.. సింగరేణి జోరు..!
సాక్షి, హైదరాబాద్/ సింగరేణి (కొత్తగూడెం): సింగరేణిలో కోవిడ్‌ను కట్టడి చేసేందుకు సింగరేణి సంస్థ యాజమాన్యం, ప్రభుత్వ యంత్రాంగం, గుర్తింపు యూనియన్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) సంయుక్తంగా చేపట్టిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. యాజమాన్యం, కార్మికులను సమన్వయం చేయడంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు టీజీబీకేఎస్ వర్గాలు వెల్లడించాయి. మెరుగైన సేవలు అందించేందుకు సంస్థ సీఎండీ శ్రీధర్ అధికారులతో సమీక్షిస్తూ తీసుకుంటున్న చర్యలతో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. సంస్థలో 44 వేల మంది కార్మికులు ఉన్నారు. సింగరేణివ్యాప్తంగా ప్రస్తుతం 2,308 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, వారిలో 783 మంది కార్మికులు, 1,121 మంది కార్మి క కుటుంబీకులు, 364 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబాల్లో 27 వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తి కాగా, మరో 50 వేల మందికి వేయాల్సి ఉంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు రూ.38 కోట్లు కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న 867 మందికి హై దరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవల కోసం ఇప్పటివరకు సింగరేణి యాజమాన్యం రూ.38 కోట్లు వెచ్చించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు, సింగరేణి ఆసుపత్రుల్లో 1,400 బెడ్లతో ప్రత్యేక కరోనా వార్డుల ఏర్పాటుకు రూ.3.16 కోట్లు ఖర్చు చేసింది. 1.2 లక్షలకు పైగా టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేయగా, ఇప్పటివరకు 90 వేల మందికి పైగా కార్మికులు, వారి కుటుంబసభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న కరోనా ప్రత్యేక వార్డులు, ఐసోలేషన్ సెంటర్లలో చేరిన 9,650 మంది పూర్తిగా కోలుకోగా, రూ.80 లక్షల ఖర్చుతో వివిధ మందులు, ఆక్సీమీటర్లు వంటి 18 వస్తువులతో కూడిన కిట్లను హోం ఐసోలేషన్ వారికి అందజేశారు. సింగరేణి లో అవసరమైన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, ఇతర మందులను రూ.5.55 కోట్లతో సమకూర్చారు. ఐదు చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి రూ.3.6 కోట్లతో ఐదు చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి కేం ద్రాలు ఏర్పాటు చేశారు. రూ.1.18 కోట్లతో 370 ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేశారు. కోవిడ్ వార్డుల్లో పనిచేసేందుకు 35 మంది అదనపు డాక్ట ర్లు, 126 మంది నర్సులు, 260 మంది సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిన నియమించారు. రోగులకు పౌష్టికాహారం అందిచేందుకు రూ.1.5 కోట్లు వెచ్చించడంతో పాటు సంస్థలో పనిచేసే వారికి శానిటైజర్, మాస్కులు, పీపీపీ కిట్లు అందజేశారు. కోవిడ్‌తో మృతి చెందిన 39 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించారు. సత్ఫలితాలు సాధించాం కరోనా నుంచి సింగరేణీయులందరినీ కాపాడుకునేందుకు అంతా సమష్టిగా పనిచేయాలని సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరాం పిలుపునిచ్చారు. ఏడాదిగా సీఎండీ మార్గనిర్దేశంలో కోవిడ్‌పై సాగిస్తున్న పోరాటంలో సత్ఫలితాలను సాధించామన్నారు. మెరుగైన సేవలు అందేలా చూస్తున్నాం: ఎమ్మెల్సీ కవిత కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం, కార్మికులను సమన్వయం చేస్తూ రోగులకు అండగా ఉంటున్నాం. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవలు, క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు, ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు, వ్యాక్సినేషన్ పక్రియ వరకు అన్ని దశల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం క్రియాశీలకంగా పని చేస్తోంది. -
పెళ్లింట విషాదం: తమ్ముడి పెళ్లికొచ్చి ఎన్నారై కరోనాకు బలి
సాక్షి, హైదరాబాద్: ఒక్కో కరోనా మరణం వెనుక తీవ్ర విషాదం నింపుతున్నాయి. ఒక్కో కథ వింటే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా ఓ యువకుడి కథ వింటే గుండెలు పిండేసేలా ఉంది. తమ్ముడి పెళ్లి కోసం అమెరికా నుంచి వచ్చిన యువకుడు తెలంగాణలో కరోనా బారినపడ్డాడు. కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరకు కన్నుమూశాడు. దీంతో ఆ పెళ్లింట తీవ్ర విషాదం నిండింది. దీనికి వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైలారం తండాకు చెందిన ప్రేమ్ లాల్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య, పాపతో కలిసి అమెరికాలోనే నివసిస్తున్నాడు. అయితే మే 6వ తేదీన సోదరుడి వివాహం ఉండడంతో కొన్ని రోజులు ముందుగానే అమెరికా నుంచి స్వగ్రామం చేరుకున్నాడు. అయితే ఇక్కడికి వచ్చాక ప్రేమ్‌లాల్ కరోనా బారిన పడ్డాడు. అతడి తల్లిదండ్రులకు కూడా కరోనా సోకింది. అనారోగ్యం చెందడంతో ప్రేమ్‌లాల్ మొదట స్థానికంగా ఉన్న ఆర్ఎంపీని సంప్రదించి మందులు వాడాడు. కొన్ని రోజులకు ఆరోగ్యం మరింత విషమించడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు. ప్రేమ్‌లాల్ మృతితో పెళ్లింట తీవ్ర విషాదం నిండింది. చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. 577 మంది టీచర్లు కరోనాకు బలి -
దేవుడా.. అంటూ వాగు దాటాల్సి వచ్చింది
గుండాల: కడుపులో బిడ్డ. పురిటి నొప్పులతో ఇద్దరు గర్భిణుల కష్టాలు. ఆస్పత్రికి వెళదామంటే అడ్డుకుంటున్న వాగు ఉధృతి. అన్నీ భరిసూ్తనే ఇద్దరూ కుటుంబ సభ్యుల సహకారంతో దేవుడా.. అంటూ వాగు దాటాల్సి వచ్చింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని నర్సాపురం తండాకు చెందిన లూనావత్ మమత నిండు గర్భిణీ కావడంతో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంపై మల్లన్నవాగు వద్దకు తీసుకొచ్చారు. వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో నుంచి గర్భిణిని ముగ్గురు కుటుంబ సభ్యులు అతికష్టం వీుద దాటించారు. అక్కడి నుంచి గుండాల ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాగే రోళ్లగడ్డ గ్రామానికి చెందిన ఈసం వనజ ఆరు నెలల గర్భవతి. నెలలు నిండకున్నా ఆమెకు నొప్పులు వస్తుండటంతో అదే వాగుపై నుంచి కుటుంబ సభ్యులు దాటించి ఆస్పత్రికి తరలించారు. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తే గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పరిస్థితి ఏమిటని పలువురు గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. గర్భిణికి మెరుగైన వైద్యం అందించాలి సూపర్‌బజార్(కొత్తగూడెం): గుండాల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన నూనావత్ మమత పురిటి నొప్పులతో బాధపడుతుండగా భుజాలపై మల్లన్న వాగును దాటించిన ఘటనపై సమగ్ర వివరాలందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలపాలని సూచించారు. -
గర్భిణి మహిళ కష్టం
-
నరకయాతన.. పురిటి నొప్పులతోనే..
గుండాల: పురిటి నొప్పులతో ఓ గర్భిణి నరకయాతన అనుభవించింది. మార్గమధ్యలో మల్లన్నవాగులో నీటి ఉధృతి పెరగడంతో ఆమెను అతికష్టం మీద వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈసం సంధ్యారాణి శుక్రవారం తెల్లవారుజాము నుంచి పురిటి నొప్పులతో బాధ పడుతుండగా కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. అయితే రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మార్గమధ్యలోని మల్లన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నొప్పులతో బాధపడుతున్న ఆమెను వాగు దాటించి అప్పటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌లో ఎక్కించి గుండాల ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆపరేషన్ చేయడంతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. -
అమ్మను గెంటేశాడు
బూర్గంపాడు: మాతృ దినోత్సవం నాడే ఓ తల్లి కంటతడి పెట్టింది. ఇంటి నుంచి కొడుకు గెంటేయడంతో మౌన దీక్షకు దిగింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. భద్రాద్రి జిల్లా పరిధిలోని సారపాకు చెందిన అయిలూరి రంగారెడ్డి, వెంకట కోటమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేసేశారు. వృద్ధాప్యంలోనూ ఆ దంపతులు కలిసే ఉండేవారు. రంగారెడ్డి అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. దీంతో కోటమ్మ ఒంటరిగానే ఉంటోంది. కోటమ్మ నివాసం ఉండే ఇల్లు విషయంలో కొడుకు శ్రీనివాసరెడ్డికి, తల్లికి మధ్య విభేదాలు రావడంతో శనివారం తల్లితో శ్రీనివాసరెడ్డి గొడవ పెట్టుకుని ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆదివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తన ఇంటి వద్దే మౌనదీక్షకు దిగింది. -
కరోనా: మళ్లీ హైదరాబాద్‌కు కొత్తగూడెం డీఎస్పీ
సాక్షి, కొత్తగూడెం రూరల్: కరోనా పాజిటివ్ వచ్చిన కొత్తగూడెం డీఎస్పీకి నెగిటివ్ రిపోర్ట్ రావడంతో గురువారం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన విషయం విదితమే. దీంతో ఆయన కొత్తగూడెం చేరుకున్నారు. కాగా, ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఎర్రర్ రావడంతో తిరిగి శుక్రవారం ఉదయం మరోసారి హైదరాబాద్‌కు తరలించారు. డీఎస్పీ కుమారుడు విదేశాల నుంచి తిరిగి రాగా, అతడికి కరోనా పాజిటివ్ వచ్చింది.హైదరాబాద్ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో వైద్యం అందించారు. ఇటీవలే డీఎస్పీ కుమారుడు ఆర్బాజ్‌కు కరోనా నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేసి హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఇక డీఎస్పీకి కూడా కరోనా నెగిటివ్ రావడంతో గురువారం డిశ్చార్జ్ చేయగా కొత్తగూడెం చేరుకున్నారు. కాగా, ఆయనకు హైదరాబాద్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో రెండు రిపోర్ట్లలో నెగిటివ్ రావడం, మరో రిపోర్ట్ ఫలితం పూర్తిగా రాక ముందే డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో శుక్రవారం ఉదయం ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ భద్రాద్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి భాస్కర్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించారు. దీంతో డీఎస్పీని సింగరేణి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో అతడి పేరుతో ఇద్దరు ఉండగా, ఒకరికి బదులు డీఎస్పీని డిశ్చార్జ్ చేశారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ విషయమై డీఎంహెచ్ఓ భాస్కర్, డీఎస్ఓ చైతన్యను ‘సాక్షి’ సంప్రదించగా, అటువంటిదేమీ లేదని, అవన్నీ తప్పుడు ప్రచారాలంటూ కొట్టిపారేశారు. శనివారం ఉదయం మరోసారి డీఎస్పీకి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. -
రాష్ట్రంలో మరో పాజిటివ్...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఓ యువతికి పాజిటివ్ వచ్చినట్లుగా నిర్ధారించారు. ఆమె ఇటీవలే ఇటలీ నుంచి వచ్చింది. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడున్న ఆమె కొత్తగూడెంలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా.. కోవిడ్ వైరస్ లక్షణాలు కన్పించడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు ఈ నెల 11న గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె నమూనాలు గాంధీలోనే పరీక్షించగా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మరోసారి నమూనాలను పుణే ల్యాబ్‌కు పంపగా, శుక్రవారం అందిన నివేదికలో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, మంచిర్యాలకు చెందిన ఒక వ్యక్తి, అతడి స్నేహితుడు ఇద్దరికీ కోవిడ్ లక్షణాలు ఉండటంతో గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే సౌదీ నుంచి వచ్చిన మరో కోవిడ్ అనుమానితుడికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరి నమూనాలను పుణేలోని ల్యాబ్‌కు పంపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లికి చెందిన మరో కోవిడ్ అనుమానితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడు లండన్‌లో చదువుకుంటూ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఖమ్మంలోని శ్రీరామ్‌హిల్స్‌కు చెందిన మరో వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా.. వెంటనే హైదరాబాద్ తరలించారు. వీరిద్దరికీ వైరస్ లేనట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి (47) ఐదు రోజుల క్రితం సౌదీ అరేబియా నుంచి వచ్చాడు. దగ్గు, జ్వరం బాధ పడుతుండటంతో పరీక్షించిన వైద్యులు.. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఇతనికి కరోనా వైరస్ లేనట్లు నిర్ధారణ అయింది. సారంగాపూర్ మండలం కోనాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి 20 రోజుల కింద బహ్రెయిన్ నుంచి వచ్చాడు. దగ్గు తీవ్రంగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. 24 గంటల పాటు వైద్యసేవలు అందించిన తర్వాత తగ్గుముఖం పట్టకపోతే హైదరాబాద్‌కు తరలించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. బెంగళూరు నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ 88 మందితో కాంటాక్ట్ కాగా, వారందరికీ కోవిడ్ పరీక్ష నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. నయమైన వ్యక్తి మినహా మిగిలిన పాజిటివ్ వచ్చి న నలుగురు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. వారితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో వైద్య ఆరోగ్య శాఖ నిమగ్నమైంది. ఫీవర్‌కు మరో అనుమానిత కేసు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో శనివారం మరో అనుమానిత కోవిడ్ కేసు నమోదైంది. నల్లగొండ జిల్లా విమలపల్లి మండలం, శెట్టపాలెం గ్రామా నికి చెందిన ఓ వ్యక్తి (32) ఇటీవల చైనా నుంచి మలేషియాకు.. అక్కడి నుంచి భారత్ వచ్చాడు. అతడు కొద్ది రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. శనివారం అతడిని కుటుంబ సభ్యు లు కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడి నమూనాలను గాంధీ ల్యాబ్‌కు పంపనున్నారు. ప్రస్తుతం వికారాబాద్‌లో హరిత హోటల్, ఫారెస్ట్ అకాడమీ వంటి సంస్థల్లో ఐసోలేషన్ వార్డులు ఉంచుతారు. కోవిడ్ బాధితుల సంఖ్య మరీ పెరిగితే గచ్చిబౌలి స్టేడియానికి అనుబంధంగా ఉండే 400 గదులను కూడా వాడుకోవాలని నిర్ణయించారు. కలెక్టర్లకు విస్తృత అధికారాలు.. కోవిడ్ వైరస్ నేపథ్యంలో జిల్లాలకు వచ్చే విదేశీ ప్రయాణికుల వివరాలు, వారి ద్వారా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కలెక్టర్లకు విస్తృత అధికారాలు ఇవ్వా లని నిర్ణయిం చారు. ప్రకృతి వైప రీత్యాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఇప్పుడు కూడా కలెక్టర్లు అలాంటి చర్యలే తీసుకోవాలని నిర్ణయించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని చెబుతున్నారు. -
పాల్వంచలో మరో విద్యుత్ ప్లాంట్ !
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో మరో విద్యుత్ ప్లాంట్ నిర్మించడంపై జెన్కో యాజమాన్యం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన సూపర్ క్రిటికల్ ఆల్ట్రా యూనిట్స్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై గురువారం సర్వే చేపట్టారు. 1966 –78 మధ్య కాలంలో నిర్మించిన కేటీపీఎస్ ఓఅండ్ఎం(720 మెగావాట్ల) ప్లాంట్లలో ఈ ఏడాది డిసెంబర్ 31తో ఉత్పత్తి ఆపేయాల్సి ఉంది. అనంతరం కర్మాగారాన్ని నేలమట్టం చేస్తారు. అయితే ఇక్కడి భౌగోళిక వనరులను ఉపయోగించి ఓఅండ్ఎం కర్మాగారం స్థానంలో మరో ప్లాంట్ నిర్మించే అంశంపై బీహెచ్ఈఎల్, జెన్కో సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సర్వే చేశారు. మూసివేత అనంతరం నేల మట్టం చేయకుండా భవిష్యత్ ప్లాంట్‌కు ఉపయోగకరంగా పనిచేసే నిర్మాణాలను పరిశీలించారు. ముఖ్యంగా కూలింగ్ టవర్ల స్థితిగతులపై అధ్యయనం చేశారు. అయితే, సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ కంటే మెరుగైన టెక్నాలజీతో ప్లాంట్ రూపుదిద్దుకోవడానికి ఇక్కడ భూమితో పాటు బొగ్గు, నీటి వసతులు పుష్కలంగా ఉన్నాయని సర్వే బృందం గుర్తించింది. దీని వల్ల అతి తక్కువ మోతాదులో మాత్రమే కాలుష్యం వెలువడుతుందని చెబుతున్నారు. కొత్త టెక్నాలజీతో నిర్మించే సూపర్ క్రిటికల్ ఆల్ట్రా యూనిట్లను భారత దేశంలోనే మొదటిసారిగా పాల్వంచలో ఏర్పాటు చేయాలని యోచిస్తుండటం విశేషం. ఇప్పటివరకూ యూనిట్లకు మరమ్మతులు వస్తే.. చాలా రోజుల పాటు రాష్ట్ర గ్రిడ్‌కు ఉత్పత్తి నిలిచిపోయేది. అయితే ఆల్ట్రా యూనిట్లకు మరమ్మతులు తక్కువని, ఒకవేళ వచ్చినా చేయడం సులువని అధికారులు చెబుతున్నారు. -
సీఎంతో మాట్లాడి అవసరమైన నిధులు
సాక్షి, కొత్తగూడెం: పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి జిల్లా అభివృద్ధికి కావాల్సినన్ని నిధులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం చుంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ధనలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వారం రోజుల తర్వాత మరోసారి జిల్లా పర్యటనకు వస్తానని, అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతానని చెప్పారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు యువకుల కంటే ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ మాటలు చెప్పడమేనా.. పనులు చేయిస్తున్నారా అని వనమాను అడగగా.. బాగా పని చేయిస్తున్నారని ఆయన బదులిచ్చారు. తర్వాత ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలని, మిగిలిన సమయాల్లో కలసికట్టుగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. 30 రోజుల ప్రణాళికను సీఎం కేసీఆర్ చాలెంజ్‌గా చేపట్టారని, ఆయన ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. ‘మన ఇల్లు–మన ఊరు’ అనే దృక్పథం అందరిలో రావాలన్నారు. చుంచుపల్లి తండా పంచాయతీలో చెత్తబుట్టలు విరాళంగా ఇచ్చిన నాయక్ పేరు, ఫొటోను చక్కగా ప్రదర్శించాలని చెప్పారు. సర్పంచ్ ధనలక్ష్మి తన అత్తగారి జ్ఞాపకార్థం గ్రామంలో ట్రీ గార్డుల ఏర్పాటుకు రూ.5 లక్షలు విరాళం ఇవ్వగా ఆమెను అభినందించారు. ఇలాంటి ఆదర్శ గ్రామాలపై మరింత ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. దేశానికి గాంధీ స్వాతంత్య్రం తీసుకొస్తే, తెలంగాణకు కేసీఆర్ తెచ్చారని అన్నారు. ప్రతి గ్రామంలో శ్రమదానం చేసేందుకు అన్ని వర్గాలు ముందుకు రావాలని కోరారు. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇస్తున్నట్లు ప్రకటించారు. చెత్త బయట పడేసినా, చెట్లు నరికినా జరిమానాలు భారీగా ఉంటాయని హెచ్చరించారు. గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత లేదని, స్వీపర్ల జీతాలు సైతం పెంచామని చెప్పారు. ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేకుండా రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తామని, ఈ పథకాన్ని భద్రాద్రి జిల్లా నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. సమస్యలపై అవగాహన ఉంది... రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ తాను ఖమ్మం నుంచి గెలిచినప్పటికీ పుట్టింది మాత్రం భద్రాచలంలోనేనని, ఏజెన్సీ ప్రాంత సమస్యలన్నింటిపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. బాల్యమంతా భద్రాద్రి ఏజెన్సీలోనే గడిచిందని, ఈ జిల్లా అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పాటుపడతానని హామీ ఇచ్చారు. గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. 30 రోజుల ప్రణాళిక సీఎం కేసీఆర్ మానస పుత్రిక అన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రజలందరూ కలసికట్టుగా ముందుకు వెళ్లాలన్నారు. సర్పంచ్‌గా ప్రస్థానం ప్రారంభించిన తాను రాష్ట్రంలో మొదటి మహిళా మంత్రిగా ప్రజల ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి గురించి ఇంత భృహత్తరంగా ఆలోచించిన ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరేనన్నారు. భద్రాద్రి జిల్లాలో 30 రోజుల ప్రణాళిక అమలు బాగుందన్నారు. చుంచుపల్లి తండాలో ఈ కార్యక్రమం అమలు తీరు బాగుందని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ గ్రామపంచాయతీకి రూ.5 లక్షలు తన ఎంపీలాడ్స్ నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య, వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ జగత్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ బాణోత్ శాంతి తదితరులు పాల్గొన్నారు. -
బూడిదకు భారీగా వసూళ్లు
సాక్షి, పాల్వంచ: కేటీపీఎస్ నుంచి వెలువడే బూడిద (యాష్) తరలింపులో వసూళ్ల దందా సాగుతోంది. అధికారుల అండదండలతో కొందరు ప్రైవేటు వ్యక్తులు భారీగా డబ్బు దండుకుంటున్నారు. బూడిదను తరలించాలంటే చేయి తడపనిదే బండి కదలని పరిస్థితి నెలకొంది. ఈ బూడిదను ఉచితంగా అందించాల్సి ఉండగా.. పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు ముట్టజెపితే వెంటనే లోడ్ చేయడం, లేదంటే వెయిటింగ్ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. అధికారులు తమ చేతికి మట్టి అంటకుండా ప్రైవేట్ వ్యక్తులతో ఈ దందాను ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్న చందంగా విస్తరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ఓఅండ్ఎం, 5, 6, 7 దశల్లో విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో బొగ్గును మండించడం ద్వారా నిత్యం బూడిద విడుదల అవుతుంది. దీన్ని పుల్లాయిగూడెం, సురారం తదితర ప్రాంతాల్లో ఉన్న యాష్ పాండ్లకు పంపిస్తుంటారు. సిమెంట్ ఫ్యాక్టరీలకు, ఇతర అవసరాలకు మెట్రిక్ టన్నుకు రూ.50 చొప్పున ముందే డీడీ రూపంలో చెల్లిస్తే బూడిదను అందిస్తారు. అయితే సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే ట్యాంకర్లకు బూడిద అందించే క్రమంలో చేతివాటం ప్రదర్శిస్తుండడం ఇక్కడ ‘మూమూలు’గా మారింది. ఇక ఉచితంగా అందించే వారినుంచి అయితే వేల రూపాయలు దండుకుంటున్నారు. డబ్బు ఇవ్వని వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి రోజూ వందల సంఖ్యలో ట్యాంకర్లు, టిప్పర్లు, లారీలు వస్తుంటాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్థానికంగా కొందరు ప్రైవేట్ వ్యక్తులు జోక్యం చేసుకుని భారీ ఎత్తున అక్రమాలకు తెరలేపుతున్నారు. రవాణా చేసే క్రమంలో లారీలపై కనీసం పట్టాలు కూడా కట్టుకోకుండా వెళుతున్నారని పలువురు వాపోతున్నారు. లబోదిబోమంటున్న బ్రిక్ వ్యాపారులు... యాష్ పాండ్ల నుంచి బూడిదను తీసుకెళ్లేందుకు కొందరు జెన్కో యాజమాన్యం నుంచి అనుమతి తీసుకుని లారీల ద్వారా తరలిస్తుంటారు. అంతేగాక సైలోల నుంచి కూడా తీసుకెళుతుంటారు. ఈ క్రమంలో ఒక్కో లారీకి కనీసం రూ.1000 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తుంటారు. ఇలా అక్రమంగా వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయి అధికారికి బండికి రూ.500 ఇవ్వాలని, కింది స్థాయిలో మామూళ్లు యథావిధిగా ఉంటాయని చెపుతూ వేల రూపాయలు వసూలు చేస్తున్నారని పలువురు బ్రిక్స్ ఇండస్ట్రీ నిర్వాహకులు వాపోతున్నారు. ఈ వ్యాపారులే కాకుండా భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, వరంగల్, గుడివాడ తదితర ప్రాంతాల నుంచి రోజుకు 400 పైగా వాహనాల్లో బూడిద తరలిస్తున్నారంటే ఈ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ వ్యక్తులకు గాకుండా నేరుగా బ్రిక్స్ కంపెనీలు, సిమెంట్ ఫ్యాక్టరీల వారికే బూడిద చేరేలా చర్యలు తీసుకోవాలని, పైవేట్ దందాపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. మా దృష్టికి తీసుకొస్తే చర్య తీసుకుంటాం డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. డబ్బు తీసుకుని బూడిదను అందించకూడదు. అలా ఇబ్బంది పడిన వ్యక్తులు ఎవరైనా నేరుగా మాకు ఫిర్యాదు చేస్తే తప్పక చర్య తీసుకుంటాం. – రవీందర్, ఇన్చార్జ్ సీఈ -
‘నామా’ను గెలిపించాలని ప్రచారం
సాక్షి, సూపర్‌బజార్(కొత్తగూడెం): ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్‌షాప్ వద్ద ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కారు గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని, సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. సింగరేణికి మరింత భవిష్యత్ చేకూరాలంటే టీఆర్ఎస్ను గెలిపించాల్సిన బాధ్యత కార్మికవర్గంపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.ఎ.రజాక్, రీజనల్ కార్యదర్శి కూసన వీరభద్రం, లెవెన్‌మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, సెంట్రల్ కౌన్సిల్ మెంబర్లు పొదిల శ్రీనివాసరావు, విప్లవరెడ్డి, పిట్ సెక్రటరీ ఎండీ.సత్తార్‌పాషా, వాసు, శంకర్, పద్మ పాల్గొన్నారు. నామా, వనమాతో అభివృద్ధి సాధ్యం పాల్వంచరూరల్: టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం మండల పరిధి పాండురంగాపురం, సూరారంలో నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి నామాను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు మాటాడుతూ నామాను గెలిపిస్తే ఇటు ఎంపీ, అటు ఎమ్మెల్యే వనమా ద్వారా నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గురువారం ఖమ్మంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు జగదీష్‌కుమార్, రాణి, జి.రాంబాబు, రవీందర్, నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వర్లు, బొందిల హరి, లక్ష్మీనర్సయ్య, నాగిరెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి: జలగం పాల్వంచ: టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోరుతూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ బుధవారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీపీఎస్ అంబేడ్కర్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేటీపీఎస్ ఉద్యోగులకు కరపత్రాలు పంపిణీ చేసి నామా గెలుపునకు సహకరించాలని కోరారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో నాయకులు బిక్కసాని నాగేశ్వరరావు సీతారామిరెడ్డి, సురేష్‌బాబు, బుడగం రవి, నల్లమల్ల సత్యం, బిల్లా సృజిత్, అయితా గంగాధర్, జనార్దన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, బాషా, పోతురాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఐదో వార్డులో పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. నామా నాగేశ్వరరావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. -
గులాబీ గూటికి వనమా..?
సాక్షి, కొత్తగూడెం: టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కన్ను భద్రాద్రి, ఖమ్మం జిల్లాలపైనే ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకుంటూనే ఉన్నారు. తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు కారెక్కేందుకు రంగం సిద్ధమైంది. వనమాతో నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడి ఒప్పించినట్లు తెలుస్తోంది. అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వనమాతో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి, భద్రాద్రి జిల్లా అభివృద్ధి అంశాలపై వనమా కేసీఆర్, కేటీఆర్‌లతో చర్చించినట్లు సమాచారం. దీంతో వనమా టీఆర్ఎస్లో చేరిక ఖాయమైనట్లే అని తెలుస్తోంది. చేరికకు సంబంధించిన తేదీ ఖరారు కావాల్సి ఉంది. ప్రస్తుత శాసనసభలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న వనమాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వనమా చేరికతో ఆ ప్రభావం జిల్లా మొత్తం పడనుంది. అధికశాతం కార్యకర్తలు వనమాకు మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వనమా తీసుకున్న ఈ నిర్ణయం ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్కు మరింత మేలు చేస్తుందని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కలిపి టీఆర్ఎస్కు కేవలం ఒక్క ఖమ్మం స్థానంలో మాత్రమే విజయం దక్కింది. మిగిలిన తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ ఇప్పటికే గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు రెడీ అయ్యారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ కారెక్కేందుకు నిర్ణయించుకున్నారు. తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. రెండు వారాల తేడాతో వరుసగా ముగ్గురు ఎమ్మెల్యేలు జిల్లా నుంచి కారెక్కేందుకు సిద్ధం కావడం గమనార్హం.